Ram - Bhagyashri Borse: రామ్ ప్రేమలో భాగ్యశ్రీ... ఎంగేజ్మెంట్ జరిగిందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
Bhagyashri Borse dating relationship news: ఉస్తాద్ రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో ఒక్కటే గోల. వీటికి హీరోయిన్ క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక కల్చర్ ఉంటుంది. హీరో హీరోయిన్లు కలిసి ఫస్ట్ టైమ్ సినిమా చేసేటప్పుడు... దానికి క్రేజ్ తీసుకు రావడం కోసం వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం మొదలు పెడతారు. టాలీవుడ్ వరకు ఆ కల్చర్ రాలేదు. దాంతో రెండు మూడు రోజులుగా రామ్ పోతినేని (Ram Pothineni), భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం మొదలైంది. దాంతో క్లారిటీ ఇవ్వక తప్పలేదు భాగ్యశ్రీకి! అసలు ఏమైంది? వాళ్ళిద్దరి మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే...
రామ్... భాగ్యశ్రీ... ఫోటోల్లో బ్యాక్ గ్రౌండ్ చూశారా?
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఉస్తాద్ రామ్ పోతినేని, యంగ్ అండ్ సెన్సేషనల్ క్రేజీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న మొదటి చిత్రమిది. ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమా చిత్రీకరణలో వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారనేది సోషల్ మీడియాలో తాజా గుసగుస.
Something Is Fishy 👀🫠#Rampothineni #BhagyasriBorse pic.twitter.com/zRpo7SFNz2
— 𝙏𝙖𝙧𝙖𝙠𝙠𝙠🚬 (@nottarak) April 20, 2025
భాగ్యశ్రీ బోర్సే సోషల్ మీడియాలో తాజాగా ఒక ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోలోని బ్యాక్ గ్రౌండ్, కొన్నాళ్ల క్రితం రామ్ పోతినేని షేర్ చేసిన ఫోటోలో బ్యాక్ గ్రౌండ్ ఒక్కటే అని కంపారిజన్ చేయడం మొదలు పెట్టారు నెటిజనులు. అంతే కాదు... భాగ్యశ్రీ బోర్సే చేతికి ఒక రింగ్ ఉండడంతో అది ఎంగేజ్మెంట్ రింగ్ అని కామెంట్ చేయడం కూడా మొదలు పెట్టారు. అది ఏకంగా ఒక నెటిజన్ కామెంట్ చేసే వరకు వెళ్ళింది.
ఆ రింగ్ నేనే కొనుక్కున్నాను - భాగ్యశ్రీ బోర్సే క్లారిటీ!
భాగ్యశ్రీ బోర్సే పోస్ట్ చేసిన ఫోటో కింద ఒక నెటిజన్ 'హూ ఈజ్ హీ?' (అతను ఎవరు?) అని అడిగాడు. అందుకు బదులుగా ''నేనే కొనుక్కున్నాను'' అని భాగ్యశ్రీ బోర్సే రిప్లై ఇచ్చారు. సూటిగా చెప్పాలంటే ఆ రింగ్ ఎవరో ఇచ్చినది (నిశ్చితార్థపు ఉంగరం) కాదని, తాను కొనుక్కున్నదని క్లారిటీ ఇచ్చారు. దాంతో వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదని చెప్పినట్టు అయింది.
Also Read: మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన లభించినప్పటికీ... ఆమె అందం, అభినయం గురించి అందరూ మాట్లాడుకున్నారు. దాంతో అవకాశాలు క్యూ కట్టాయి. దుల్కర్ సల్మాన్ సరసన పాన్ ఇండియా సినిమా 'కాంతా'లో నటించే అవకాశాన్ని భాగ్యశ్రీ సొంతం చేసుకున్నారు. ఇది కాకుండా మరో రెండు మూడు సినిమాలు ఆవిడ చేతిలో ఉన్నాయి. ఏది ఏమైనా లేటెస్ట్ డేటింగ్ రూమర్స్ RAPO22కి ఫుల్ పబ్లిసిటీ తీసుకు వచ్చిందని చెప్పాలి.





















