News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Astrology: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!

ఒకరి వ్యక్తిత్వం…వారు పుట్టిన తేదీ, సమయం, రాశి, తిథి ఆ రోజు గ్రహస్థితి ఆధారంగా అంచనా వేస్తారు. అయితే పుట్టిన నెల ఆధారంగా కూడా లక్షణాలు చెప్పొచ్చంటారు జ్యోతిష్యపండితులు. జూలైలో పుట్టినవారెలా ఉంటారంటే

FOLLOW US: 
Share:

జూలైలో పుట్టిన వారి లక్షణాలు 

జూలై నెలలో పుట్టిన వారు అదృష్టజాతకులు అుతారు. బాగా సంపాదిస్తారు. వ్యాపారాలు చేస్తారు, పరిశ్రమలు స్తాపిస్తారు. నలుగురి మేలు చేస్తారు. ఇంకా జులైలో పుట్టినవారి లక్షణాలు ఇక్కడ తెలుసుకోండి

  • జూలై నెలలో పుట్టిన వారు చాలా ఆశాజనకంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సానుకూల ధోరణి కలిగిఉంటారు
  • ఈ నెలలో జన్మించిన వారు జీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు అన్ని ప్రణాళికలు వేసుకుంటారు, ఆ దిశగా కష్టపడతారు
  • వీరు ఎక్కడుంటే అక్కడ సందడి, సంతోషమే, హాస్యభరితంగా ఉంటారు, మాటల్లో వ్యంగ్యం కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది
  • జూలైలో జన్మించిన వారు ఆసక్తికరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.వీరికి ఆహారం, సంగీతంలో మంచి అభిరుచి ఉంది. వారు జీవితంలోని చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కుంటారు
  • ఈనెలలో పుట్టినవారు తమవల్ల ఎదుటివారికి ఎలాంటి సహాయం అవసరం అయినా చేసేందుకు సిద్ధంగా ఉంటారు
  • వీరు కొంచెం కలత చెందినా అస్థిరంగా, భావోద్వేగంగా ఉంటారు.సున్నితంగాఉంటారు. ఎవరైనా తమ మనోభావాలను గాయపరిచినప్పుడు వాటిని అధిగమించేందుకు సమయం తీసుకుంటారు.
  • తమకు అత్యంత ముఖ్యమైన విషయాలు, వ్యక్తులపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరిస్తారు.
  • తమ కలలను నెరవేర్చుకునేందుకు కష్టపడి పనిచేస్తారు. కుటుంబ జీవితంపై దృష్టి సారిస్తారు.  
  • అర్థంలేని చర్చలు, చిల్లర నాటకాలు, అర్థంలేని గాసిప్ లను అస్సలు ఆస్వాదించరు
  • కుటుంబమే సర్వస్వం అన్నట్టుంటారు.
  • వీరి తెలివితేటలు అమోఘం. మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఏ విషయాన్ని అయినా తొందరగా గ్రహిస్తారు.
  • వీరి మనస్తత్వం ఎవ్వరికీ అర్థంకాదు.
  • పనిలో ఉన్నప్పుడు ఇతర విషయాల గురించి ఆలోచించరు..తలపెట్టిన పనిపైనే పూర్తిగా ఫోకస్ చేస్తారు.
  • జూలైలో పుట్టినవారు నమ్మిన దాన్ని నిజాయితీగా చేస్తారు.
  • అనుకున్న టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు అమితంగా కష్టపడతారు
  • ప్రణాళిక ప్రకారం పనిచేస్తారు, వాటిని సరిగ్గా అమలుచేసి ఫలితం పొందుతారు
  • తెలివితేటలు సరిగ్గా ఉపయోగిస్తే వీరివల్ల కానిదంటూ ఉండదు
  • ఈ నెలలో పుట్టినవారు బాగా సంపాదిస్తారు. స్టాక్ ఎక్సేజ్, కంపెనీ ప్రమోటర్స్ గా, కొత్త కొత్త ప్రయోగకరమమైన వస్తువులు, వ్యాపారాలు ద్వారా సంపాదించగలరు.
  • అందరిపట్లా స్నేహభాలంగా ఉంటారు నలుగురికి లాభం చేకూరుస్తారు. మానసికంగా బలవంతులు
  • శ్రమకు ఓర్చి కష్టపడతారు, తొందరపాటు వల్ల కొన్ని విషయాల్లో నష్టపోతారు
  • ప్రయాణాల్లో కూడా స్నేహితులను సంపాదించుకుంటారు
  • జీవితంలో చాలా కష్టాలను ఓర్చుకుని నిలబడతారు..వీరిని కష్టాలు ఏమీ చేయలేవు..వాటిని ఎదుర్కొని నిలబడి చూపిస్తారు
  • జూలైలో పుట్టినవారు ఎంత సున్నితంగా ఉంటారో అంతే స్వీయనియంత్రణ కలిగి ఉంటారు, స్వతంత్రంగా నిర్ణయాత్మకంగా ఉంటారు

జూలైలో పుట్టినవారి అనారోగ్య సమస్యలు: గ్యాస్ సంబంధిత సమస్యతో బాధపడతారు
ఆర్థిక పరిస్థితి: బాగా సంపాదిస్తారు, ఆ సంపదను అనుభవిస్తారు
కలిసొచ్చే వారాలు: ఆదివారం, బుధవారం
కలిసొచ్చే రంగులు: పసుపు, ఆకుపచ్చ

జూలైలో జన్మించిన ప్రసిద్ధ రోమన్ నాయకుడు జూలియస్ సీజర్ వల్ల ఈ నెలకు ఈ పేరొచ్చింది. జూలియస్ పేరు రోమన్ సామ్రాజ్య చరిత్రలో నిలిచిపోయింది. ఈనెలలో జన్మించిన ప్రభావంతమైన వ్యక్తుల్లో ఇంకా నెల్సన్ మండేలా, ప్రిన్సెస్ డయానా, US అధ్యక్షులు (జాన్ క్విన్సీ ఆడమ్స్, కాల్విన్ కూలిడ్జ్, గెరాల్డ్ ఫోర్డ్ , జార్జ్ డబ్ల్యూ. బుష్) ఈ నెలలో జన్మించారు. ఇతర సెలబ్రెటీల విషయానికొస్తే ప్రియాంక చోప్రా , రణవీర్ సింగ్, సౌరవ్ గంగూలీ, మాజీ వ్యాపార దిగ్గజం JRD టాటా, రచయిత జుంపా లాహిరి, గాయకుడు కైలాష్ ఖేర్ కూడా జులైలో పుట్టినవారే. 

Also Read:  మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా

Also Read:  ఈ నెలలో పుట్టిన వారు లవ్ లో ఫెయిల్ అవుతారు, వ్యక్తిగతంగా సక్సెస్ అవుతారు

Published at : 17 May 2022 06:01 AM (IST) Tags: Horoscope zodiac signs Horoscope Today Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Taurus Gemini Virgo Aries PHoroscope Today Astrology july month characteristics of July month born people

ఇవి కూడా చూడండి

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !

Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !

ఈ రాశులవారు చెడు సహవాసాలను వదులుకుంటే మంచిది, సెప్టెంబరు 27 రాశిఫలాలు

ఈ రాశులవారు చెడు సహవాసాలను వదులుకుంటే మంచిది, సెప్టెంబరు 27 రాశిఫలాలు

Chanakya Niti In Telugu : మీ జీవితంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడని 8 మంది వీళ్లే!

Chanakya Niti In Telugu : మీ జీవితంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడని 8 మంది వీళ్లే!

Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయ‌ణం చేయాల్సిన సందర్భాలివే!

Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయ‌ణం చేయాల్సిన సందర్భాలివే!

టాప్ స్టోరీస్

ACB Court Case : అక్టోబర్ నాలుగో తేదీకి ఏసీబీ కోర్టులో విచారణలు వాయిదా - కస్టడీ, బెయిల్ పిటిషన్లూ అప్పుడే !

ACB Court Case : అక్టోబర్ నాలుగో తేదీకి ఏసీబీ కోర్టులో విచారణలు వాయిదా - కస్టడీ, బెయిల్ పిటిషన్లూ అప్పుడే !

IND vs AUS 3rd ODI: చితక్కొట్టిన కంగారూలు! టీమ్‌ఇండియా టార్గెట్‌ 353

IND vs AUS 3rd ODI: చితక్కొట్టిన కంగారూలు! టీమ్‌ఇండియా టార్గెట్‌ 353

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Telangana Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు ఖాయం - ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు !

Telangana Group 1 :    గ్రూప్ 1 ప్రిలిమ్స్  రద్దు ఖాయం   - ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు !