Kohli Post on Dhoni: ధోనీ అంటేనే కింగ్! కోహ్లీ చేసిన ఈ ట్వీటే నంబర్ వన్!
విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అతడు ఎంఎస్ ధోనీని 'కింగ్' అంటూ పొగిడేసిన పోస్టును లక్షల మంది లైక్‌తో పాటు రీట్వీట్ చేశారు.
టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. కాకపోతే ఇది మైదానంలో కాదు! మరి ఇంతకీ ఏంటా రికార్డు అనుకుంటున్నారా? ఈ ఏడాది క్రీడారంగంలో అత్యధిక ర్వీ ట్వీట్లు చేసిన ట్వీటు విరాట్‌దే. అతడు ఎంఎస్ ధోనీని 'కింగ్' అంటూ పొగిడేసిన పోస్టును లక్షల మంది లైక్‌తో పాటు రీట్వీట్ చేశారు.
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగు తొలి క్వాలిఫయర్‌లో దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్‌కింగ్స్ తలపడ్డాయి. ఈ పోరులో ఆఖరి వరకు దిల్లీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా ఆఖరి ఓవర్లో ఎంఎస్ ధోనీ మాయ చేశాడు. తన బ్యాటింగ్‌తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 'కింగ్ తిరిగొచ్చేశాడు. ఈ ఆటలో అత్యంత గొప్ప ఫినిషర్ మళ్లీ వచ్చేశాడు. ఈ రాత్రి ఎంఎస్ ధోనీ నన్ను సీట్లోంచి ఎగిరి గంతులేసేలా చేశాడు' అని అక్టోబర్ 10న కోహ్లీ ట్వీట్ చేశాడు. 2021లో క్రీడారంగంలో ఎక్కువగా రీట్వీట్ / లైక్ చేసిన పోస్టు ఇదే.
Anddddd the king is back ❤️the greatest finisher ever in the game. Made me jump Outta my seat once again tonight.@msdhoni
— Virat Kohli (@imVkohli) October 10, 2021
ఇక స్పోర్టింగ్ ఈవెంట్లకు సంబంధించి టోక్యో ఒలింపిక్స్ గురించి భారత్‌లో ఎక్కువ మంది ట్వీట్లు చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ఐపీఎల్-2021, ఐసీసీ టీ20 ప్రపంచకప్ నిలిచాయి. పారాలింపిక్స్, యూరో 2020 టాప్-5లో నిలిచి ఎక్కువ చర్చ జరిగాయి. క్రీడాకారుల్లో కోహ్లీ, ధోనీ, సచిన్ తెందూల్కర్, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్ గురించి ఎక్కువ మాట్లాడారు.
ఒలింపియన్ అథ్లెట్లలో పీవీ సింధు గురించి అధికంగా ట్వీట్లు చేశారు. ఆమె వరుసగా రెండో ఒలింపిక్ పతకం పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్వర్ణ పతకం పొందిన నీరజ్ చోప్రా, కాంస్యం అందుకున్న బజరంగ్ పునియా, బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను గురించి ఎక్కువ చర్చ జరిగింది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లపై ట్వీట్లు ఎక్కువగా చేశారు.
Also Read: Ganguly on IPL 2022:: ఒమిక్రాన్‌పై గంగూలీ కామెంట్స్..! వచ్చే ఐపీఎల్‌ను...?
Also Read: Rohit Sharma Update: బయటి మాటల్ని పట్టించుకోం.. బలమైన బంధమే ముఖ్యమన్న రోహిత్
Also Read: India's Tour Of South Africa: ఈ నలుగురూ ఆడితే దక్షిణాఫ్రికా టూర్‌లో భారత్‌కు తిరుగులేదు.. ఎవరంటే?
Also Read: Pushpa Event: పుష్ప ఈవెంట్లో ‘థ్యాంక్యూ వార్నర్’.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి