India's Test squad: షాక్..! కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన రోహిత్‌కు గాయం.. టెస్టు సిరీసు నుంచి ఔట్
టీమ్‌ఇండియాకు షాక్ తగిలింది! పరిమిత ఓవర్ల క్రికెట్ సారథిగా ప్రమోషన్ పొందిన రోహిత్ శర్మ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్‌లో అతడి పిక్క కండరాలు పట్టేయడంతో టెస్టు సిరీసుకు దూరమయ్యాడు.
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందే టీమ్‌ఇండియాకు షాక్ తగిలింది! పరిమిత ఓవర్ల క్రికెట్ సారథిగా ప్రమోషన్ పొందిన రోహిత్ శర్మ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్‌లో అతడి పిక్క కండరాలు పట్టేయడంతో టెస్టు సిరీసు మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ క్రికెటర్ ప్రియాంక్ పంచాల్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ట్వీటు చేసింది.
NEWS - Priyank Panchal replaces injured Rohit Sharma in India's Test squad.
— BCCI (@BCCI) December 13, 2021
Rohit sustained a left hamstring injury during his training session here in Mumbai yesterday. He has been ruled out of the upcoming 3-match Test series against South Africa.#SAvIND | @PKpanchal9 pic.twitter.com/b8VgoN52LW
టీమ్‌ఇండియా క్రికెటర్లు ముంబయిలో ఆదివారం సాధన చేశారు. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్ గాయపడ్డాడని అంటున్నారు. అతడి పిక్క కండరాలు పట్టేశాయని బీసీసీఐ ప్రకటించినప్పటికీ.. దెబ్బ మాత్రం చేతికి తగిలినట్టు తెలుస్తోంది. త్రోడౌన్ స్పెషలిస్టు రాఘవేంద్ర విసిరిన బంతి హిట్‌మ్యాన్ గ్లోవ్స్‌కు తగిలినట్టు సమాచారం. దాంతో అతడు నొప్పితో విలవిల్లాడాడని అంటున్నారు.
'టీమ్‌ఇండియా టెస్టు జట్టులో రోహిత్ స్థానాన్ని ప్రియాంక్ పంచాల్ భర్తీ చేయనున్నాడు. ముంబయిలో నిన్న సాధన చేస్తుండగా రోహిత్ ఎడమ పిక్క కండరాలు పట్టేశాయి. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీసుకు అతడు దూరమవుతున్నాడు' అని బీసీసీఐ ప్రకటించింది.
'పంచాల్‌ను ముంబయిలో జట్టు బస చేస్తున్న హోటల్లో రిపోర్టు చేయాలని బీసీసీఐ సూచించింది. అతడు రోహిత్‌కు కవర్‌గా ఉంటాడు. పైగా అతడు ఈ మధ్యే దక్షిణాఫ్రికాలో భారత్-ఏ తరఫున ఆడి పరుగులు చేశాడు. అని ఓ అధికారి తెలిపారు.
Also Read: Ganguly on IPL 2022:: ఒమిక్రాన్‌పై గంగూలీ కామెంట్స్..! వచ్చే ఐపీఎల్‌ను...?
Also Read: Rohit Sharma Update: బయటి మాటల్ని పట్టించుకోం.. బలమైన బంధమే ముఖ్యమన్న రోహిత్
Also Read: India's Tour Of South Africa: ఈ నలుగురూ ఆడితే దక్షిణాఫ్రికా టూర్‌లో భారత్‌కు తిరుగులేదు.. ఎవరంటే?
Also Read: Pushpa Event: పుష్ప ఈవెంట్లో ‘థ్యాంక్యూ వార్నర్’.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి