News
News
వీడియోలు ఆటలు
X

Astrology: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి

ఒకరి వ్యక్తిత్వం…వారు పుట్టిన తేదీ, సమయం, రాశి, తిథి ఆ రోజు గ్రహస్థితి ఆధారంగా అంచనా వేస్తారు. అయితే పుట్టిన నెల ఆధారంగా కూడా లక్షణాలు చెప్పొచ్చంటారు జ్యోతిష్యపండితులు. నవంబరులో పుట్టినవారెలా ఉంటారంటే

FOLLOW US: 
Share:

నవంబరు నెలలో పుట్టినవారికి కోపం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, పట్టుదల-ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. అయితే ముక్కుసూటిగా మాట్లాడి ఇతరులతో శత్రుత్వాన్ని కొనితెచ్చుకుంటారు. ఇంకా నవంబరు జన్మించినవారి లక్షణాలు ఇలా ఉంటాయి.

 • నవంబర్‌లో పుట్టిన వారు ఇతరుల కన్నా చాలా భిన్నంగా ఉంటారు. వీరి రూటే సెపరేట్, వారి ఆలోచనలు ప్రపంచానికి దూరంగా ఉంటాయి. చేసే ప్రతిపని ఓ నిర్దిష్ట పద్ధతిలో ఉండాలనుకుంటారు. 
 • ఈ నెలలో జన్మించిన వ్యక్తులు అత్యంత విశ్వసనీయులు. స్నేహితులు, కుటుంబం, భాగస్వాములను ఎప్పుడూ నిరాశపర్చరు.  
 • అందరి ముందూ మంచిగా మాట్లాడి వెనక్కు వెళ్లి మోసం చేసే టైప్ కాదు
 • వీరిలో అందం కన్నా ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. తమ చమత్కారంతో అందర్నీ ఆకట్టుకుంటారు.
 • నవంబరులో జన్మించిన కొందరికి అసూయపడే లక్షణం ఉంటుంది. అన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి  వల్ల వీళ్లెక్కడున్నా అన్నింటికీ  ఏదో విధంగా కేంద్ర బిందువు అవుతారు
 • సాధారణంగా ఈ నెలలో పుట్టినవారు ప్రశాంతంగా ఉంటారు. పొరపాటున రెచ్చగొట్టారో అయిపోయారంతే. ఎప్పుడూ కోపంగా ఉండరు కానీ విరుచుకుపడితే మాత్రం తప్పించుకోలేరు. దానికి కూడా ఓ కారణం ఉండే ఉంటుంది. 
 • వీరు ఉద్దేశ పూర్వకంగా ఎవ్వర్నీ బాధపెట్టరు కానీ వీరి మాటలు, చర్యలను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకుంటారు. 
 • నవంబర్‌లో జన్మించిన వ్యక్తులు తరచుగా తమను తాము ఎలా భావిస్తున్నారో అంచనా వేసుకుంటుంటారు. స్నేహితుల విషయంలో 
  కొన్ని రహస్యాలు మెంటైన్ చేసినప్పటికీ వారికోసం ముందుంటారు.
 • వీళ్లు మహా మొండిగా ఉంటారు..ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు కానీ తమ అభిప్రాయాలను కూడా గౌరవించాల్సిందే అని పట్టుబడతారు. కొన్నిసార్లు అన్నింటా తమదే పైచేయి ఉండాలంటారు
 • వీరిని అభిమానించేవారికి సహాయం చేసేందుకు ఎంత దూరమైనా వెళతారు
 • ఈనెలలో పుట్టినవారికి ఎన్నో కోర్కెలుంటాయి..అవి కొనాలి, ఇవి కొనాలి, బాగా బతకాలి అనుకుంటారు
 • శ్రమించేందుకు అస్సలు తగ్గరు...కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు, సోమరితనం వీరి దరిదాపుల్లో ఉండదు
 • నిజాయితీ పరులు, పలుకుపడి సంపాదిస్తారు, గౌరవంగా బతుకుతారు, కీర్తిప్రతిష్టలు పెంచుకుంటారు
 • దేవుడిపై నమ్మకం ఉంటుంది, ఆచారాలు, పద్ధతులు పాటిస్తారు
 • కొందరు వ్యాపారాలు, పరిశ్రమలు ప్రారంభించి నలుగురికి ఉపాధి కల్పిస్తారు
 • ఆవేశం, కోపం ఉన్నప్పుడు ఎవ్వరినీ లెక్కచేయరు..ఇదే వీరికి మైనస్. ఇది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది
 • ఈ నెలలో పుట్టినవారికిశక్తి సామర్థ్యాలు, ఆకర్షణ శక్తి , తెలివితేటలు పవర్ ఉంటాయి
 • వీరిలో చాలామంది డాక్టర్స్, సర్జన్స్, ప్రవర్తలు, బోధకులు, రాజకీయ నాయకులు ఉన్నారు
 • ఈ నెలలో పుట్టినవారు చేసిన తప్పులవల్ల జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులను అభిమానించి మోసపోతారు. 
 • త్యాగబుద్ధి, సహాయం చేసే గుణం ఎక్కువ.
 • ఆవేశంలో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే సక్సెస్ అవుతారు

ఆరోగ్యం: ఈ నెలలో పుట్టినవారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం
కలిసొచ్చే వారాలు: సోమవారం, శుక్రవారం
కలిసొచ్చే రంగులు: ఎరుపు, పుసుపు, ఆకుపచ్చ

Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!

Also Read:  మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా

Also Read:  ఈ నెలలో పుట్టిన వారు లవ్ లో ఫెయిల్ అవుతారు, వ్యక్తిగతంగా సక్సెస్ అవుతారు

Published at : 18 May 2022 08:05 AM (IST) Tags: Horoscope zodiac signs Horoscope Today Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Taurus Gemini Virgo Aries PHoroscope Today Astrology july month 10 best traits of people born in November characteristics of November month born people

సంబంధిత కథనాలు

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

చేతిలో డబ్బు నిలవడం లేదా? మట్టి కలశంతో ఇలా చేసి చూడండి

చేతిలో డబ్బు నిలవడం లేదా? మట్టి కలశంతో ఇలా చేసి చూడండి

టాప్ స్టోరీస్

Balineni Meet Jagan : సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?

Balineni Meet Jagan : సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో వడగాడ్పులు, తెలంగాణలో తేలికపాటి వాన - ఐఎండీ

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో వడగాడ్పులు, తెలంగాణలో తేలికపాటి వాన - ఐఎండీ