అన్వేషించండి

PV Sindhu Wedding: ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో వెంకట దత్తసాయితో ఏడడుగులు వేసిన స్టార్ షట్లర్

PV Sindhu Gets Married to Venkata Datta In Udaipur | భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వివాహం ఉదయ్‌పూర్‌లో జరిగింది. వెంకట దత్తసాయితో కలిసి స్టార్ షట్లర్ పీవీ సింధు ఏడడుగులు వేశారు.

PV Sindhu Marriage | హైదరాబాద్: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు పెళ్లిపీటలు ఎక్కారు. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో ఆదివారం పీవీ సింధు, వెంకట దత్తసాయి వివాహం ఘనంగా జరిగింది. ఉదయ్‌పూర్‌లో ఆదివారం రాత్రి 11.20 గంటలకు వెంకట దత్తసాయితో కలిసి ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు పీవీ సింధు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు కొందరు ప్రముఖ అతిథులు మాత్రమే హాజరయ్యారు. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్తసాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. హైదరాబాద్ లో డిసెంబర్ 24న పీవీ సింధు మ్యారేజ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని ఆమె కుటుంబసభ్యులు ఇటీవల వెల్లడించారు. 

పీవీ సింధు భర్త వెంకట దత్త సాయి ఎవరంటే.. 
పీవీ సింధు పెళ్లికూతురు కాబోతోందని ఇటీవల తెలిసిన తరువాత అంతా ఆమెకు కాబోయే భర్త ఎవరు అని ఆసక్తిగా చూశారు. సింధు భర్త వెంకట దత్త సాయి ప్రస్తుతం పొసిడెక్స్‌ టెక్నాలజీ ఈడీగా కొనసాగుతున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆదివారం రాత్రి పీవీ సింధు, వెంకట దత్తసాయి వివాహం ఘనంగా జరిగింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by PV Sindhu (@pvsindhu1)

ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ నుంచి లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్/ లిబరల్ స్టడీస్‌లో డిప్లొమా పూర్తి చేశారు వెంకట దత్తా సాయి. ఫ్లేమ్ యూనివర్శిటీ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి 2018లో బీబీఏ అకౌంటింగ్, ఫైనాన్స్ పూర్తి చేశారు. బెంగుళూరులోని ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌లో ఆయన మాస్టర్స్ డిగ్రీ చేశారు. జేఎస్‌డబ్ల్యూలో సమ్మర్ ఇంటర్న్‌గా, కన్సల్టెంట్‌గా పని చేశారు. 2019 నుంచి పోసిడెక్స్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. కొన్ని సెకన్లలో మీరు పొందే లోన్ లేదా క్రెడిట్ కార్డ్ రావడంపై తాను చేసిన ప్రయత్నాలు నేడు ఫలితాన్ని ఇస్తున్నాయని తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో వెంకట దత్తసాయి రాసుకున్నారు. 

డబుల్ ఒలింపియన్ పీవీ సింధు..
ఒలింపిక్ క్రీడలలో రెండు పతకాలు నెగ్గిన అరుదైన భారత క్రీడాకారిణిగా పీవీ సింధు నిలిచారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యంతో మెరిశారు సింధు. అందుకు ఆమె డబుల్ ఒలింపియన్ అయ్యారు. 2019లో ఒక స్వర్ణంతో సహా 5 ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.   2017లో అత్యున్నత ప్రపంచ ర్యాంకింగ్ 2ని సాధించారు.  ఇటీవల జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ 2024 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పీవీ సింధు ఛాంపియన్ గా నిలిచారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
Embed widget