Rajasthan Royals New Captain Dhruv Jurel | Sanju Samson పొమ్మనలకే పొగబెట్టారా.? | ABP Desam
ఐపీఎల్ అంటేనే అంత పూర్తిగా కమర్షియల్ గేమ్. అక్కడ బంధాలు అనుబంధాల కంటే డబ్బుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని మరోసారి ప్రూవ్ అయ్యింది. అదే సంజూ శాంసన్ విషయంలో. ఎందుకంటే పదేళ్లుగా అతను రాజస్థాన్ రాయల్స్ లో అంతర్భాగం. 2013లో ఆర్ ఆర్ తరపునే ఐపీఎల్ డెబ్యూ చేసిన సంజూ..2016 వరకూ ఆర్ఆర్కే ఆడాడు. 16లో అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ కి రెండేళ్లు పాటు ఆడిన సంజూ తిరిగి 2018లో రాజస్థాన్ గూటికి చేరుకున్నాడు. ఆ తర్వాత వరుసగా ఏడేళ్లుగా రాజస్థాన్ కు అన్నీ తానై నడిపించాడు. సంజూ లోయల్టీని గౌరవించేలా రాజస్థాన్ ఫ్రాంచైజీ కూడా కెప్టెన్సీ ఇచ్చి గౌరవించింది. కానీ లాస్ట్ ఇయర్ అంతా మారిపోయింది. ద్రవిడ్ కోచ్ గా వచ్చిన తర్వాత ఆయన యంగ్ స్టర్స్ వైపే ఎక్కువగా దృష్టి సారించారు. రానున్న పదేళ్ల కోసం టీమ్ తయారు చేయటం లో భాగంగా వైభవ్ సూర్యవంశీ లాంటి 14ఏళ్ల చిన్న కుర్రాడిని రాజస్థాన్ తరపున అరంగేట్రం చేయించాడు. లక్కీగా వైభవ్ కూడా ఓపెనర్ గా దుమ్మురేపి సింగిల్ సీజన్ తో సెంచరీ వీరుడిగా...పరుగుల మెషీన్ గా అవతరించాడు. ఫలితంగా అప్పటివరకూ ఆర్ఆర్ కు ఓపెనర్ గా ఉన్న సంజూ వన్ డౌన్ లోనూ కొన్ని సార్లు మిడిల్ ఆర్డర్ లోనూ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఇది సంజూకు అస్సలు నచ్చలేదంట. అంటే తను యంగ్ స్టర్స్ కి వ్యతిరేకం అని కాదు. కానీ పదేళ్లుగా టీమ్ లో అంతర్భాంగా ఉన్న తనను చర్చించకుండా జట్టు యాజమాన్యం నిర్ణయాలపై అలిగిన సంజూ ముభావంగా సీజన్ అంతా ఆడాడు. పైగా గతేడాది మెగా వేలానికి ముందు రాజస్థాన్ 18కోట్ల రూపాయలతో తనను రీటైన్ కూడా చేసుకుంది. కానీ ఏడాది తిరగకముందే తనను వేలానికి వదలిపెట్టాలని సంజూ రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నాడు టీమ్ మేనేజ్మెంట్ కు. దీంతో మండుకొచ్చిందేమో రాజస్థాన్ నిన్న చడీ చప్పుడు లేకుండా కెప్టెన్ జురెల్ అంటూ ఈ పోస్టర్ వదిలింది అలా అని తనను కెప్టెన్ గా ఇకపై నడిపిస్తాడు అని కూడా చెప్పలేదు...సంజూ రాజస్థాన్ వదిలేస్తున్నాడు చెన్నై లేదా కేకేఆర్ వైపు వెళ్లాలని చూస్తున్నాడని వార్తలు రాగానే ధృవ్ జురెల్ గురించి పోస్ట్ పెట్టడంతో ఇకపై నాయకుడిగా జురెల్ నడిపిస్తాడని...సంజూ ను బయటకు పొమ్మనకుండానే ఇలా సోషల్ మీడియాలో పొగబెట్టారనే టాక్ నడుస్తోంది. చూడాలి పదేళ్ల పాటు ఆర్ఆర్ లో అన్నీ తానై ఉన్న 31ఏళ్ల సంజూ శాంసన్ ఏ టీమ్ వైపు వెళ్తాడో.





















