Karthika Masam 2023: శివుడికి ఈ ద్రవ్యంతో అభిషేకం చేస్తే సర్వ సంపద వృద్ధి
Karthika Masam 2023 : శివుడు అభిషేక ప్రియుడని భక్తులందరికీ తెలుసు. పంచామృతాలతో, పండ్ల రసాలతో, విభూదితో ఇలా రకరకాల అభిషేకాలు చేస్తుంటారు. మరి దేనితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం పొందుతారో తెలుసా..
![Karthika Masam 2023: శివుడికి ఈ ద్రవ్యంతో అభిషేకం చేస్తే సర్వ సంపద వృద్ధి Karthika Masam 2023 benefits of performing lord shiva abhishekam with different items know in telugu Karthika Masam 2023: శివుడికి ఈ ద్రవ్యంతో అభిషేకం చేస్తే సర్వ సంపద వృద్ధి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/23/5a02470a6cbe9f807deb0ddb0b134a0c1700714343547217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Benefits of Performing Lord Shiva Abhishekam
"ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్"
కోరిన వరాలిచ్చే పరమేశ్వరుడు కోపం వస్తే త్రినేత్రంతో భస్మం చేసే ప్రళయ రుద్రునిగా..గరళాన్ని గొంతులో దాచుకున్న నీరకంఠుడిగా, ఈశునిగా, సర్వేశునిగా, మహాదేవునిగా ఇలా ఎన్నో రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తాడు. అయితే శ్రీ మహా విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడు. శిరస్సుపై గంగను ధిరించినా గంగాధరుడికి అభిషేకం అంటే మహా ఇష్టం. చెంబుడు నీళ్లు పోసినా భోళాశంకరుడు కరిగిపోతాడు. అందుకే శివార్చనలో ముఖ్యమైనది అభిషేకమే. అయితే అభిషేకం కోసం వినియోగించే ద్రవ్యాల్లో ఒక్కో దానికి ఒక్కో విశిష్టత, పరమార్థం ఉంది. ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా మరి
Also Read: అష్టైశ్వర్యాలను ప్రసాదించే క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం!
ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం
- ఆవు పాలు - సర్వ సుఖాలతో వర్థిల్లుతారు
- ఆవు పెరుగు - ఆరోగ్యం, బలం
- ఆవు నెయ్యి - ఐశ్వర్యాభివృద్ధి
- చెరకు రసం (పంచదార)- దుఃఖ తొలగిపోతుంది, ఆకర్షణ పెరుగుతుంది
- తేనె - తేజస్సు వృద్ధి చెందుతుంది
- భస్మ జలం - పాపాలు నశిస్తాయి
- సుగంధోదకం - పుత్ర లాభం
- పుష్పోదకం - భూలాభం, స్థిరాస్తి కొనుగోలు చేస్తారు
- బిల్వ జలం - భోగ భాగ్యాలు కలుగుతాయి
- నువ్వుల నూనె - మృత్యు దోషం తొలగిపోతుంది
- రుద్రాక్షోదకం - ఐశ్వర్యం పెరుగుతుంది
- సువర్ణ జలం - దరిద్ర నాశనం
- అన్నాభిషేకం - సుఖ జీవనం
- ద్రాక్ష రసం - సకల కార్యాభివృద్ధి
- నారికేళ జలం - సర్వ సంపద వృద్ధి
- ఖర్జూర రసం - శత్రు నాశనం
- దూర్వోదకం (గరిక జలం)- ఆర్థిక వృద్ధి
- ధవళొదకమ్ - శివ సాన్నిధ్యం పొందుతారు
- గంగోదకం - సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
- కస్తూరీ జలం - చక్రవర్తిత్వం, రాజసం
- నేరేడు పండ్ల రసం - వైరాగ్యం
- నవరత్న జలం - గృహ ప్రాప్తి
- మామిడి పండు రసం - దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయి
- పసుపు, కుంకుమ - మంగళ ప్రదం
- విభూది - కోటి రెట్ల ఫలితం లభిస్తుంది.
"నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి
పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు
గామధేనువు వానింట గాడి పసర
మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు"
శివలింగంపై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు, మారేడు దళాలను ఆయన శిరస్సుపై వుంచే వారింట దేవతల గోవు 'కామధేనువు' నివసిస్తుంది. 'కల్పవృక్షం' అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లా ఉంటుంది. శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయిని అర్థం.
Also Read: ఈ 3 రాశులవారికి ఈ రోజు బంగారం లాంటి అవకాశాలు లభిస్తాయి, నవంబరు 23 రాశిఫలాలు
శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రమ్
నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై "న" కారాయ నమశివాయ
మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ
మందార ముఖ్య బహుపుష్ప పూజితాయ
తస్మై "మ" కారాయ నమశివాయ
శివాయ గౌరీ వదనారవింద
సూర్యాయ దక్షాధ్వర నాశనాయ
శ్రీ నీలకంఠాయ వృషభద్వజాయ
తస్మై "శి" కారాయ నమశివాయ
వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది
మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై "వ" కారాయ నమశివాయ
యక్షస్వరూపాయ జటాధరాయ
పినాకహస్తాయ సనాతనాయ
సుదివ్యదేహాయ దిగంబరాయ
తస్మై "య" కారాయ నమశివాయ
పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే
Also Read: శ్రీ మహావిష్ణువు దశావతారాలకు క్షీరాబ్ధి ద్వాదశికి ఏంటి సంబంధం, తులసి ఉసిరికి ఎందుకు పెళ్లిచేస్తారు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)