Virat Kohli Grey Beard | సింగిల్ ఫోటోతో సోషల్ మీడియాను షేక్ చేసిన కోహ్లీ | ABP Desam
విరాట్ కోహ్లీ రెండు నెలల తర్వాత క్రికెట్ బ్యాట్ పట్టాడు. నిన్న గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ నయూమ్ అమీన్ తో కలిసి క్రికెట్ ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు కొహ్లీ ఈ ఫోటో షేర్ చేశాడు. ఆర్సీబీ కప్పు కొట్టిన తర్వాత కోహ్లీ రెండు నెలలు గా క్రికెట్ కి దూరంగా ఉంటున్నాడు. తన భార్య అనుష్క శర్మ, ఇద్దరు పిల్లలతో కలిసి లండన్ లోనే ఉంటున్న కోహ్లీ పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కే టైమ్ కేటాయించాడు. మధ్యలో వింబుల్డన్ టైమ్ లో ఓసారి తళుక్కుమని మెరిశాడు అంతే. అయితే నిన్న ప్రాక్టీస్ సెషన్ ఆ తర్వాత ప్రైమ్ సీఈవో శాష్ కిరణ్ తో దిగిన ఈ ఫోటో రెండు సోషల్ మీడియాను షేక్ చేశాయి. రీజన్ ఏంటో తెలుసా విరాట్ కోహ్లీ గ్రే బేర్డ్ తో కనిపించటం. ఆయన గడ్డం తెల్లబడిపోయి చూడటానికి కోహ్లీ ఇంత ముసలోడు అయిపోయాడు అనిపించేలా కనిపించాడు అంతే. సోషల్ మీడియా తగలబడిపోయింది. కొంత మంది ఇదేంటీ ఇలా అయిపోయాడని మరికొంత మంది ఏజ్ అయిపోతోందని ఒకటే డిస్కషన్. వాస్తవానికి ఏజ్ కంటే స్ట్రెస్ వల్ల అలా గ్రే హెయిర్స్ ఫాస్ట్ గా రావొచ్చు. క్రికెటర్లకు ఉండే విపరీతమైన ఒత్తిడి దీనికి రీజన్ కావచ్చు. రెండోది ఇట్స్ కామన్ థింగ్. పర్ సపోజ్ ఇది ధోని టీమిండియా కెప్టెన్సీ చేస్తున్న ఫోటో. ఇది ఇప్పుడు ధోని మంచిగా రంగేసుకుని మెయింటెన్ చేస్తూ కూల్ లుక్స్ తో కనిపిస్తున్న ఫోటో. మెయింటెన్ చేస్తే మంచిగా కనిపించొచ్చు. లేదు రియల్ లుక్స్ తోనూ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇది కంప్లీట్ గా వాళ్ల ఛాయిస్. ఆ మాత్రం దానికి ఏంటో హడావిడి అస్సలు అర్థం కావట్లేదు. ఫిట్నెస్ లో ఇప్పటికీ కొహ్లీని కొట్టేటోడే లేడు. ఇప్పటికే టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చిన కోహ్లీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాడు. 2027 వరల్డ్ కప్ ఆడాలని కచ్చితంగా విరాట్ భావిస్తున్నాడు. అయితే అందుకు బీసీసీఐ సహకరిస్తుందా లేదా 36ఏళ్ల ఏజ్ లోనూ కొహ్లీని ఇక రెస్ట్ తీసుకోవాలని కుర్రాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని కింగ్డమ్ ను కూల్చేస్తారా చూడాలి.





















