Ruturaj Gaikwad: ఎప్పుడో ఐపీఎల్‌లో మ్యూజిక్ స్టార్ట్ చేశాడు.. ఇంకా ఆపలా.. రుతురాజ్ మరో రికార్డు
విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్ వరుసగా మూడు సెంచరీలు సాధించాడు.
మహారాష్ట్ర కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సంచలన ఫాం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే టోర్నీలో రుతురాజ్ వరుసగా మూడు సెంచరీలు బాదేశాడు. శనివారం కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో 129 బంతుల్లోనే 124 పరుగులు బాదేశాడు. వీటిలో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాడు.
రుతురాజ్‌కు రాహుల్ త్రిపాఠి (99) చక్కని సహకారం అందించాడు. అయితే ఒక్క పరుగు తేడాతో తన సెంచరీ మిస్సయింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 195 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబైని గైక్వాడ్, త్రిపాఠి ఆదుకున్నారు.
ఇది రుతురాజ్ గైక్వాడ్‌కు వరుసగా మూడో సెంచరీ. ఇంతకుముందు మధ్యప్రదేశ్‌పై 136 పరుగులు సాధించగా, చత్తీస్‌ఘర్‌పై 154 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సంవత్సరం ఐపీఎల్ నుంచే రుతురాజ్ అసమానమైన ఫాం కొనసాగుతోంది.
ఇంతకుముందు మయాంక్ అగర్వాల్ 2017-18 సీజన్‌లోనూ, ఆర్ సమర్థ్ 2020-21 సీజన్‌లోనూ వరుసగా మూడేసి సెంచరీలు సాధించారు. ఇప్పుడు రుతురాజ్ వారి సరసన చేశాడు. అయితే పృథ్వీ షా, దేవ్‌దత్ పడిక్కల్ వరుసగా నాలుగేసి సెంచరీలతో ఈ జాబితాలో ముందున్నారు. తర్వాత జరగబోయే మ్యాచ్‌లో కూడా రుతురాజ్ శతక్కొడితే.. వీరి రికార్డును సమం చేస్తాడు. విజయ్ హజారే ట్రోఫీలో మూడు ఇన్నింగ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ 414 పరుగులు సాధించాడు. తన సగటు 207గా ఉండటం విశేషం.
50 ఓవర్ల ఫార్మాట్ అయిన విజయ్ హజారే ట్రోఫీలో రాణించడం రుతురాజ్ గైక్వాడ్‌కు ఎంతో మంచిది అయింది. ఎందుకంటే త్వరలో సౌతాఫ్రికా టూర్‌లో వన్డే జట్టుకు సెలక్షన్ జరగనుంది. ఆ టూర్‌కు ఎంపిక అయి దక్షిణాఫ్రికా పిచ్‌లపై సత్తా చాటితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.
2021 ఐపీఎల్‌లో ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ 635 పరుగులు సాధించాడు. తన సగటు 45.35గా ఉండగా.. స్ట్రైక్ రేట్ 136.26గా ఉండటం విశేషం. సీజన్ ముగిసేసరికి ఆరెంజ్ క్యాప్‌ను కూడా దక్కించుకున్నాడు. జులైలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో గైక్వాడ్ అంతర్జాతీయ అరంగేట్రం కూడా చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ తనను రూ.6 కోట్లతో రిటైన్ చేసుకుంది.
Also Read: చావుదెబ్బ కొట్టారు కదయ్యా.. చెన్నై, కోల్‌కతా నిర్ణయాల వెనక పెద్ద స్కెచ్!
Also Read: ఆగని విరాట్ మంట.. జట్టును నాశనం చేయడం సులభం అన్న మాజీ క్రికెటర్!
Also Read: ICC Test Rankings: మయాంక్ దూకుడు..! 10 వికెట్ల అజాజ్ ర్యాంకు ఎంత మెరుగైందంటే..!
Also Read: Watch: మళ్లీ కలిసిన యువీ, ధోనీ..! ఎక్కడ.. ఎందుకు?
Also Read: Rahul Dravid: ద్రవిడ్ శాసనం..! కుంబ్లే నాటి రూల్ కఠినతరం చేసిన వాల్.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి