Pushpa 2: 'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
Pushpa 2 Hindi Collections: 'పుష్ప 2' బాలీవుడ్‌లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే పుష్పరాజ్ హిందీ ప్రేక్షకుల ఫేవరెట్ కావడానికి కారణమైన వ్యక్తి, 'పుష్ప 2' నుంచి ఎందుకు తప్పుకున్నాడో తెలుసా?

'పుష్ప 2' మూవీ తెలుగుతో పాటు హిందీలోనూ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమా హిస్టరీలో భారీ కలెక్షన్లు కొల్లగొట్టిన బాహుబలి, యానిమల్, జవాన్ వంటి సినిమాలకు సైతం గట్టి పోటీని ఇస్తూ 'పుష్ప 2' హిందీ వర్షన్ 1000 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్లింది. దాదాపు 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన అరుదైన సినిమాగా చరిత్రను సృష్టించింది. అయితే 'పుష్ప 2' మూవీ ఈ రేంజ్ లో, అందులోనూ బాలీవుడ్ కు పూనకాలు తప్పించే విధంగా మూవీ ఆడడానికి కారణమైన ముఖ్యమైన వ్యక్తికే ఈ ఘనత దక్కాలి. ఆయనే 'పుష్ప 1' మూవీని హిందీ మార్కెట్లలోకి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి. కానీ రెండో పార్ట్ విషయంలో మాత్రం నష్టం వస్తుందేమోనని భయపడి చేతులు కాల్చుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు 'పుష్ప' మూవీని హిందీ బెల్టుకు పరిచయం చేసిన గోల్డ్ మైన్స్ టెలి ఫిలిమ్స్ కు చెందిన నిర్మాత మనీష్ షా.
మనీష్ షా 'పుష్ప 2' నుంచి ఎందుకు తప్పుకున్నాడంటే?
హిందీ డబ్బింగ్ వెర్షన్ సినిమాలను హిందీ బెల్ట్ లో రిలీజ్ చేసే విషయంలో కేరాఫ్ అడ్రస్ గా మారింది గోల్డ్ మైన్స్ టెలిఫిల్మ్స్. ఎన్నో దక్షిణాది డబ్బింగ్ చిత్రాలను హిందీ సర్కిల్స్ లో ఈ సంస్థ రిలీజ్ చేస్తూ వచ్చింది. పైగా సెట్ మాక్స్, జీ సినిమా వంటి ఛానల్స్ కొన్ని సంవత్సరాలుగా గోల్డ్ మైన్స్ టెలిఫిల్మ్స్ రిలీజ్ చేస్తున్న సినిమాలను తమ ఛానల్స్ లో ప్రసారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మనీష్ షా 'పుష్ప 2' మూవీ హిందీ డిస్ట్రిబ్యూటర్ గా తప్పుకుంటున్నట్టు ప్రకటించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఎందుకంటే 'పుష్ప' మూవీ హిందీ వెర్షన్ ని ఆయనే డిస్ట్రిబ్యూట్ చేసి, భారీ లాభాలను అందుకున్నారు. కానీ 'పుష్ప 2' విషయంలో మాత్రం మేకర్స్ చెప్పిన ధర నష్టాలను తెచ్చేలా ఉందనే ఆలోచనతో ఆయన వెనక్కి తగ్గారట. 'పుష్ప' హిందీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను ఆయన 30 కోట్లకే కొన్నారట. ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అల్లు అర్జున్ మూవీ త్వరగానే రీచ్ కావడంతో మంచి లాభాలు వచ్చాయి. కానీ రెండవ పార్ట్ రిలీజ్ టైమ్ లో 'పుష్ప 2' మేకర్స్ ఏకంగా 200 కోట్లు ఈ మూవీ రైట్స్ కోసం డిమాండ్ చేశారట. దీంతో మూవీకి భారీ నష్టాలు వస్తే సమస్యలు తప్పవనే ఆలోచనతో ఆయన సైలెంట్ గా పక్కకు తప్పుకున్నారట.
Also Read:ప్రభాస్ - ప్రశాంత్ వర్మ సినిమాలో హీరోయిన్ ఆ అమ్మాయే... ఫస్ట్ మూవీ ఫ్లాపైనా ఫుల్ ఆఫర్స్!
'పుష్ప 2' హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూటర్ ఎవరంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న జంటగా నటించిన 'పుష్ప' వంటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా వచ్చింది 'పుష్ప 2'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ హిందీ వెర్షన్ ను డబ్బింగ్ సినిమాల రిలీజ్ విషయంలో మంచి పేరున్న ఏఏ ఫిలిమ్స్ నిర్మాత అనిల్ తడానీ దాదాపు 200 కోట్లకు సొంతం చేసుకున్నారు. అయితే ఈ మూవీ హిందీ మార్కెట్లో ఏకంగా 800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. మనీష్ షా గనుక 'పుష్ప 2' తీసుకుంటే... రైట్స్ 200 కోట్లు పోనూ 600 కోట్లు మిగిలేవి. ఇప్పుడు ఆ డబ్బులు లాసే కదా!
Also Read: స్టార్ హీరోకి 55 కేసులు... రూ 90 కోట్ల అప్పు... చేతిలో ఒక్క ఆఫర్ లేని టైంలో కాపాడింది ఎవరో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

