అన్వేషించండి

Visakhapatnam: వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే

Vizag Rushikonda Beach | విశాఖ ఫేమస్ బీచ్ రుషికొండ బ్లూఫ్లాగ్ స్టేటస్ కోల్పోయింది. నిర్వహణ సరిగ్గా లేని కారణంగా రుషికొండ బ్లూఫ్లాగ్ పై డెన్మార్క్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

విశాఖపట్నం: విశాఖ పేరు చెప్పగానే రుషికొండ బీచ్ గుర్తొస్తుంది. అందులోరూ బ్లూఫ్లాగ్‌ గుర్తింపు పొందిన ఏపీలోని ఏకైక బీచ్‌గా రుషికొండకు పేరు తెచ్చుకుంది. కానీ రుషికొండ బీచ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రుషికొండ బీచ్ బ్లూఫ్లాగ్ గుర్తింపు తాత్కాలికంగా రద్దయింది. దాంతో పర్యాటకశాఖ అధికారులు బీచ్ వద్ద జెండాలను శనివారం కిందకు దించేశారు. అదేంటీ జెండాలు ఎందుకు దించేశారని విశాఖ వాసులు చర్చించుకుంటున్నారు. అసలు విషయం తెలిసి షాకవుతున్నారు.

2020లో రుషికొండ బీచ్ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూఫ్లాగ్‌ బీచ్‌గా ధ్రువీకరించారు. డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ (FEE) సంస్థ బీచ్‌లకు, పర్యాటక ప్రాంతాలకు ఈ గుర్తింపు అందిస్తుంది. కానీ నాలుగేళ్లకే సీన్ రివర్స్ అయింది. రుషికొండ బీచ్‌లో కుక్కలు తిరుగుతున్నాయని, వ్యర్థాలు పేరుకుపోయాయి, సీసీ కెమెరాలు సైతం పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. అక్కడ వాకింగ్ ట్రాక్,  నడక మార్గం దెబ్బతినడంతో పాటు టాయిలెట్స్, దుస్తులు మార్చుకునే గదులు, సరిగ్గా లేవని ఫొటోలతో సహా డెన్మార్క్ ఎఫ్ఈఈ సంస్థకు ఫిబ్రవరి 13న ఫిర్యాదు అందింది. నిర్వహణ అధ్వానంగా ఉందని, రుషికొండ బీచ్ బ్లూఫ్లాగ్ షిప్ గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సాక్ష్యాలుగా ఫొటోలు, వీడియోలు పంపడంతో వాటిని పరిశీలించిన డెన్మార్క్ సంస్థ రుషికొండకు తాత్కాలికంగా బ్లూఫ్లాగ్ రద్దు చేసింది. దాంతో బీచ్ వద్ద జెండాలను అధికారులు కిందకి దించేశారు. 

ఎవరిదీ నిర్లక్ష్యం.. బాధ్యులెవరు.. 
గతంలో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రూ.7 కోట్ల కేంద్రం నిధులతో రుషికొండ బీచ్ వద్ద మౌలిక వసతులు కల్పించింది. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ కొన్నేళ్లపాటు విశాఖ బీచ్‌ నిర్వహణను చూసుకుంది. ఆపై వైసీపీ అధికారంలోకి వచ్చాక బీచ్ నిర్వహణ పనులను ప్రైవేటు పరం చేసింది. గత ప్రభుత్వం రెండేళ్ల కిందట నిర్వహణను ప్రైవేటుకు అప్పగించింది. ఆ సంస్థ నిబంధనలు పాటించకపోవడం, రుషికొండ నిర్వహణను గాలికొదిలేసింది. 2024 నవంబరుతో ఆ ప్రైవేట్ సంస్థ నిర్వహణ గడువు సైతం ముగిసింది. మరోవైపు విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పుకునే సీఎం చంద్రబాబు, పర్యాటక శాఖగానీ రుషికొండపై ఫోకస్ చేయని కారణంగా బీచ్‌కు ఈ దుస్థితి వచ్చిందని విశాఖ వాసులు చెబుతున్నారు. రుషికొండ బీచ్‌ను పట్టించుకోని కారణంగానే, నిర్వహణ సరిగ్గా లేదని ఫిర్యాదు రావడంతో.. అన్నీ పరిశీలించిన డెన్మార్క్ సంస్థ బ్లూఫ్లాగ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం తిరిగి రుషికొండకు పూర్వవైభవం తీసుకొస్తే మళ్లీ బ్లూఫ్లాగ్ గౌరవాన్ని బీచ్ దక్కించుకోనుంది.

Also Read: AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Visakhapatnam Airport Service Ends: కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు

వీడియోలు

Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget