మూడో వన్డేలో అయినా భారత్ కి గెలుపు సాధ్యం అవుతుందా?
ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ లో మొదటి రెండు వన్డేలు ఓడిపోయి సిరీస్ పోగొట్టుకున్న భారత్ కనీసం మూడో వన్డే లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటోంది. తొలి మ్యాచ్ జరిగిన సిడ్నీలోనే ఈరోజు శనివారం మూడో మ్యాచ్ కూడా జరగబోతోంది. అయితే 1st మ్యాచ్ లో ఒక్క రాహుల్ తప్ప.. మిగిలిన బ్యాటర్లంతా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్లు రోహిత్, కోహ్లీ పరమ చెత్త ఆటతో వెంటవెంటనే వికెట్లు పారేసుకోవడంతో ఇండియా చాలా తక్కువ స్కోర్ కే 9 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఇండియన్ బౌలింగ్ యూనిట్ ఆస్ట్రేలియా బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయింది.
ఫలితంగా దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది టీమిండియా. ఇక దీనికితోడు వర్షం కూడా భారత్ ఓటమికి కారణమైంది. అయితే కనీసం రెండో వన్డే లో అయినా భారత్ కంబ్యాక్ ఇస్తుందని, ఆస్ట్రేలియాని ఓడించి.. లెక్క సరిచేస్తుంది అనుకున్నారంతా. కానీ కోహ్లీ కి అచ్చొచ్చిన అడిలైడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కూడా భారత్ అన్ని విభాగాల్లో ఫెయిల్ అయి మళ్లీ ఓడిపోయింది. దీంతో 3 వన్డేల సీరీస్ ని మరో వన్డే మిగిలుండగానే 2-1 తో ఆసీస్ సీరీస్ సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు భారత్ కనీసం మూడో వన్డే అయినా గెలిచి కనీసం పరువు నిలబెట్టుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అయితే అడిలైడ్ లో కూడా కోహ్లీ డక్కౌట్ అయి ఫ్యాన్స్ ని నిరాశపరిచినా.. రోహిత్ 72, అయ్యర్ 61 రన్స్ తో ఫాంలోకొచ్చారు. దీంతో సిడ్నీలో కోహ్లీ కూడా ఫాంలోకొచ్చి మ్యాచ్ గెలిపించాలని బలంగా కోరుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక మేరకు కోహ్లీ కూడా ఫాంలోకొచ్చి.. మంచి స్కోర్ చేసి.. ఈ మ్యాచ్ అయినా భారత్ గెలుస్తుందా? పరువూ పరువు నిలబెట్టుకుంటుందా? అనేది చూడాలి. అయితే ఈ మ్యాచ్ కి కూడా వర్షం ముప్పు ఉండటంతో మళ్లీ DLS system ప్రకారం మ్యాచ్ ఆడాల్సి వస్తే.. కచ్చితంగా అద ఇండియాకి ఎదురుదెబ్బే.





















