David Warner: మనసులు గెలిచిన వార్నర్.. ఏం చేశాడంటే?
యాషెస్ సిరీస్‌లో డేవిడ్ వార్నర్ చేసిన పని ఫ్యాన్స్ మనసులను గెలుస్తోంది.
యాషెస్ సిరీస్ రెండో టెస్టులో డేవిడ్ వార్నర్ చేసిన పని ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మొదటి ఇన్నింగ్స్‌లో అవుటైన అనంతరం పెవిలియన్‌కు వెళ్తూ తన గ్లౌవ్స్‌ను ఒక పిల్లోడికి ఇచ్చేసి వెళ్లిపోయాడు. దీంతో ఆ పిల్లోడు ఫుల్ ఖుషీ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా షేర్ చేసింది.
దీని కింద ఫ్యాన్స్ కూడా పాజిటివ్‌గా స్పందించారు. వార్నర్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ కామెంట్లు చేశారు. అయితే ఆ గ్లౌజ్ అందుకున్న పిల్లోడి పక్కనున్న వారి కళ్లలో మాత్రం నిరాశ కనిపించింది. ఆ గ్లౌవ్స్ తమకు దొరకలేదే అని వారు చాలా బాధ పడ్డారు.
ఈ ఇన్నింగ్స్‌లో వార్నర్ గాయంతోనే ఆడుతూ కూడా.. 95 పరుగులు సాధించాడు. ఐదు పరుగుల తేడాలో సెంచరీ మిస్సయ్యాడు. మార్నస్ లబుషగ్నేతో కలిసి రెండో వికెట్‌కు 150కి పైగా పరుగులు జోడించి ఆస్ట్రేలియాను పటిష్ట స్థితిలో నిలిపాడు.
ఈ యాషెస్ సిరీస్‌లో శతకం వార్నర్‌కు అందని ద్రాక్షగా మారింది. మొదటి టెస్టులో కూడా తను ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 94 పరుగులకు అవుటయ్యాడు. ఇప్పుడు 95 పరుగులకు మాత్రమే చేరగలిగాడు. గత కొంతకాలం నుంచి వార్నర్ టెర్రిఫిక్ ఫాంలో ఉన్నాడు.
డేవిడ్ వార్నర్ గత ఐదు ఇన్నింగ్స్‌లో (టెస్టులు, టీ20లు కలిపి) నాలుగు అర్థ సెంచరీలు సాధించాడు. ఒక్కసారి మాత్రం 49 పరుగులకు అవుట్ అయ్యాడు. దీన్ని బట్టే అతను ఎంత ఫాంలో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో డేవిడ్ వార్నర్‌పై కనకవర్షం కురిసే అవకాశం ఉంది.
Also Read: Kohli Post on Dhoni: ధోనీ అంటేనే కింగ్! కోహ్లీ చేసిన ఈ ట్వీటే నంబర్ వన్!
Also Read: BBL: ప్చ్.. అయ్యయ్యో.. క్యాచ్ పట్టబోయిన అభిమాని తల పగిలింది.. రక్తం వస్తుందని అతడికే తెలియలేదు
Also Read: Kohli Press Conference: 'రోహిత్‌కు నాకు మధ్య విభేదాల్లేవు..' కెప్టెన్సీపై కోహ్లీ షాకింగ్ కామెంట్స్
Also Read: Ravindra Jadeja Test Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పే యోచనలో జడ్డూ..???
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
View this post on Instagram