Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు
ఒకరి వ్యక్తిత్వం…వారు పుట్టిన తేదీ, సమయం, రాశి, తిథి, గ్రహస్థితి ఆధారంగా అంచనా వేస్తారు. అయితే పుట్టిన నెల ఆధారంగా కూడా లక్షణాలు చెప్పొచ్చంటారు జ్యోతిష్యులు. మరి సెప్టెంబరులో పుట్టినవారెలా ఉంటారంటే
సెప్టెంబరు నెల ప్రత్యేకత ఏంటంటే..వేసవి తాపం చల్లారుతుంది, పండుగలు మొదలయ్యే నెల ఇదే. చాలామంది పుట్టినరోజులు ఈ మంత్ లోనే ఉంటాయి. మిగిలిన నెలలతో పోలిస్తే సెప్టెంబరులో పుట్టిన వారు తొందరగా సక్సెస్ అవుతారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనంలోనూ ఇదే విషయం స్పష్టమైంది.
- సెప్టెంబరులో పుట్టిన వారు కృషిని నమ్ముకుంటారు
- వీరికి చురుకుదనం చాలా ఎక్కువ అందుకే లైఫ్ లో తొందరగా సక్సెస్ అవుతారు
- వీరికి మహా తొందరపాటు..ఆలోనచ రావడమే తడవు వెంటనే అమలు చేసేస్తారు
- వీళ్లకంటూ కొన్ని పద్ధతులుంటాయి. ఈ నెలలో పుట్టినవారు లాయర్లు, మంచి వక్తలుగా రాణిస్తారు.
- సొంత ఆలోనచల ఆధారంగా వెళ్లిపోతారు కానీ పక్కవారి ప్రభావం వీరిపై అస్సలు ఉండదు
- సెప్టెంబరులో పుట్టిన వారు ప్రేమ, కుటుంబ జీవితం అంత సంతోషంగా ఉండదు
- వీరి బాల్యం, యవ్వనం అంతా కష్టాలు, శ్రమతో గడుస్తుంది
- చెడు అలవాట్లు, చెడు స్నేహాలను దగ్గరకు రానివ్వకుండా చూసుకుంటే లైఫ్ లో బాగా సక్సెస్ అవుతారు
- సెప్టెంబరులో పుట్టినవారి ఆరోగ్యం బాగానే ఉంటుంది
- ఆహారం తీసుకోవడంలో వీరికంటూ కొన్ని ప్రత్యేక నియమాలు, అభిరుచులు ఉంటాయి
- బయటకు కరుకుగా కనిపించినా వీరు చాలా సున్నిత మనస్కులు
- పరిస్థితులు, వాతావారణం వీరికి అంత అనకూలంగా ఉండదు
- ఇతరుల ప్రవర్తనవల్ల మానసికంగా గాయపడతారు
- పాఠశాల విద్య, ఉన్నత విద్యలో బాగా రాణిస్తారు. మిగిలిన విద్యార్థులకన్నా వీరు భిన్నంగా, ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంటారు.
- సెప్టెంబరు-నవంబరు నెలల్లో పుట్టిన వారు మిగిలిన వారికన్నా ఎక్కువ కాలం జీవించే అవకాశాలున్నాయని ఓ అధ్యయనం పేర్కొంది. దీనివెనుకున్న శాస్త్రీయ కారణం ఏంటంటే ఈ కాలంలో జన్మించిన పిల్లలు సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు , అలెర్జీలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ వారు రోగనిరోధక శక్తిని పెంచుతారు. అందుకే ఎక్కువ కాలం జీవిస్తారు.
- మంచి ఆలోచనా విధానం కలిగి ఉంటారు, అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. తమవల్ల అవుతుంది అనుకుంటే ఎవ్వరికైనా ఎలాంటి సహాయం అయినా చేయడానికి సిద్ధంగా ఉండారు
సెప్టెంబరులో పుట్టినవారి ఆరోగ్యం: వీరికి ఊపిరితిత్తులు, భుజాలు, చేతులకు సంబంధించిన సమస్యలు, జ్వరం, చర్మ వ్యాధులు రావొచ్చు
కలిసొచ్చే వారాలు: బుధవారం, శనివారం
కలిసొచ్చే రంగులు: ఆకుపచ్చ, తెలుపు
Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి
Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!
Also Read: మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా
Also Read: ఈ నెలలో పుట్టిన వారు లవ్ లో ఫెయిల్ అవుతారు, వ్యక్తిగతంగా సక్సెస్ అవుతారు