ICC Champions Trophy News: పాక్ స్టేడియాల ప్రారంభం ఆరోజుల్లోనే.. కెప్టెన్ల సమావేశం ఖరారు.. రోహిత్ శర్మ హాజరుపై..
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాక్ తో మార్చి 2 న్యూజిలాడ్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఆడనున్నాయి.

Rohit Sharma News: అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ఓపెనింగ్ సెర్మనీ వివరాలు బయటకు వచ్చాయి. వచ్చేనెలలో ఈ సెర్మనీ ఉండనుంది. అంతకంటే ముందు చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాల వివరాలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. వచ్చేనెల 7న నవీకరించిన లాహోర్లోని గఢాఫీ స్టేడియాన్ని ప్రారంభిస్తారు. దీనికి ముఖ్య అతిథిగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ హాజరుకానున్నారు. అనంతరం వచ్చేనెల 11న రినోవేట్ చేసిన కరాచీలోని ప్రఖ్యాత నేషనల్ స్టేడియాన్ని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రారంభిస్తారని పీసీబీ వర్గాలు తెలిపాయి. ఈ రెండు ప్రారంభోత్సవ ఏర్పాట్లు భారీగా ఉండేలా పీసీబీ డిజైన్ చేసినట్లు సమాచారం.
16న కెప్టెన్ల ఫొటో షూట్..
వచ్చేనెల 19వ తేదీ నుంచి నేషనల్ స్టేడియంలో పాక్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ తో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి తెరలేవనుంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ మెగాటోర్నీ జరగబోతోంది. చివరిసారిగా ఇంగ్లాండ్ లో 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఆ టోర్నీలో భారత్ ను ఓడించిన పాక్.. విజేతగా నిలిచింది. అయితే ఫిబ్రవరి 16న టోర్నీలో పాల్గొనే జట్ల కెప్టెన్ల సమావేశం జరుగనుంది. అయితే ఈ సమావేశం ప్రఖ్యాత లాహోర్ కోటలోని హుజుర్ భాగ్ లో జరగబోతోంది. అయితే ఈ సమావేశానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ వస్తాడో, రాడో అనే దానిపై స్పష్టత లేదు. ఐసీసీ టోర్నీలు జరిగేముందు అందులో పాల్గొంటున్న ఆయా జట్లతో ఫొటో షూట్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఫిబ్రవరి 16న జరిగే ఈ కార్యక్రమంలో అన్ని దేశాల బోర్డుల అధికారులు, సెలబ్రిటీలు, దిగ్గజ క్రికెటర్లు, ప్రభుత్వ ముఖ్య అధికారులు, నాయకులు హాజరు కానున్నారు.
దుబాయ్ లో భారత్ మ్యాచ్ లు..
ఈసారి చాంపియన్స్ ట్రోఫి పాకిస్థాన్ లో జరుగుతున్నందున అక్కడికి వెళ్లడానికి టీమిండియాకు బీసీసీఐ నుంచి అనుమతి రాలేదు. దీంతో యూఏఈలో భారత్ ఆడే మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ఒకవేళ భారత్ సెమీస్, ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ లను కూడా అక్కడే నిర్వహిస్తారు. ఇక ఈ టోర్నీకి సంబంధించి షెడ్యూల్ ను ఇప్పటికే ప్రకటించారు. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న చిరకాల ప్రత్యర్థి, డిఫెండింగ్ చాంపియన్ పాక్ తో మార్చి 2 న్యూజిలాడ్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఆడుతుండగా, గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ చోటు దక్కించుకున్నాయి. ప్రతి గ్రూపులోని జట్టు, అదే గ్రూపులోని ఇతర మూడు జట్లతో మూడు మ్యాచ్ లు అడుతుంది. ప్రతి గ్రూపులో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్లోకి ప్రవేశిస్తాయి. సమీ ఫైనల్లో విజయం సాధించిన రెండు జట్ల మధ్య మార్చి 9న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
Also Read: Siraj Dating News: బిగ్ బాస్ సెలెబ్రిటీతో పేసర్ సిరాజ్ డేటింగ్? నటి తల్లి స్ట్రాంగ్ రిప్లై..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

