Virat Kohli-Rohit sharma rift: విరాట్, రోహిత్ వివాదంపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..! డ్రస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతోందో ఆయనకు తెలుసా??
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వివాదంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఆటగాళ్ల కన్నా ఆటే ముఖ్యమని స్పష్టం చేశారు. డ్రస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతోందో బయటకు చెప్పబోనని వెల్లడించారు.
![Virat Kohli-Rohit sharma rift: విరాట్, రోహిత్ వివాదంపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..! డ్రస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతోందో ఆయనకు తెలుసా?? ‘Nobody is bigger than the game’ – Union Sports Minister Anurag Thakur reacts to Virat Kohli-Rohit Sharma rumoured rift Virat Kohli-Rohit sharma rift: విరాట్, రోహిత్ వివాదంపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..! డ్రస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతోందో ఆయనకు తెలుసా??](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/17/497ed30e67366b417db979767092bb65_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
టీమ్‌ఇండియా ఇద్దరు సారథులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వివాదంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఆటగాళ్ల కన్నా ఆటే ముఖ్యమని స్పష్టం చేశారు. డ్రస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతోందో బయటకు చెప్పబోనని వెల్లడించారు. బీసీసీఐ సరైన చర్యలు తీసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కొన్నేళ్లుగా విరాట్, రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ నిజమనేలా కొన్ని సంఘటనలూ జరిగాయి. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2019 తర్వాత వీరి విభేదాలు తారస్థాయికి చేరాయని చాలా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ మంచి మిత్రలమంటూ ప్రకటనలు చేశారు. తాజాగా కోహ్లీ టీ20 కెప్టెన్సీ వదిలేశాక పరిణామాలు వేగంగా మారాయి. కొన్ని రోజుల ముందు 48 గంటల గడువిచ్చి వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగించారని వదంతులు వచ్చాయి. గంటన్నర ముందే తనకు ఫోన్ చేసి మాట్లాడి ఒక ముక్క చెప్పారని అతడే తాజాగా చెప్పాడు.
బీసీసీఐలో అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించడం సంచలనంగా మారింది. గతంలో ఆయన బీసీసీఐ అధ్యక్షుడుగా చేయడమే ఇందుకు కారణం. 'ఆటే అత్యున్నతం. ఆటను మించి ఎవరూ గొప్ప కాదు. ఏ గేమ్‌లో ఏ ఆటగాళ్ల మధ్య ఏం జరుగుతోందో వంటి సమాచారం నేనివ్వను. ఇది సంబంధిత సమాఖ్యలు చూసుకుంటాయి. దీనిపై వారే సమాచారం ఇస్తే బాగుంటుంది' అని మంత్రి అన్నారు. అంటే ఆయనకు ఎంతో కొంత విషయం తెలుసనే చాలామంది భావిస్తున్నారు!!
Also Read: Kohli Post on Dhoni: ధోనీ అంటేనే కింగ్! కోహ్లీ చేసిన ఈ ట్వీటే నంబర్ వన్!
Also Read: India's Test squad: షాక్..! కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన రోహిత్‌కు గాయం.. టెస్టు సిరీసు నుంచి ఔట్
Also Read: Virat Kohli: వన్డే సిరీస్ నుంచి కోహ్లీ అవుట్? కారణం అదే!
Also Read: Kohli Vs Rohit: ఒకళ్లుంటే మరొకళ్లు ఆడరా... ఇలా అయితే టీమిండియాకు కష్టమే!
Also Read: BBL: ప్చ్.. అయ్యయ్యో.. క్యాచ్ పట్టబోయిన అభిమాని తల పగిలింది.. రక్తం వస్తుందని అతడికే తెలియలేదు
Also Read: Kohli Press Conference: 'రోహిత్‌కు నాకు మధ్య విభేదాల్లేవు..' కెప్టెన్సీపై కోహ్లీ షాకింగ్ కామెంట్స్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)