Viral News: బ్రెజిల్‌లో ఆకాశంలో వింత ఘటన, ఒక్కసారిగా స్పెడర్ వర్షం కురిసింది- రీజన్ ఇదే
Trending News | నిత్యం ఏదోచోట వింత ఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఘటన బ్రెజిల్ లో జరిగింది. ఆకాశం నుంచి వేలాది సాలెపురుగులు కిందకి రావడంతో వర్షం కురిసినట్లు అనిపించింది.

Spider Rain In Brazil | రియోడిజనీరో: బ్రెజిల్‌లోని ఓ పట్టణంలో స్పైడర్ వర్షం (Raining Spiders) కురిసింది. ఆకాశం నుంచి వేలాది సాలెపురుగులు ఒక్కసారిగా భూమి మీదకు రావడంతో వర్షం కురిసినట్లు కనిపించింది. సాధారణంగా చిరు జల్లులు పడ్డాయి, వడగండ్ల వర్షం కురిసిందని చెప్పడం చూశాం. అలాంటి వర్షాలు మనం ఎన్నో చూశాం. కానీ బ్రెజిల్ లోని మినాస్ గెరైస్‌లో ఉన్న సావో థోమ్ దాస్ లెట్రాస్ సిటీలో ఆకాశంలో అద్భుతం జరిగింది. వేలాది సాలెపురుగులు (Spiders Rain) ఆకాశం నుంచి వర్షం చుక్కలు పడుతున్నట్లుగా క్రిందికి వచ్చాయి. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఈ స్పైడర్ రెయిన్ వీడియోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. తమకు తోచినట్లుగా కామెంట్ చేయడంతో వీడియో ట్రెండ్ అవుతోంది.
సావో థోమ్ దాస్ లెట్రాస్ సిటీలో ఆకాశంలో కనిపించిన ఈ దృశ్యం వింతగా అనిపించినా, నిపుణులు మాత్రం దీనిని సహజ దృగ్విషయంగా చెబుతున్నారు. అయితే వారు చెప్పినట్లుగా ఇక్కడ సాలెపురుగులు కనిపించలేదని, అందుకు కారణం వేరే ఉందని ఒక జీవశాస్త్రవేతత డైలీ మెయిల్‌కు తెలిపారు. స్పైడర్స్ సంభోగ క్రియలో పాల్గొన్నాయని జీవశాస్త్రవేత్త కైరాన్ పాసోస్ చెప్పారు. కొన్ని చోట సాలె పురుగులు ఇదే విధంగా ఒక్కసారి భారీ సంఖ్యలో ఒకచోట చేరడంతో ఆకాశంలో వింతలాగ కనిపిస్తుందని పేర్కొన్నారు.
Sometimes, young spiders use a trick called "ballooning"—they release silk into the air and let the wind carry them. When a lot of them do this at once, it looks like spiders are falling from the sky. #Brazil pic.twitter.com/H4G71ALS2O
— Evan Kirstel #B2B #TechFluencer (@EvanKirstel) January 31, 2025
ఆడ సాలెపురుగులు (Spiders) ఒకరి కంటే ఎక్కువ మగ సాలెపురుగుల నుంచి స్పెర్మ్‌ను సేకరించి నిల్వ చేస్తాయి. ఇందుకోసం లేడీ స్పైడర్స్‌లో స్పెర్మాథెకా అనే ప్రత్యేకమైన అవయవం ఉంటుంది. ఇది జన్యు వైవిధ్యాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఆడ సాలెపురుగులు వేర్వేరు మగ స్పైడర్స్ నుంచి స్పెర్మ్ తీసుకుని అండాలను ఫలదీకరణం చేస్తాయి. దాంతో వైవిధ్యమైన సంతానం పొందే అవకాశం పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాల కోసం సైతం ఆడ స్పైడర్స్ వీర్యాన్ని సేకరించడం కొనసాగిస్తాయి.
లేడీ స్పైడర్స్ ప్రత్యేక కాలనీలు, నివాసాన్ని ఏర్పాటు చేస్తాయి. వాటి పిల్లలతో ఆడ స్పైడర్స్ కలిసి పనిచేస్తాయి, ఇవి ఎరను పట్టుకోవడానికి, ఆహారాన్ని సేకరించి షేర్ చేసుకుంటాయని నిపుణులు తెలిపారు. స్టెగోడిఫస్, అనెలోసిమస్ వంటి జాతులు ప్రత్యేకంగా వలలను నిర్మించడంలో ప్రసిద్ధి చెందాయి. అవి వేట ద్వారా ఇతర చిన్న జీవుల నుంచి తమను రక్షించుకుంటాయి. సంభోగం తర్వాత సాధారణంగా ఈ సాలెపురుగులు చెల్లాచెదురు అవుతాయి.
ఇదే మొదటిసారి కాదు..
ఆకాశంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. 2019లో సాలె పురుగులు వేలాది ఆకాశం నుంచి భూమి మీద ఊడిపడినట్లు కనిపించాయి. ఆ సమయంలో స్థానికులు ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారని నిపుణులు చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

