Mumbai Indians: ద హండ్రెడ్ లీగ్ లోకి ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్.. మేటి జట్టును కొనుగోలు చేసి సంచలనం..
123 మిలియన్ పౌండ్ల భారీ ధరకు ఈ జట్టును ముంబై ఇండియన్స్ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. టీమ్ మొత్తం విలువ 123 మిలియన్ పౌండ్లు ఉండగా, అందులో 49 శాతం వాటాను ఈసీబీ అమ్మకానికి పెట్టింది.

IPL 2025 Updates: ఐపీఎల్ స్టార్ టీమ్ ముంబై ఇండియన్స్ మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్వహించే ద హండ్రెడ్ లీగ్ లోకి అడుగు పెట్టింది. తాజాగా ఈ లీగ్ కు చెందిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టు వేలానికి రాగా, కళ్లు చెదిరే ధర పెట్టి ముంబై ఆ టీమ్ ను సొంతం చేసుకుంది. దాదాపు 123 మిలియన్ పౌండ్ల భారీ ధరకు ఈ జట్టును ముంబై ఇండియన్స్ యాజమాన్యం అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. నిజానికి టీమ్ మొత్తం విలువ దాదాపు 123 మిలియన్ పౌండ్లు ఉండగా, అందులో 49 శాతం వాటాను ఈసీబీ అమ్మకానికి పెట్టింది. దీంతో ఎంఐ యాజమాన్యం ప్రత్యర్థులు కనీసం ఊహించని విధంగా బారీ ధరతో బిడ్డింగ్ వేసి గెలుపొందినట్లు తెలుస్తోంది.
హ్యాట్రిక్ పై గురి..
ద హండ్రెడ్ లీగ్ లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ ది చాలా చక్కని రికార్డు ఉంది. గత రెండు సీజన్లలో ఆ జట్టే చాంపియన్ గా నిలిచింది. అద్భుతమైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆ జట్టు.. ఈ సీజన్ లో హ్యాట్రిక్ పై కన్నేసింది. అలాంటి జట్టు కొనుగోలుతో ఎంఐ యాజమాన్యం తన రాకను ఘనంగా చాటుకుంది. గతంలో ఈ జట్టును సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలోనడిచేది. తాజాగా ఈసీబీ ఈ జట్టుతోపాటు మరో రెండు జట్లను అమ్మకానికి పెట్టింది. లండన్ కేంద్రంగా నడిచే లండన్ స్పిరిట్స్, కార్డిఫ్ కేంద్రంగా నడిచే వెల్ష్ ఫైర్స్ అనే జట్లను అమ్మకానికి పెట్టింది. అయితే ఎంఐ యాజమాన్యం మాత్రం హాట్ ఫేవరెట్ అయిన ఇన్విన్సిబుల్స్ ను దక్కించుకుని తన ఎంట్రీని ఘనంగా చాటుకుంది.
గ్లోబల్ గా ఆరో ఫ్రాంచైజీ..
ఐపీఎల్లో ముంబై ఇండియన్ జట్లు ఏర్పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2008లో తన ఫ్రాంచైజీ క్రికెట్ ప్రస్థానం మొదలుపెట్టింది. ఐపీఎల్లో అత్యంతం విజయమైన జట్లో ఎంఐ ఒకటి. ఇప్పటివరకు ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ గా నిలిచింది. ఇక ఐపీఎల్ తోపాటు వివిధ దేశాలలో జరిగే ఫ్రాంచైజీలను కొనుగోలు చేస్తూ, ప్రపంచ వ్యాప్తంగా తన ఫ్రాంచైజీ క్రికెట్ యాజమాన్యాన్ని విస్తరిస్తోంది. ఐపీఎల్లో ఎంఐతోపాటు విమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా మరో ముంబై ఇండియన్స్ జట్టును కలిగి ఉంది. అలాగే మేజర్ క్రికెట్ లీగ్ లో ఎంఐ న్యూయార్క్ జట్టు, సౌతాఫ్రికాకు చెందిన ఎస్ఏ20 లీగ్ లో ఎంఐ కేప్ టౌన్ జట్టు, యూఏఈకి చెందిన ఐఎల్ టీ20 లీగ్ లో ఎంఐ ఎమిరేట్స్ జట్టును కూడా రిలయన్స్ కలిగి ఉంది. భారత అపర కుబేరుడు ముకేశ్ అంభానీ నాయకత్వంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ఐపీఎల్ విషయానికొస్తే మార్చి 21 నుంచి లీగ్ ప్రారంభం అవుతుందని లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. మే నెలఖారు వరకు రెండునెలలకుపైగా ఈ టోర్నీ అభిమానులకు వినోదం పంచనుంది. మూడుసార్లు విజేత, కోల్కతా నైట్ రైడర్స్ ఈసారి డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగనుంది.
Also Read: Ashwin Comments: భారత టీమ్ మేనేజ్మెంట్ పై అశ్విన్ ఫైర్... ఆ విషయంలో ఫెయిర్ గా లేదని వ్యాఖ్య
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

