అన్వేషించండి

Horoscope 8th June 2022: ఈ రాశి మహిళలు తమ భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 8th June 2022:ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

2022 జూన్ 08 బుధవారం రాశిఫలాలు

మేషం
స్థిరాస్తి వ్యవహారాల్లో పుంజుకునే అవకాశం ఉంది. కార్యాలయంలో మీకు వ్యతిరేకులు పెరుగుతారు. గృహ, సామాజిక పనుల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్థులు మరింత శ్రద్ధ పెడతారు. ఈ రోజంతా బిజీగా ఉంటారు. కుటంబంలో సంతోషం ఉంటుంది. 

వృషభం
మీరు మీ జీవిత భాగస్వామికి బహుమతులు ఇస్తారు.మీ పనిని మరొకరికి అప్పగించవద్దు. మీ నైపుణ్యంతో పనిని మరింత సులభతరం చేస్తారు. కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోండి. ఆహారం, యోగాపై శ్రద్ధ వహించండి. ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది. 

మిథునం
ఈ రోజు స్నేహితుడు లేదా బంధువుల ఇంటికి వెళతారు. ఎవరితోనూ గొడవ పడకండి. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. మీ ఆస్తులకు తగిన భద్రత ఏర్పాటు చేయండి. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. ప్రేమ వ్యవహారంలో మాధుర్యం ఉంటుంది.

Also Read: అక్టోబరులో పుట్టారా, మీరు సింహం లాంటోళ్లని మీకు తెలుసా!

కర్కాటకం
ఈ రోజు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సాయంత్రంలోగా ఓ శుభవార్త వింటారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది. పనిపట్ల అలసత్వం వద్దు. 

సింహం
బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తారు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయడం లాభదాయకంగా ఉంటుంది. ఉన్నతమైన వ్యక్తులను కలుస్తారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు వేసుకునేందుకు ఇదే మంచిరోజు. 

కన్యా
దంపతుల మధ్య అవగాహన, సఖ్యత పెరుగుతుంది.  వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ప్రేమ సంబంధాలను మూడుముళ్ల బంధంగా మార్చుకోవచ్చు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పాత పనులు తిరిగి ప్రారంభించవచ్చు. ఆర్థిక విషయాల్లో లాభిస్తుంది. కొత్త ప్రాజెక్ట్ గురించి కుటుంబంతో చర్చించవచ్చు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి.

తులా
ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటారు.ఆఫీసులో పనిభారం అధికంగా ఉంటుంది. అధికారుల నుంచి తిట్ల దండంకం వినాల్సి రావొచ్చు. చేసిన పనే పదే పదే చేయాల్సి రావొచ్చు.మహిళలు తమ భద్రత విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ప్రయాణం వాయిదా వేసుకోండి. అవసరమైన పనిని పూర్తి చేయండి.

Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి

వృశ్చికం
కుటుంబ కలహాల కారణంగా ఇబ్బందులు ఉంటాయి. ఏకాంతంలో ఉండటం చాలామంచిది. ఆర్థిక సంబంధమైన విషయాలకు ఈ రోజు చాలా మంచిది. వివాదాస్పద విషయాల్లో మీరు విజయం సాధించగలరు. మీ ఖర్చులు తగ్గుతాయి. కోరుకున్న ఉద్యోగం రావడంతో సంతోషంగా ఉంటారు. అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. 

ధనుస్సు
కుటుంబ పనులపై బయటకు వెళ్లాల్సి రావొచ్చు. సహోద్యోగులతో సఖ్యత ఉంటుంది. మీరు కొత్త వ్యక్తులతో స్నేహం చేస్తారు. మీరు ఆసక్తికరమైన పనులు చేసే అవకాశాలను పొందుతారు. మీరు చేసే పనులు మీకు చాలా ఆనందాన్నిస్తాయి. కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంపై ఆసక్తి ఉంటుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది.

మకరం
ఈ రోజంతా సానుకూలంగా ఉంటుంది. మీ పనులు నిదానంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. పరిచయం లేని వ్యక్తులతో ఎక్కువగా చర్చలు వద్దు. ఇతర పనులపై ఎక్కువ సమయం వెచ్చిస్తారు. స్నేహితులతో చర్చిస్తారు. కొత్త వ్యాపారం  ప్రారంభించాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. 

కుంభం
వివాదాలకు దూరంగా ఉండండి. స్నేహితుడిని కలుస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఎవ్వరికీ మాటివ్వకండి. ఆ కారణంగా మీరు చిక్కుల్లో చిక్కుకోవచ్చు.అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వకండి. ఎవరిపైనా ఆధారపడొద్దు.. సొంతంగా నిర్ణయాలు తీసుకోండి.  పిల్లలతో సంతోషంగా గడుపుతారు.

మీనం
మీరు కార్యాలయంలో శుభవార్త  వింటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.బలమైన సూర్యకాంతిలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనవసర వివాదాల్లో జోక్యం చేసుకోకండి. న్యాయపరమైన వ్యవహారాలు సాగుతాయి. ఈ రోజు మంచి రోజు అవుతుంది. మిత్రులను కలుస్తారు. 

Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet decisions: మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ పోర్టు - బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపు - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ పోర్టు - బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపు - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
Nara Lokesh:  రెడ్ బుక్ పేరు వింటే గుండెపోట్లు - విజనరీ ,ప్రిజనరీకి ఎంతో తేడా - లోకేష్ కీలక వ్యాఖ్యలు
రెడ్ బుక్ పేరు వింటే గుండెపోట్లు - విజనరీ ,ప్రిజనరీకి ఎంతో తేడా - లోకేష్ కీలక వ్యాఖ్యలు
Kancha Gachibowli Lands Issue: కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - తెలంగాణ సర్కార్‌కు ఊహించని షాక్
కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - తెలంగాణ సర్కార్‌కు ఊహించని షాక్
Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షాక్ - మద్యం స్కాం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షాక్ - మద్యం స్కాం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs SRH Match Preview IPL 2025  ఈడెన్ లో దుల్లగొట్టేసి ఫామ్ లోకి వచ్చేయాలని సన్ రైజర్స్Virat Kohli Sympathy Drama IPL 2025 | కొహ్లీ కావాలనే సింపతీ డ్రామాలు ఆడాడాSiraj Bowling vs RCB IPL 2025 | మియా మావ బౌలింగ్ కి..వణికిపోయిన ఆర్సీబీRCB vs GT IPL 2025 Match Trolls | అయ్యిందా బాగా అయ్యిందా అంటున్న CSK, MI ఫ్యాన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet decisions: మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ పోర్టు - బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపు - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ పోర్టు - బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపు - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
Nara Lokesh:  రెడ్ బుక్ పేరు వింటే గుండెపోట్లు - విజనరీ ,ప్రిజనరీకి ఎంతో తేడా - లోకేష్ కీలక వ్యాఖ్యలు
రెడ్ బుక్ పేరు వింటే గుండెపోట్లు - విజనరీ ,ప్రిజనరీకి ఎంతో తేడా - లోకేష్ కీలక వ్యాఖ్యలు
Kancha Gachibowli Lands Issue: కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - తెలంగాణ సర్కార్‌కు ఊహించని షాక్
కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - తెలంగాణ సర్కార్‌కు ఊహించని షాక్
Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షాక్ - మద్యం స్కాం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షాక్ - మద్యం స్కాం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
MLA Mal Reddy: కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ మంటలు - రాజీనామా ఆఫర్ చేసిన మల్ రెడ్డి రంగారెడ్డి
కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ మంటలు - రాజీనామా ఆఫర్ చేసిన మల్ రెడ్డి రంగారెడ్డి
Worldbank funds to Amaravati: అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు విడుదల  3500కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి
అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు విడుదల 3500కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి
Viral News:  60 సెకన్లలో 50 చెంపదెబ్బలు - ఇది పోటీ కాదు ఓ భార్యపై భర్త దారుణం - వైరల్ వీడియో
60 సెకన్లలో 50 చెంపదెబ్బలు - ఇది పోటీ కాదు ఓ భార్యపై భర్త దారుణం - వైరల్ వీడియో
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాంతాల్లో పిడుగుల వర్షం- వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక 
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాంతాల్లో పిడుగుల వర్షం- వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక 
Embed widget