Karthika Masam 2023: ఈ 6 రాశులవారు ఏ జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే!
Zodiac Signs: మీకున్న గ్రహదోషం ఆధారంగా మీరు జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకుంటే గ్రహబాధల నుంచి విముక్తి లభిస్తుందో చెబుతారు పండితులు. అది మీ రాశిపై ఆధారపడి ఉంటుంది.
Karthika Masam 2023 Jyotirlinga Special : ఎవరి జాతకంలో అయినా గ్రహాలు అనుకూలంగా ఉంటే పర్వాలేదు కానీ ప్రతికూలంగా ఉన్నప్పుడే రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రతికూల గ్రహాలు అనుకూలంగా మారాలంటే పరమేశ్వర అనుగ్రహం ఉండాలంటారు పండితులు. గ్రహాలకు మూలం సూర్యుడు అయితే సూర్యుడికి అధిదేవత ఆ పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుడే ఒక్కో గ్రహానికి ఉండే అధిష్టాన దేతలను నియమిస్తాడు. ఈ నవగ్రహాలన్నీ పరమేశ్వరుడి ఆదేశానుసారమే సంచరిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే నవగ్రహాలు ఎక్కువగా శివాలయాల్లోనే ఉంటాయి. అయితే మీ రాశి, మీకున్న గ్రహదోషం ఆధారంగా మీరు జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకుంటే గ్రహబాధల నుంచి విముక్తి లభిస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
Also Read: కార్తీక పూర్ణిమ ఎందుకు ప్రత్యేకం - ఈ రోజు దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే
మేష రాశి నుంచి కన్యా రాశి వరకూ ఏ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిదో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.....
తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
ఈ రాశివారికి శుక్రుడు అధిపతి. పూజించాల్సిన జ్యోతిర్లింగం మహాకాళేశ్వరం. జన్మనక్షత్రం రోజు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే గ్రహదోషాలు తొలగిపోతాయి.
శ్లోకం
ఆవన్తికాయం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం
అకాల మ్రుత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం !!
Also Read: కార్తీక మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు!
వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఈ రాశివారికి కుజుడు అధిపతి. దర్శించుకోవాల్సిన జ్యోతిర్లింగం వైద్యనాథేశ్వరం.
శ్లోకం
పూర్వోత్తరె ప్రజ్వాలికానిధానే, సాదావసంతం గిరిజాసమేతం
నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాదం తమహం నమామి!!
ధనుస్సు రాశి (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఈ రాశివారికి గురుడు అధిపతి. పూజించాల్సిన జ్యోతిర్లింగం విశ్వేశ్వర లింగం. కింద శ్లోకాన్ని పారాయణం చేయడం, కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవడం ద్వారా శని, గురు గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
శ్లోకం
సానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం
వారణాసీనాథ మనాథనాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే !!
మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
ఈ రాశివారి అధిపతి శని. వీరు పూజించాల్సిన జ్యోతిర్లింగం భీమశంకరం. తెలిసీ తెలియక చేసిన పాపాలు, దోషాల నుంచి విముక్తి కలిగిస్తుంది ఈ క్షేత్ర దర్శనం.
శ్లోకం
యం ఢాకినీ శాకినికాసమాజైః నిషేమ్యమాణం పిశితశనైశ్చ
సదైవ భీమాదిపద ప్రసిద్ధం, తం శంకరం భూతహితం నమామి !!
Also Read: కార్తీకమాసంలో దీపాలు నీటిలో ఎందుకు వదులుతారు!
కుంభ రాశి (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఈ రాశికి కూడా అధిపతి శని. వీరు పూజించాల్సిన జ్యోతిర్లింగం కేదారేశ్వరం. గ్రహపీడలు, శత్రుబాధల నుంచి విముక్తి కలగాలంటే ఈ రాశివారు ఈ కేదారేశ్వరుడిని దర్శించుకోవాలి
శ్లోకం
మహాద్రి పార్శ్వేచ మునీంద్రైః సురాసురై ర్యక్ష
మహోరగాద్యైః కేదారమీశం శివమేక మీడే !!
మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ రాశికి అధిపతి గురుడు. వీరు దర్శించుకోవాల్సిన జ్యోతిర్లింగం త్ర్యంబకేశ్వరం. త్ర్యంబకేశరుడు ఎప్పుడూ నీటి మద్యలో ఉంటాడు. ఈ స్వామి దర్శనం అత్యంత శుభకరం.
శ్లోకం
సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే
యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తం త్ర్యంబక మీశ మీడే
ఓం నమ:శివాయ