Aus vs Ind 3rd ODI Highlights | మూడో వన్డేలో ఆసీస్ 9 వికెట్ల తేడాతో గెలిచిన భారత్ | ABP Desam
సీన్ అయిపోయింది అన్నారు. ఇదే లాస్ట్ సిరీస్ అన్నారు. ఇదిగో ఇవాళే రిటైర్మెంట్ అన్నారు. వాళ్లు ఎక్కడైనా అలా కనిపించారా భయ్యా. ఆసీస్ తో వన్డే సిరీస్ పోయినా సరే మూడో వన్డేలో కంగారూలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా RO KO ఆడిన ఆట చూడాలి ఇవాళ. దుమ్ము దుమారం అంతే. ప్రత్యేకించి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో ఆసీస్ గడ్డపై తన ప్రతాపాన్ని మరో సారి చూపాడు. సెకండ్ వన్డేలో సెవెంటీస్ లో అవుటైనా తన ఫామ్ ను మరింత ముందుకు తీసుకువెళ్తూ ఆసీస్ విసిరిన 237పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో కెరీర్ లో 33వ సెంచరీ కొట్టేశాడు రోహిత్ శర్మ. 125 బాల్స్ ఆడి 13ఫోర్లు 3 సిక్సర్లతో 121పరుగులు చేశాడు. గిల్ 24పరుగులకే అవుటైనా కింగ్ విరాట్ కొహ్లీతో కలిసి మిగిలిన పనిని ఫినిష్ చేశాడు హిట్ మ్యాన్. కొహ్లీ కూడా ఫస్ట్ రెండు వన్డేల్లో డకౌట్ అయ్యాయన్న టెన్షన్ తీసి పక్కన పడేసి మూడో వన్డేలో ప్రశాంతంగా ఆడేసి తన ఫామ్ ను మళ్లీ దొరకబుచ్చుకున్నాడు. 81 బంతులు ఆడి 7 ఫోర్లతో 74పరుగులు చేసి కెరీర్ లో 75వ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. మొత్తంగా వీళ్లద్దరి దూకుడుతో 9వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచ్ మార్ష్ 41పరుగులు, మిడిల్ ఆర్డర్ లో మ్యాట్ రెన్ షా 56పరుగులు చేశారు. అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో భారత బౌలర్లు వికెట్లు దొరకబుచ్చుకున్నారు. ప్రత్యేకించి గంభీర్ గారాల పట్టి హర్షిత్ రానా 4 వికెట్లతో మెరిశాడు. సుందర్ 2 వికెట్లు తీయగా...సిరాజ్, ప్రసిద్ధ్, కుల్దీప్, అక్సర్ పటేల్ చెరో వికెట్ తీయటంతో కిందా మీద పడి 236పరుగులు చేసింది ఆస్ట్రేలియా. మొత్తంగా భారత్ మూడో వన్డేలో గెలిచినా సిరీస్ 1-2 తేడాతో ఆసీస్ కు సమర్పించుకుంది భారత్.





















