కోహ్లీ రిటైర్మెంట్..? ఆఖరి మ్యాచ్ ఆడబోతున్నాడా?
ఈరోజు ఆస్ట్రేలియా తో సిడ్నీ వేదికగా జరగబోయే మూడో వన్డేనే కింగ్ కోహ్లీ విరాట్ కోహ్లీకి ఆఖరి international మాచ్ కాబోతోందా? ఇప్పుడిదే టెన్షన్ కోహ్లీ ఫ్యాన్స్ తో పాటు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరినీ భయపెడుతోంది. 10 నెలల క్రితం కోహ్లీ ఇదే స్టేడియంలో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడి మొత్తం ఫార్మాట్ కే రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇప్పుడు మళ్లీ అదే స్టేడియంలో సిరీస్ ఆఖరి వన్డే మ్యాచ్ అడబోతుండటం.. అందులోనూ తొలి రెండు మ్యాచుల్లో కనీసం ఖాతా కూడా తెరవకుండా దారుణంగా కోహ్లీ డకౌట్ కావడంతో కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చేయడమే బెటర్ అంటూ trolls వస్తున్న సమయంలో.. మన రన్ మెషీన్ ఏదైనా drastic డెసిషన్ తీసుకుంటాడా? ఇదే నిజంగానే ఈ మ్యాచ్ లో kohli.. వన్డే ఫార్మాట్ కి కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తాడా? అనే అనుమానం కలుగుతోంది అందరికీ.
ఇక ఆల్రెడీ 2వ వన్డే లో డక్కౌట్ అయి పెవిలియన్ కి వెళ్తున్న టైంలో ఫ్యాన్స్ కి కోహ్లీ అభివాదం చేయడం చూస్తే.. నిజంగానే ఏదో జరగబోతోందని ఫ్యాన్స్ తెగ భయపడి పోతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే మీరేం అంటారు? కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోవాలంటారా? లేదంటే ఇంకొన్నాల్లు క్రికెట్ లో కంటిన్యూ కావాలంటారా? కామెంట్ చేసి చెప్పండి.





















