అన్వేషించండి

Ashtadasa Maha Puranas: అష్టాదశ పురాణాలు ఏవి - ఏ పురాణంలో ఏముంది!

Ashtadasa Puranas Importance : అష్టాదశ పురాణాలు ...అంటే 18 పురాణాలు. వ్యాసమహర్షి రచించిన ఈ పురాణాలు ఏంటి? ఏ పురాణంలో ఏముంది?

Ashtadasa Maha Puranas Special: 18 పురాణాలలో మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది. మిగిలిన పురాణాలేంటి? ఏ పురాణంలో ఏముందో ఇక్కడ తెలుసుకోండి...

 మత్స్యపురాణం

మత్స్యరూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు మనువు అనే రాజుకు చెప్పిన ఈ పురాణమే మత్స్యపురాణం. ఇందులో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు లాంటి రాజుల గొప్పదనం, ధర్మమంటే ఏంటి? ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేంటి? వీటన్నింటి గురించి వివరణ ఉంటుంది.

కూర్మపురాణం

కూర్మావతారం దాల్చిన శ్రీ మహావిష్ణువు చెప్పిన కూర్మపురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, కాశి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.

Also Read: శివుడికి ఈ ద్రవ్యంతో అభిషేకం చేస్తే సర్వ సంపద వృద్ధి

వామన పురాణం

పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన వామనపురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతం, రుతువుల గురించిన వర్ణన ఉంటుంది. 

వరాహపురాణం

వరాహావతారం దాల్చిన శ్రీ మహా విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు వరాహపురాణం పురాణంలో కనిపిస్తాయి.

 గరుడ పురాణం

గరుత్మంతుడి సందేహాలపై శ్రీ మహావిష్ణువు చెప్పిన వివరణ గరుడ పురాణం. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతో పాటు జనన మరణాలంటే ఏంటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు,  ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది లాంటి విషయాలు ఉంటాయి. 

వాయుపురాణం

వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో పరమేశ్వరుడి మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు ఉంటాయి.

అగ్నిపురాణం

అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన  అగ్నిపురాణంలో  వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను తెలుసుకోవచ్చు

Also Read: కార్తీకమాసంలో పాటించే ఈ నియమం శారీరక, మానసిక ఔషధం!

స్కాందపురాణం

కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం సహా వివిధ ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడు. ఇందులో రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయ విశేషాలు సహా ఎన్నో పుణ్యక్షేత్రాల గురించి ఉంటుంది

 లింగపురాణం

లింగరూప శివుడి ఉపదేశాలు, శివుడి మహిమలతో పాటూ ఖగోళ, జ్యోతిష్యం గురించి వివరిస్తుంది లింగ పురాణం.

నారద పురాణం

బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారద మహర్షి  చెప్పిన ఈ పురాణంలో వేదాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించి నారద పురాణం ఉంటుంది. 

పద్మపురాణం

పద్మపురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి వివరణాత్మకంగా ఉంటుంది

మేష రాశి నుంచి కన్యా రాశి వరకూ ఏ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిదో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.....

విష్ణుపురాణం

పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన విష్ణుపురాణంలో..శ్రీ మహా విష్ణువు అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్ర ఉంటుంది.

బ్రహ్మపురాణం 

బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన  బ్రహ్మపురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి ప్రస్తావించారు వ్యాసమహర్షి

భాగవత పురాణం

భాగవత పురాణంలో శ్రీ మహావిష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిత్ మహారాజుకి శకమహర్షి చెప్పగా..శకుడికి మొదట బోధించాడు వ్యాసమహర్షి

తులా రాశి నుంచి మీన రాశి వరకూ ఏ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిదో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

బ్రహ్మాండ పురాణం

బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించి ఉంటుంది. 

భవిష్య పురాణం

మనువుకు సూర్యభగవానుడు చెప్పిన ఈ పురాణంలో  అగ్ని, సూర్యోపాసన విధులతో పాటు, భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాల గురించి వివరణ ఉంటుంది.

బ్రహ్మావైవర్తపురాణం

 భోజననియమాలు, రోగనివృత్తిసాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం బ్రహ్మావైవర్తపురాణం ఉంటాయి. 

మార్కండేయ పురాణం

మార్కండేయ పురాణంలో శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.

Also Read: ఈ రాశివారికి ఆదాయం, పనిభారం రెండూ పెరుగుతాయి - నవంబరు 28 రాశిఫలాలు

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Posani Krishna Murali Latest News:
"లైడిటెక్టర్ పరీక్ష చేయండి, తప్పు చేస్తే నరికేయండి" న్యాయమూర్తి ముందు పోసాని గగ్గోలు
Telangana Latest News: వెంటాడుతున్న కోడి పందేలు- బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు
వెంటాడుతున్న కోడి పందేలు- బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు
Vijaya Sai Reddy Latest News:మాట మార్చిన విజయ సాయి రెడ్డి   అప్రూవర్ గా మారుతున్నారా?
మాట మార్చిన విజయ సాయి రెడ్డి అప్రూవర్ గా మారుతున్నారా?
CM Revanth Reddy:  స్టేచర్ కాదు స్ట్రెచర్ అక్కడ్నుంచి మార్చురీ - రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
స్టేచర్ కాదు స్ట్రెచర్ అక్కడ్నుంచి మార్చురీ - రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kerala teen dies due to water fasting | వాటర్ డైట్ వల్ల ప్రాణాలు కోల్పోయిన కేరళ యువతీ | ABP DesamYS Jagan YSRCP Formation Day | మెడలో పార్టీ కండువాతో కనిపించిన జగన్..రీజన్ ఏంటంటే | ABP DesamPithapuram Public Talk on Pawan Kalyan | కళ్యాణ్ గారి తాలుకా అని పిఠాపురంలో చెప్పుకోగలుగుతున్నారా.?Gun fire in Chittoor Locals Rescue Operation | పోలీసుల వచ్చేలోపే గన్నులతో ఉన్న దొంగలను పట్టుకున్న స్థానికులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Posani Krishna Murali Latest News:
"లైడిటెక్టర్ పరీక్ష చేయండి, తప్పు చేస్తే నరికేయండి" న్యాయమూర్తి ముందు పోసాని గగ్గోలు
Telangana Latest News: వెంటాడుతున్న కోడి పందేలు- బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు
వెంటాడుతున్న కోడి పందేలు- బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు
Vijaya Sai Reddy Latest News:మాట మార్చిన విజయ సాయి రెడ్డి   అప్రూవర్ గా మారుతున్నారా?
మాట మార్చిన విజయ సాయి రెడ్డి అప్రూవర్ గా మారుతున్నారా?
CM Revanth Reddy:  స్టేచర్ కాదు స్ట్రెచర్ అక్కడ్నుంచి మార్చురీ - రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
స్టేచర్ కాదు స్ట్రెచర్ అక్కడ్నుంచి మార్చురీ - రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
YSRCP Foundation Day: జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
Court Movie Review - 'కోర్టు' రివ్యూ: థియేటర్లలో వాదనలు నిలబడతాయా? నాని నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
'కోర్టు' రివ్యూ: థియేటర్లలో వాదనలు నిలబడతాయా? నాని నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
HMDA Latest News : హెచ్ఎండీఏ పరిధిలోకి 11 జిల్లాలు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
హెచ్ఎండీఏ పరిధిలోకి 11 జిల్లాలు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
TDP Latest News: టిడిపికి ఓ ట్రబుల్ షూటర్ కావలెను, కాంగ్రెస్ ప్లాన్ టిడిపిలో వర్కౌట్ అవుతుందా?
టిడిపికి ఓ ట్రబుల్ షూటర్ కావలెను, కాంగ్రెస్ ప్లాన్ టిడిపిలో వర్కౌట్ అవుతుందా?
Embed widget