SS Rajamouli on SSMB 29 November Revelation | చరిత్ర చూడని అద్భుతాన్ని చూస్తారంటున్న రాజమౌళి | ABP Desam
నేను తీస్తున్న సినిమా ఓ ఫోటోలో చూపించేది కాదు..ఓ ప్రెస్ మీట్ లో చెప్పేది కాదు. దాని కోసం ఓ అద్భుతాన్ని ప్లాన్ చేస్తున్నా. నవంబర్ వరకూ ఓపిక పట్టండి అంటూ మహేశ్ బాబు పుట్టిన రోజు ఓ పోస్ట్ పెట్టారు ఎస్ ఎస్ రాజమౌళి. మహేశ్ బాబు ప్రీలుక్ ఫోటో అంటూ మెడలో శివమాలతో ఉన్న బాబ్ ఫోట్ ను పెడుతూనే నవంబర్ లో తనేం చూపించనున్నారో ఓ పోస్టర్ కార్డ్ పెట్టారు రాజమౌళి. దాంట్లో ఆయన ఏం రాశారంటే
భారత దేశంలో ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులకు ప్రత్యేకించి మహేశ్ బాబు అభిమానులకు నేను చెప్పేది ఏంటంటే...మేం షూటింగ్ మొదలుపెట్టింది చాలా కాలం అయ్యింది. ఈ సినిమా దేని గురించి తెలుసుకోవాలనే మీ తాపత్రయాన్ని నేను అభినందిస్తున్నాను. కానీ ఈ సినిమా కథ పరిధి చాలా విస్తృతంగా ఉన్నా దృష్ట్యా నేనోదో ఫోటోలు వదిలితేనో..లేదా ప్రెస్ మీట్ లు పెడితేనే సరిపోదు అలా న్యాయం చేయలేను కూడా. అసలు మహేశ్ బాబుతో నేను తీస్తున్న సినిమా దేని గురించి , ఈ కథ లోతు ఎంత..మేం సృష్టిస్తున్న కథా ప్రపంచం ఎంత పెద్దది అని పూర్తిగా అందరికీ అర్థమయ్యేలా
ఓ సర్ ప్రైజ్ ను ప్లాన్ చేస్తున్నాం. అది ఏంటో మీకు నవంబర్ లో నే తెలుస్తుంది. కానీ ఒక్కటైతే చెబుతున్నా అలాంటిది మీరు ఎప్పుడూ చూసి కూడా ఉండరు. అంత అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దుతున్నాం. కనుక అప్పటి వరకూ కాస్త ఓపిక పట్టండి.
SS రాజమౌళి అని రాసి ఈ పోస్టర్ కార్డు పెట్టారు జక్కన్న. చూడాలి అంత అద్భుతమైన విషయం నవంబర్ లో ఆయన రివీల్ చేయబోతున్నారో..ఏం చెప్పబోతున్నారో.





















