Ksheerabdi Dwadasi Pooja Vidhi 2023: అష్టైశ్వర్యాలను ప్రసాదించే క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం!
Ksheerabdi Dwadasi: ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి 4నెలలు యోగనిద్రలో ఉన్న శ్రీహరి మేల్కొని భూమి మీద దృష్టి సారించే రోజు ఉత్ధాన ఏకాదశి. ఈ తర్వాత రోజునే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు..ఆ పూజా విధానం మీకోసం....
Ksheerabdi Dwadasi Pooja Vidhi In Telugu 2023: ఉత్థాన ద్వాదశి నాడు శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజు తులసి కొమ్మను వధువుగా అలంకరిస్తారు. విష్ణు స్వరూపంగా భావించే ఉసిరి మొక్క కొమ్మను తీసుకొచ్చి తులసితో కల్యాణం జరిపిస్తారు.
యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వ దేవతా |
యథాగ్రే సర్వ వేదశ్చ తులసీ త్వం నామం మధ్యం ||
అనే శ్లోకాన్ని పఠిస్తూ తులసి కోటకు పసుపు కుంకుమలు పెట్టి తులసి మాతని భక్తిగా పూజించాలి. 365 వత్తులను తులసి కోట దగ్గర వెలిగించాలి . పరమాన్నం నివేదన చేయాలి. తులసి, ఉసిరి చెట్టు వద్ద ఎనిమిది దిక్కుల ఎనిమిది దీపాలు వెలిగించాలి. పుసుపు, కుంకుమ, అక్షతలతో పూజచేయాలి. ధూప, దీప నైవేద్యాలను సమర్పించాలి. ఈ విధంగా చేయడంవల్ల అష్టదిక్పాలకులు, నవగ్రహాలు శాంతిస్తాయని పండితులు చెబుతారు.
పూజ ప్రారంభం
ఏ పూజ ప్రారంభించినా ముందుగా పుసుపు గణపతి పూజ చేయాలి... ఆ పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Also Read: శ్రీ మహావిష్ణువు దశావతారాలకు క్షీరాబ్ధి ద్వాదశికి ఏంటి సంబంధం, తులసి ఉసిరికి ఎందుకు పెళ్లిచేస్తారు!
వినాయకుడి పూజ తర్వాత క్షీరాబ్ది ద్వాదశి పూజ ప్రారంభించాలి...
పూలు చేత్తో పట్టుకుని....
శ్లోకం
దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యాన్యథః
కరే చక్రమూర్ధ్వకరే వామం, గదా తస్యా న్యధః
కరే దధానం సర్వలోకేశం సర్వాభరణ భూషితం
క్షీరాబ్ధిశయనం దేవ ధ్యాయే న్నారాయణం ప్రభుం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః //
ధ్యాయామి ధ్యానం సమర్పయామి..(పూలు వేయండి)
ఆవాహనం
ఓం సహస్రశీర్ షా పురుషః సహస్రాక్ష స్సహస్రపాత్, స భూమిం విశ్వతోవృత్వా, అత్యతిష్ఠ ద్దశాంగులమ్. తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ( పూలు వేయాలి)
ఆసనం
అనేక హార సంయుక్తం నానామణి విరాజితం రత్న సింహాసనందేవ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః రత్నసింహాసనం సమర్పయామి. (అక్షతలు వేయాలి)
Also Read: కార్తీకమాసంలో పాటించే ఈ నియమం శారీరక, మానసిక ఔషధం!
పాద్యం
పద్మనాభ సురారాద్య పాదాంబుజ శుభప్రద పాద్యం గృహాణ భగవాన్ మయానీతం శుభావహం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః పాద్యం సమర్పయామి. (నీరు చల్లాలి)
అర్ఘ్యం
నిష్కళంక గుణారాధ్య జగత్రయ రక్షక, ఆర్ఘ్యం గృహాణమద్దత్తం శుద్దోదక వినిర్మితం తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // ఆర్ఘ్యం సమర్పయామి. (నీరు చల్లాలి)
ఆచమనీయం
సర్వారాధ్య నమస్తేస్తు సంసారార్ణవతారక గృహాణ దేవమద్దత్తంపరమాచమనీయకం . తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి. (నీరు చల్లాలి)
పంచామృతస్నానం:
స్వాపాదపద్మసంభూత గంగాశోభిత విష్ణునం పంచామృతైః స్నాపయిష్యేతంశుద్ధో దకేనాపిచ //
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః పంచామృతస్నానం సమర్పయామి.
పంచామృత స్నానానంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి. (నీరు చల్లాలి)
వస్త్రం
విద్యుద్విలాసరమ్యేణ స్వర్ణవస్త్రేణ సంయుతం, వస్త్రయుగ్మం గృహణేదం భక్తాదత్తం మయాప్రభో
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.
ఉపవీతం
నారాయణ నమస్తేస్తు నాకాధిపతిపూజిత, స్వర్ణోపవీతం మద్దత్తం స్వర్ణంచ ప్రతి గృహ్యతాం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి.
Also Read: అయ్యప్ప మండల దీక్ష తర్వాత మాలధారుల్లో రావాల్సిన మార్పులివే!
గంధం
రమాలింగన సంలిప్త రమ్య కాశ్మీర వక్షసే కస్తూరీమిళితం దాస్యే గంధం ముక్తి ప్రదాయకం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః గంధం సమర్పయామి. (గంధం చల్లవలెను.)
అక్షతలు
అక్షతానక్షతాన్ శుభ్రాన్ పక్షిరాజధ్వ జావ్యయ, గృహాణ స్వర్ణవర్ణాంశ కృపయాభక్త వత్సల తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // అక్షితాన్ సమర్పయామి. (అక్షితలు వేయాలి)
పుష్పం
చామంతికా వకుళచంపక పాటలాబ్జ పున్నాగ జాజికరవీరరసాల పుష్పై బిల్వ ప్రవాళతులసీదళ మల్లికాభిస్త్వాం పూజయామి జగదీశ్వర, వాసుదేవః పుష్పాణి పూజయామి.
అథాంగపూజా
పారిజాతాపహారకాయనమః పాదౌ పూజయామి, గుణాధరాయ నమః గుల్ఫౌ పూజయామి,
జగన్నాథాయ నమః జంఘే పూజయామి, జానకీవల్లభాయ నమః జానునీ పూజయామి,
ఉత్తాలతాల భేత్రై నమః ఊరూ పూజయామి, కమలానాథాయ నమః కటిమ్ పూజయామి,
నిరంజనాయ నమః నితంబర పూజయామి, నారయణాయ నమః నాభిమ్ పూజయామి,
వామ్నాయ నమః వళిత్రయం పూజ, కాలాత్మనేనమః గుహ్యం పూజయామి,
కుక్షిస్థాఖిలభువనాయ నమః ఉదరమ్ పూజయామి, హృషీకేశాయ నమః హృదయమ్ పూజయామి,
లక్ష్మీవక్షస్థలాయ నమః వక్షఃస్థలమ్ పూజయామి, పార్థసారథయే నమః పార్శ్వే పూజయామి,
మధురానాథాయ నమః మధ్యమ్ పూజయామి, హరయే నమః హస్తాన్ పూజయామి,
అనిరుద్ధాయనమః అంగుళీః పూజయామి, శంఖచక్ర గదాశారఙ్గథారిణే నమః బాహూన్ పూజయామి,
వరదాయనమః స్తనౌ పూజయామి,అధోక్షజాయ నమః అంసౌ పూజయామి,
కంబుకంఠాయ నమః కంఠం పూజయామి, ఓజిస్వినే నమః ఓష్ఠౌ పూజయామి,
దామోదరాయ నమః దన్తాన్ పూజయామి, పూర్ణేందునిభవక్త్రాయ నమః ముఖమ్ పూజయామి,
గరుడవాహనాయ నమః గండస్థలమ్ పూజయామి, నరనారాయణాత్మకాయ నమః నాసికమ్ పూజయామి,
నీలోత్పలదళశ్యామాయ నమః నేత్రే పూజయామి, భృగ్వాదిమునిసేవితాయై నమః భ్రువౌ పూజయామి,
భృంగరాజవిరాజిత పాదపంకజాయ నమః భ్రూమధ్యమ్ పూజయామి, కుండలినే నమః శ్రోత్రే పూజయామి,
లక్ష్మీపతయే నమః లలాటమ్ పూజయామి, శిశుపాలశిరశ్చేత్త్రే నమః శిరః పూజయామి,
సత్యభామారతాయ నమః సర్వాణ్యాంగాని పూజయామి
ఇక్కడ తులసి పూజ జరిపి తులసి అష్టోత్తర శతనామావళి - విష్ణు అష్టోత్తర శతనామావళి పఠించాలి....
Also Read: ఈ 6 రాశులవారు ఏ జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే!
ధూపం
దశాంగం గుగ్గులో పేతంచందనాగురువాసితం ధూపం గృహాణ దేవేశ దూర్జటీనుతసద్గుణా తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ధూప మాఘ్రాపయామి
దీపం
అజ్ఞాన ధ్వాంతనాశాయ అఖండ లోకశాలినే ఘృతాక్తవర్తి సంయుక్తం దీపం దద్యామి శక్తితః తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి
నైవేద్యం
పృధుకానిక్షుఖండాంశ్చ కదళీఫల కానిచ, దాపయిష్యే భవత్ప్రీత్యై గృహాణసురపూజిత (మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల చుట్టూ నీరు చిలకరించుచూ.) ఓం భూర్భువ స్సువః, ఓం త తసవితు ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతోపస్తరణ మసి, (మహా నైవేద్య పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.) (ఎడమచేతితో గంటను వాయించవలెను) ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదనాయ స్వాహా, ఓం సమనాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా.
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నైవేద్యం సమర్పయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమపి - ఉత్తరాపోశనం సమర్పయామి హస్తౌ పక్షాళయామి - పాదౌ ప్రక్షాళయామి - శుద్దాచమనీయం సమర్పయామి.
తాంబూలం
విస్తీర్ణ సుసంయుక్తం నాగవల్లీ విరాజితం కర్పూరేణసుసమ్మి శ్రం తాంబూలం స్వీకురుప్రభో
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః తాంబూలం సమర్పయామి.
నీరాజనం
ప్రదీపితంచ కర్పూర ఖండకైః జ్ఞానదాయినం గృహాణేదంమయాదత్తం నీరాజనమిదం ప్రభో తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి
మంత్రపుష్పమ్
పుష్పాంజలిం ప్రదాస్యామి భక్త్యాభక్తాశ్రయ ప్రభో అనుగ్రహంతుభద్రం మే దేహి దేవేశ్వరార్చిత! తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి.
ప్రదక్షిణ
యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం. సంసారసాగరా న్మాం త్వ ముద్ధరస్వ మహాప్రభో.
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
సాష్టాంగ నమస్కారం
తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః
సాష్టాంగనమస్కారన్ సమర్పయామి
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతమచ్యుతం ఏతత్ఫలం తులసీధాత్రీసమేత శ్రీలక్ష్మీ నారాయణార్పణమస్తు శ్రీ కృష్ణార్పణమస్తు.
శ్రీ తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి షోడశోపచార పూజ సమాప్తం