Rohit Sharma And KL Rahul News In Telugu: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma). జట్టు కోసం ఏం చేయడానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. హిట్ మ్యాన్ కు ఎప్పుడు జట్టు తప్ప మరో ఆలోచనే ఉండదు. ఇటీవల జరిగిన టీ 20 ప్రపంచకప్ (T20 World Cup)లోనూ జట్టు కోసం దూకుడు మంత్రాన్నే జపించాడు. జట్టుకు పరుగులు అవరమైనప్పుడు.. బౌలర్లు లయను దెబ్బతీసి బలమైన పునాది వేసేందుకు తన వికెట్ ను బలి ఇచ్చేందుకు అయినా రోహిత్ వెనకాడడు. అవతలి బ్యాటర్ ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి టీమిండియాకు బలమైన పునాదిని నిర్మించడంలో రోహిత్ ను మించిన సారధే లేడు. వన్డే ప్రపంచకప్, టీ 20 ప్రపంచకప్ సహా ఎన్నో మెగా టోర్నీల్లో ఇది బయటపడింది. జట్టు కోసం ఎలాంటి విమర్శలనైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు మరోసారి రోహిత్ అలాంటి త్యాగమే చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండో టెస్టుకు టీమిండియా సిద్ధమవుతున్న వేళ.. రోహిత్ చేసిన త్యాగం క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది.
జట్టు కోసం..
పెర్త్(Pearth) వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓపెనర్లు యశస్వీ జైస్వాల్- కేఎల్ రాహుల్ జోడీ సూపర్ గా రాణించింది. పటిష్టమైన కంగారు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ ఇద్దరు.. రెండో ఇన్నింగ్స్ లో 200కుపైగా పరుగులు జోడించి... కంగారుల పరాజయానికి బాటలు వేశారు. యశస్వీ అద్భుత శతకంతో చెలరేగగా.. రాహుల్ కూడా అర్ధ శతకంతో మెరిశాడు. వీరిద్దరి అద్భుత ఆటతీరుతోనే భారత జట్టు తొలి టెస్టును సునాయసంగా గెలుచుకుంది. అయితే ఈ టెస్టు తర్వాత ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌తో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడింది. అయితే ఈ మ్యాచులో రోహిత్ తన బ్యాటింగ్ స్థానాన్ని.. కేఎల్ రాహుల్ కోసం త్యాగం చేశాడు. తొలి టెస్టులో ఓపెనర్ గా బరిలోకి దిగి అద్భుతంగా ఆడిన రాహుల్ ను అదే స్థానంలో ఆడేలా చేశాడు. జట్టు కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసిన రోహిత్... ఈ వార్మప్ మ్యాచులోనూ రాహుల్ నే ఓపెనింగ్ కు పంపాడు. ఈ వార్మప్ మ్యాచ్‌లోనూ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal )- కేఎల్ రాహుల్(Rahul) నే హిట్‌మ్యాన్ ఓపెనింగ్‌కు పంపాడు .
ప్రశంసల వర్షం
జైస్వాల్-రాహుల్‌తో ఓపెనింగ్ చేయించిన రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సారధిగా రోహిత్ తాను కోరుకున్న స్థానంలోనే బ్యాటింగ్ చేసే అవకాసం ఉందని అయినా రోహిత్ ఆ నిర్ణయం తీసుకోలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి కెప్టెన్ ఉంటే ఆ జట్టుకు అస్సలు తిరుగుండదని అంటున్నారు. వ్యక్తిగత మైలురాళ్లు పట్టించుకోకుండా కేవలం జట్టు కోసమే ఆలోచించే రోహిత్ లాంటి కెప్టెన్ ఉండడం శుభపరిణామమని కామెంట్లు చేస్తున్నారు.
వార్మప్ మ్యాచులో ఘన విజయం
కాన్బెర్రా వేదికగా జరిగిన ఈ వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్(Prime Minister’s XI) జట్టు 43.2 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌటైంది. 241 టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియా 42.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వి జైస్వాల్ (45), శుభ్‌మన్ గిల్ (50), నితీశ్ కుమార్ రెడ్డి (42) పరుగులతో రాణించారు.
రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్ మార్పు?
అడిలైడ్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 6న రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్ మారినట్లు తెలుస్తోంది. జట్టు జాబితాలో రోహిత్ పేరు ఐదో స్థానంలో ఉంది. పెర్త్ టెస్టులో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రాహుల్ బాగా రాణించడమే దీనికి కారణమని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మూడో స్థానంలో గిల్, నాలుగో స్థానంలో కోహ్లీ, ఐదో స్థానంలో రోహిత్ ఆడనున్నారు.