అన్వేషించండి

Astrology: అక్టోబరులో పుట్టారా, మీరు సింహం లాంటోళ్లని మీకు తెలుసా!

Astrology: ఒకరి వ్యక్తిత్వం…వారు పుట్టిన తేదీ, సమయం, రాశి, తిథి, గ్రహస్థితి ఆధారంగా మాత్రమే కాదు...పుట్టిన నెల ఆధారంగా కూడా చెప్పొచ్చంటారు జ్యోతిష్యులు. మరి అక్టోబరులో పుట్టినవారెలా ఉంటారంటే...

అక్టోబరులో జన్మించినవారెలా ఉంటారంటే

  • అక్టోబరులో పుట్టినవారు ఆకర్షణీయంగా ఉంటారు. ఈ వ్యక్తులు ఎవరినైనా మంత్రముగ్ధులను చేయగల సాటిలేని మనోజ్ఞతను కలిగి ఉంటారు. వీరితో స్నేహంగా ఉండేందుకు చాలామంది తాపత్రయపడతారు. వీరి ఆశావాదం, సానుకూల ధృక్పథం ఎదుటివారిని ప్రభావితం చేస్తుంది.
  • అక్టోబరులో జన్మించిన వారు ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. తమ భావాలను, భావోద్వేగాలను మనసులోనే దాచుకునేందుకు ఇష్టపడతారు. వీరు అంతర్ముఖులు.
  • శత్రువుల కన్నా స్నేహితులను సంపాదించుకోవడమే గొప్పతనం అని నమ్ముతారు. అందుకే వీరివల్ల చాలామందికి మేలు తప్ప హాని జరగదు.
  • ఇతరుల సమస్యలపట్ల చాలా సున్నితంగా ఉంటారు. తమవంతు అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటారు.
  • పట్టుదలకు కేరాఫ్ అన్నట్టు ఉంటారు అక్టోబరులో పుట్టిన వ్యక్తులు. పని మొదలుపెట్టరు..పెట్టారంటే పూర్తిచేయనిదే వదలరు. ఎంత కష్టమైన పని అయినా తమ సామర్థ్యంలో పూర్తిచేస్తారు. ఈ కారణంవల్లే ఇతరులతో కన్నా సింగిల్ గా పనిచేయడానికే ఇష్టపడతారు.
  • జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటారు, ఓ దశలో పూర్తిగా నిరుత్సాహపడతారు..కానీ పడిలేచిన కెరటంలా కెరీర్లో దూసుకెళతారు.స్థిరమైన జావితాన్ని ఆస్వాదించగలుగుతారు.
  • అక్టోబర్‌లో జన్మించిన వారు విలాసవంతమైన వస్తువులను కలిగి ఉండటానికి ఇష్టపడతారు.  తమ కోసం  ఖర్చు చేయడమే కాదు, తమ ప్రియమైన వారికోసం కూడా ఖర్చుచేయడంలో ముందుంటారు.
  • ఈ నెలలో పుట్టినవారు సాధారణంగా తెలివైన వారు. తమకు ఆసక్తి ఉన్న రంగంలో మరింత జ్ఞానాన్ని సంపాదించడానికి తమ సమయాన్ని, డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు.
  • వీరికి ఏకాగ్రత ఎక్కువ.  పరిస్థితులను గమనించి, విశ్లేషించి, సాధారణంగా అందరినీ మెప్పించే ఉత్తమమైన పరిష్కారాలతో ముందుకు వస్తారు. వారి ఆలోచన పదును తెలుసుకున్నవారు జీవితంలో ఎదురైన కష్టాలనుంచి బయట పడేందుకు వీరి సలహాలు అడుగుతారు.
  • జీవితాన్ని సరదాగా గడపాలనే యోచనతో ఉంటారు. భవిష్యత్ , గతం గురించి ఆలోచించడానికి ఇష్టపడరు..ఈ క్షణం సంతోషంగా ఉన్నామా లేదా అన్నదే ఆలోచిస్తారు.
  • సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఆందోళన చెందుతారు..దాని పరిష్కార మార్గాలు ఆలోచిస్తారు. ఎప్పుడో ఏ ఏదో జరుగుతుందని భయపడరు.
  • అక్టోబరులో జన్మించిన వారు రొమాంటిక్‌గా ఉంటారు. వీరు ప్రేమకు, ప్రేమికులకు ఎక్కువ విలవనిస్తారు.
  • మంచి తెలివితేటలు, లౌకిక జ్ఞానం ఉంటుంది, కళలపై మంచి అభిరుచి ఉంటుంది, వీరికి దైవభక్తి కూడా ఎక్కువే
  • ఆత్మవిశ్వాసం, తెలివితేటల్నే నమ్ముకుని ముందడుగు వేస్తారు, వీలైనంతవరకూ బ్యాలెన్సెడ్ గా మాట్లాడతారు
  • సున్నితమైన మనస్సు వీరిసొంతం, పరిస్థితులు అనుకూలించని పక్షంలో సర్దుకుపోతారు కానీ ఇతరులను ఇబ్బందిపెట్టరు

అక్టోబరులో జన్మించిన వారి ఆరోగ్యం: ఈ నెలలో పుట్టిన వారి ఆరోగ్యం నార్మల్ గా ఉంటుంది. చర్మవ్యాధులు,షుగర్ రావొచ్చు

ఆర్థిక పరిస్థితి: శ్రమ, తెలివితేటలతోనే సంపాదిస్తారు

కలిసొచ్చే వారాలు: సోమవారం, గురువారం, శుక్రవారం

కలిసొచ్చే రంగులు: బ్లూ, రోజ్ కలర్

Also Read: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి

Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!

టాప్ హెడ్ లైన్స్

మీన రాశి ఆగస్టు 23-29 వారఫలం
మీన రాశి ఆగస్టు 23-29 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 23-29 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 23-29 వారఫలం
మకర రాశి ఆగస్టు 23-29 వారఫలం
మకర రాశి ఆగస్టు 23-29 వారఫలం
ధనస్సు రాశి వారఫలం ఆగస్టు 23 - 29
ధనస్సు రాశి వారఫలం ఆగస్టు 23 - 29

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget