అన్వేషించండి

Pujara Suspended: ఆటగాళ్లు చేసిన అతికి కెప్టెన్ బలి - పుజారాపై సస్పెన్షన్

భారత వెటరన్ బ్యాటర్, నయా డిపెండెబుల్ ఛటేశ్వర్ పుజారా తాను చేయని తప్పునకు బలయ్యాడు. కౌంటీ క్రికెట్‌లో అతడిపై సస్పెన్షన్ వేటు పడింది.

Pujara Suspended:  టీమిండియా టెస్టు క్రికెటర్, అభిమానులంతా ‘నయా వాల్’ అని పిలుచుకునే  ఛటేశ్వర్ పుజారా తాను చేయని తప్పునకు బలయ్యాడు. తన జట్టులోని ఆటగాళ్ల ప్రవర్తనకు అతడు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.   ప్రస్తుతం కౌంటీ ఛాంపియన్‌షిప్‌ డివిజన్ - 2లో ఆడుతున్న పుజారా  ససెక్స్ జట్టకు సారథిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్‌లో ససెక్స్ ఆటగాళ్ల ప్రవర్తన నిబంధనలను అతిక్రమించడంతో జట్టులో ముగ్గురు  ప్లేయర్లతో పాటు పుజారా కూడా  ఒక  మ్యాచ్ నిషేధం ఎదుర్కున్నారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఈ విషయాన్ని వెల్లడించింది. 

పుజారా సారథిగా ఉన్న ససెక్స్  జట్టు ఈ సీజన్లో నాలుగు ఫిక్స్‌డ్ పెనాల్టీలను  ఎదుర్కుంది.  ఇవి 12 పాయింట్లతో సమానం.  ఒక సీజన్‌లో ఓ జట్టు  నాలుగు ఫిక్స్‌డ్ పెనాల్టీలను ఎదుర్కుంటే  ఆ జట్టు కెప్టెన్‌కు ఒక మ్యాచ్ నిషేధంతో పాటు ఆటగాళ్లపైనా చర్యలుంటాయి. కౌంటీ ఛాంపియన్‌షిప్ తొలి అంచెలోనే రెండు ఫిక్స్‌డ్ పెనాల్టీలను  ఎదుర్కున్న  పూజారా జట్టు.. ఈనెల 13న లీస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో  మరో రెండు పెనాల్టీలను  మూటగట్టుకుంది. 

లీస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో  ససెక్స్ ఆటగాళ్లు  టామ్ హెయిన్స్, జాక్ కార్సన్, అరి కార్వెలాస్‌లు మైదానంలో నిబంధనలను విరుద్ధంగా ప్రవర్తించారు. పదే పదే అప్పీల్స్ చేస్తూ అంపైర్లకు విసుగు తెప్పించారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కూడా ఈ ముగ్గురి  ప్రవర్తన శృతిమించింది. అప్పటికే పలుమార్లు చెప్పిచూసిన అంపైర్లు  ససెక్స్ ఆటగాళ్లలో మార్పు రాకపోవడంతో పెనాల్టీ పాయింట్లు విధించారు.  దీంతో ఈ ముగ్గురితో పాటు  కెప్టెన్ పుజారా కూడా నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.  

లీస్టర్‌షైర్‌తో మ్యాచ్‌లో  తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్ 262 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లీస్టర్‌షైర్  108 పరుగులకు చాపచుట్టేసింది.  భారత బౌలర్ జయదేవ్ ఉనద్కత్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో  ససెక్స్.. 344 పరుగుల భారీ స్కోరు చేసింది. 499 పరుగుల లక్ష్య ఛేదనలో లీస్టర్‌షైర్ 483 పరుగులకు ఆలౌట్ అయింది.  15 పరుగుల తేడాతో ససెక్స్ విజయాన్ని అందుకుంది.  రెండో ఇన్నింగ్స్‌లో కూడా  ఉనద్కత్ ఆరు వికెట్లతో చెలరేగాడు.  

ఈ టోర్నీలో  ససెక్స్ తమ తదుపరి మ్యాచ్‌ను  డెర్బీషైర్‌తో నేటి నుంచి ఆడాల్సి ఉంది.  ఈ మ్యాచ్‌లో పుజారాతో పాటు  నిషేధం ఎదుర్కున్న మిగతా ముగ్గురూ దూరమయ్యారు. దీంతో ఓలీవర్ కార్టర్  ససెక్స్‌ను నడిపిస్తున్నాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget