అన్వేషించండి

IPL Media Rights Tender: బీసీసీఐకి డబ్బుల పండగ! రూ.50వేల కోట్లు వస్తాయన్న గంగూలీ.. రంగంలోకి రిలయన్స్‌?

రెండు కొత్త ఫ్రాంచైజీల విక్రయం ద్వారా రూ.12,000 కోట్లు రావడం అద్భుతం. ఐపీఎల్‌ మీడియా హక్కుల ద్వారా మరో రూ.40,000 కోట్లు వస్తాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ధీమాగా ఉన్నాడు.

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి 'బీసీసీఐ' మరో జాక్‌పాట్‌ కొట్టనుంది! ఐపీఎల్‌ మీడియా హక్కుల ద్వారా రూ.40,000 కోట్లు ఆర్జించనుంది. ఈ మేరకు బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ధీమాగా ఉన్నాడు. త్వరలోనే ఐపీఎల్‌ వేలం నిర్వహిస్తామని వెల్లడించాడు. 'బ్యాక్‌స్టేజ్‌ విత్‌ బోరియా' షోలో దాదా మాట్లాడాడు.

'రెండు కొత్త ఫ్రాంచైజీల విక్రయం ద్వారా రూ.12,000 కోట్లు రావడం అద్భుతం. ఐపీఎల్‌ మీడియా హక్కుల ద్వారా మరో రూ.40,000 కోట్లు వస్తాయి! త్వరలోనే బీసీసీఐ టెండర్లను ఆహ్వానించనుంది' అని గంగూలీ అన్నాడు. 'మొత్తంగా భారత క్రికెట్‌ రూ.50,000 కోట్లు వస్తున్నాయి. దీంతో భారత క్రికెట్‌ను బీసీసీఐ మరో స్థాయికి తీసుకెళ్లగదు.  ఇప్పటికే ఐపీఎల్‌ ద్వారా దేశ క్రికెట్‌ ఎంతో ప్రయోజనం పొందింది. ఈ డబ్బుతో ఇంక వేరే లెవల్‌కు ఆటను తీసుకుపోవచ్చు' అని దాదా ధీమాగా ఉన్నాడు.

ఐపీఎల్‌ ప్రసార హక్కుల కోసం ఈ-వేలం నిర్వహిస్తామని గంగూలీ తెలిపాడు. 'హక్కులను విక్రయించేందుకు ఈ-వేలమే అత్యుత్తమ విధానమని మేం భావిస్తున్నాం. కొత్త జట్ల విక్రయం మాదిరిగానే ఐపీఎల్‌ ప్రసార హక్కుల వేలానికి అద్భుత స్పందన వస్తుందని ఆశిస్తున్నాం' అని ఆయన అన్నాడు.

మొదట్లో ఐపీఎల్‌ ప్రసార హక్కులను సోనీ దక్కించుకుంది. ఆ తర్వాత నిర్వహించి వేలంలో 2018-2022 హక్కులను స్టార్‌ ఇండియా కైవసం చేసుకుంది. ఇందుకు రూ.16,347 కోట్లు ఖర్చుచేసింది. ఇప్పుడు మరో రెండు జట్లు పెరిగాయి. మ్యాచుల సంఖ్య 60 నుంచి 75+కు పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ సారి సోనీ, స్టార్‌ మాత్రమే కాకుండా మరిన్ని సంస్థలు తీవ్రంగా పోటీ ఇవ్వనున్నాయి. రిలయన్స్‌ ప్రమోట్‌ చేస్తున్న వయాకామ్‌ హక్కులు దక్కించుకొనేందుకు విపరీతంగా ప్రయత్నిస్తోంది. అమెజాన్‌ సైతం ప్రధాన పోటీదారే!

Also Read: Year Ender 2021: శాసించే స్థితి నుంచి 'కెప్టెన్సీ' పంచుకొనే స్థాయికి.. కోహ్లీకి అచ్చిరాని 2021

Also Read: David Warner: మనసులు గెలిచిన వార్నర్.. ఏం చేశాడంటే?

Also Read: SRH in IPL 2022: సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా మాజీ స్పీడ్‌స్టర్‌..! ఈ మధ్యే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు..!

Also Read: Ganguly on Virat Kohli: 'బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌..!' గంగూలీ వద్ద కోహ్లీ తప్పని నిరూపించే సాక్ష్యాలు?

Also Read: Watch Video: ఫ్లైయింగ్‌ జోస్‌..! యాషెస్‌లో సూపర్‌మ్యాన్‌ క్యాచ్‌ అందుకున్న బట్లర్‌.. చూస్తే కిర్రాక్‌!

Also Read: Kohli vs Ganguly: వేర్వేరు మాటలెందుకో? ఆ సంగతి గంగూలీనే అడగాలన్న సన్నీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు
ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Paravada Gas Leak: పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్, నలుగురు సిబ్బందికి తీవ్ర అస్వస్థత
పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్, నలుగురు సిబ్బందికి తీవ్ర అస్వస్థత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు
ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Paravada Gas Leak: పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్, నలుగురు సిబ్బందికి తీవ్ర అస్వస్థత
పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్, నలుగురు సిబ్బందికి తీవ్ర అస్వస్థత
Chenab Rail Bridge: కాశ్మీర్ లోయలో రైల్వే ఇంజనీరింగ్ అద్భుతం, ప్రపంచంలోనే ఎత్తైన
కాశ్మీర్ లోయలో రైల్వే ఇంజనీరింగ్ అద్భుతం, ప్రపంచంలోనే ఎత్తైన "చినాబ్ రైల్ బ్రిడ్జ్ " విశేషాలివే
Congress vs Tollywood: సినీ ఇండస్టీని కాంగ్రెస్  ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
సినీ ఇండస్టీని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
AP Belt Shops: గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
Embed widget