అన్వేషించండి

Karthika Masam 2023: కార్తీక మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు!

Karthika Masam Non veg: పండుగలు, ప్రత్యేక రోజుల్లో మాంసాహారం తినడం నిషిద్ధం అని పండితులు చెబుతారు. కార్తీకం వస్తే మాత్రం ఏకంగా నెలరోజుల పాటూ నాన్ వెజ్ తినకూడదంటారు..ఎందుకు? తింటే ఏమవుతుంది?

Karthika Masam Food Rules : హిందూ మతవిశ్వాసాలు, ఆచారాలు, సంప్రదాయాలు, పద్దతులు పాటించేవారిలో దాదాపు సగం మందికి అవెందుకు పాటిస్తున్నామో.. వాటిని పాటించడం వల్ల లాభం ఏంటో...అనుసరించకపోతే ఏమవుతుందన్నది తెలియదు. కానీ పెద్దలు చెప్పారు ఫాలో అవుతున్నాం  అని కొందరు చెబుతారు... అలా చేయకపోతే ఏమైనా అవుతుందేమో అనే భయంతో ఇంకొందరు ఫాలో అవుతారు. భక్తి, దేవుడిపై విశ్వాసం లేనివారు ఇవేమీ పెద్దగా పట్టించుకోరు. అయితే మాంసాహారం తినడం మానేయడం అనేది కేవలం దైవభక్తి మాత్రమే అనుకుంటే పొరపాటే..దీని వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య కారణాలుకూడా ఉన్నాయి. 

Also Read: కార్తీకమాసంలో దీపాలు నీటిలో ఎందుకు వదులుతారు!

పురాణాల్లో ఏముందంటే!

ఒక జంతువుని చంపేవాడు ,చంపటానికి సిద్ధపడేవాడు, చంపమని చెప్పేవాడు, దాని మాంసం అమ్మే వాడు, కొనే వాడు, తీసుకుని వెళ్ళే వాడు, దాన్ని క్కలు చేసి వండే వాడు, దాన్నితినే వాడు...ఇలా మొత్తం 8 మందిపై హింసా దోషం తప్పకుండా ఉంటుంది. అలాగే పుణ్య కార్యాలు గానీ పాప కార్యాలు గానీ చేసేవాడు, చేయించేవాడు, దానికి ప్రేరణ చేసేవాడు, చూసి సంతోషించే వాడు వీళ్లందరూ కూడా ఆయా పనులకు తగిన పాపపుణ్యాలు సమాన ఫలితం పొందుతారు. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనలో అహింసకి చాల ముఖ్యమైన స్థానం ఉంది.  

ఇంద్రియాణం నిరోదేన రాగ ద్వేష క్షయేణ చ 
అహింసాయా చ భూతానా మమృతత్వాయ కల్పతే 

అర్థం: ఇంద్రియ నిగ్రహం వలనా, రాగద్వేషాలని వదిలెయ్యడం వలనా, సర్వ జీవాలపట్ల అహింసని అవలంబించడం వలనా అమృతత్వము అంటే మోక్షం కలుగుతుంది

యో బంధన వధక్లేశాన్ ప్రాణీనాం న చికీర్షతి 
స సర్వస్య  హితప్రేప్సు:  సుఖ మత్యంత మశ్నుతే 

అర్థం: ఎవరు ప్రాణులని చంపడానికి గానీ, బంధించడానికి గానీ, వాటిని బాధ పెట్టడానికి గానీ ఇష్టపడరో, ఎవరైతే  ప్రాణుల  హితము కోరతారో వాళ్ళు అనంతమైన సుఖాన్ని పొందుతారు 

అనుమాన్తా విశసితా నిహన్తా క్రయవిక్రయా 
సంస్కర్తా చోపహర్తాచ ఖాదకశ్చేతి ఘాతకాః 

అర్థం: మాంసం తిన్నవాడు, పెట్టిన వాడు, వండిన వాడు, అమ్మిన వాడు, ప్రాణికి చంపిన వాడు, అవయవములు విడదీసిన వాడు, దానికి అనుమతించిన వాడు అందరూ ఆ జీవిని చంపిన వాళ్ళే అవుతారు. 

యో ఆ హింసకాని భూతాని హినస్త్యా త్మ సుఖేచ్ఛయా 
సజీవంశ్చ మృత శ్చైవ న క్వచి త్సుఖమేధతే 

అర్థం: హింస కలిగించని ప్రాణులని అవి జంతువులైనా కావచ్చు మనుషులైనా కావొచ్చు.. తమ సుఖం కోసం ఎవరైతే హింసిస్తారో వాళ్ళు బ్రతికున్నా కూడా చనిపోయిన వాళ్ళ కిందే లెక్క. అలాంటి వాళ్లకి  ఇహ పరములు రెండిట్లోనూ సుఖం ఉండదు. అయితే తప్పని సరి పరిస్థితులలో కేవలం ఆత్మ రక్షణ కోసం ఆయుధం ఉపయోగించడం తప్పు కాదు

Also Read: కార్తీక పూర్ణిమ ఎందుకు ప్రత్యేకం - ఈ రోజు దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే

అహింసయేంద్రియా సంగై  ర్వైదికైశ్చైవ కర్మభిః 
తప్సశ్చరణై శ్చోగ్రై: సాధయనన్తీ హ తత్పదమ్ 

అర్థం: సర్వ ధర్మాల్లో సత్యం అహింసలదే అగ్రస్థానం ఇస్తారు. అయితే హింస లేకుండా మనం బ్రతకగలమా  ? అన్న ప్రశ్న వస్తుంది.  ఎందుకంటే మనం నడిచేటప్పుడు ఎన్నో రిమి కీటకాలు మన కాళ్ళ కింద పడి చనిపోతున్నాయి కదా ? అలాగే ఆకు కూరల్లోనూ ప్రాణము లేదా ?  ఈ హింస చేస్తున్నప్పుడు ఆ హింస ఎందుకు చెయ్యకూడదు అని కొందరి వాదన. వీటికి సమాధానం మనువు చెప్పాడు... ప్రాణులకి హాని తలపెట్టడం అన్నది ఎంత తక్కువ అయితే అంత ఉత్తమం.. అసలు వాటికి హాని తలపెట్టకపోవడం  సర్వోత్తమం

ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

వానాకాలం ముగిసి చలికాలం ప్రారంభమయ్యే సమయంలో రకరకాల ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయి. కేవలం మనుషుల శరీరంలో మాత్రమే కాదు జంతువుల శరీరంలోనూ ఈ మార్పులుంటాయి. ఆ జంతువులను చంపి తినడం వల్ల అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే. పైగా వాతావరణం మందంగా ఉండడం వల్ల తేలికపాటి ఆహారం తింటేనే జీర్ణం అవుతుంది...నాన్ వెజ్ తింటే సరిగా జీర్ణం కాక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. పైగా నాన్ వెజ్ వంటకాల్లో ఎక్కువగా వినియోగించే  ఉల్లి, వెల్లుల్లి కోర్కెలు పెంచుతాయి. అందుకే శాఖాహారులు కూడా ఈ కార్తీకమాసం నెలరోజులూ ఉల్లి, వెల్లుల్లి వినియోగించరు. ఎందుకంటే మనం తినే ఆహారమే మన గుణాన్ని ( సత్వగుణం, తమోగుమం, రజోగుణం) నిర్ణయిస్తుంది. అందుకే ఆహారాన్ని కూడా ఈ మూడు రకాలుగా చెబుతారు.

Also Read: కార్తీక సోమవారం వ్రతవిధి 6 రకాలు, మీరు అనుసరించేది ఏది!

సాత్విక ఆహారం
సాత్విక ఆహారం అంటే స్వచ్ఛమైన శాఖాహార ఆహారం. ఇందులో కాలానుగుణ తాజా పండ్లు, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, మొలకలు, విత్తనాలు, తేనె, తాజా మూలికలు ఉంటాయి. ఇది మనస్సును, శరీరాన్ని స్వచ్ఛంగా సమతుల్యంగా ఉంచుతుంది. సాత్విక ఆహారాన్ని తీసుకునేవారు ప్రేమ, కృతజ్ఞత, అవగాహనతో ఉంటారు. వారిలో ప్రశాంతత కనిపిస్తుంది. ఎప్పుడూ ఉత్సాహంగా  ఉంటాడు. 

రజో గుణం కలిగించే ఆహారం
రజోగుణం కలిగించే ఆహారంలో మసాలా దినుసులు, ఉల్లి, వెల్లుల్లి, ఇతర సుగంధ ద్రవ్యాలు , డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, కాఫీ, టీ, రిఫైన్డ్ ఫుడ్ ఐటమ్స్, షుగర్ ఫుడ్స్, చాక్లెట్లు ఉంటాయి. ఇలాంటి ఆహారాలను తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది కానీ శరీర సమతుల్యత గాడి తప్పుతుంది, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. వీటిని తినడానికి ఎంత ఆతృత ఉంటుందో... అంతే వేగంగా కోపం, అసహనం, ఆందోళన కలుగుతాయి..

Also Read: కార్తీకస్నానం ఆంతర్యం భక్తి మాత్రమే అనుకుంటున్నారా!

తమో గుణాన్ని కలిగించే ఆహారం
ఇందులో ప్రధానంగా మళ్లీ వేడిచేసిన ఆహారాలు, రసాయనికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, గుడ్లు, మాంసం, ఆల్కహాల్, సిగరెట్లు  ఉంటాయి. ఈ ఆహారాన్ని భుజించేవారు బద్దకంగా, నిస్తేజంగా, జీవితం పట్ల నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా వ్యవహరిస్తారు. మనసుకి, శరీరానికి హాని కలిగించే ఈ ఆహారం తీసుకోవడం వల్ల దయగల ఆలోచనలు రానే రావని చెబుతారు. 

మాంసాహార భోజనంలో కొవ్వు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. చల్లటి వాతావరణంలో ఇవి మీ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. శారీరక అవసరాలను, కోర్కెలను పెంచుతాయి. అంతర్గత ప్ర‌శాంతత‌కు భంగం కలిగిస్తాయి. మతపరమైన ఆచారాల్లో అంతర్గత ప్ర‌శాంత‌త‌కు, ఏకాగ్రతకు ప్రాముఖ్యతనిచ్చారు. దీనికి భంగం కలిగించే మాంసాహారం, ఉల్లి , వెల్లుల్లి వంటి మసాలాదినుసులకు దూరంగా ఉండం..ఆధ్యాత్మికపరంగా, ఆరోగ్యపరంగా కూడా మంచిదని సూచిస్తున్నారు పండితులు, ఆరోగ్య నిపుణులు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MI vs CSK Highlights: సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
CM Revanth Reddy: త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Retired Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PBKS vs RCB Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం | ABP DesamMI vs CSK Match Preview IPL 2025 | నేడు వాంఖడేలో ముంబైని ఢీకొడుతున్న చెన్నై | ABP DesamPBKS vs RCB Match preview IPL 2025 | బెంగుళూరులో ఓటమికి పంజాబ్ లో ప్రతీకారం తీర్చుకుంటుందా | ABP DesamAvesh Khan Game Changer vs RR | IPL 2025 లో లక్నోకు గేమ్ ఛేంజర్ గా మారిన ఆవేశ్ ఖాన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MI vs CSK Highlights: సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
CM Revanth Reddy: త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Retired Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
Ayush Mhatre Record: నిన్న వైభవ్,  నేడు ఆయుష్ మాత్రే.. ఐపీఎల్‌లో మరో యువ సంచలనం అరంగేట్రం
నిన్న వైభవ్, నేడు ఆయుష్ మాత్రే.. ఐపీఎల్‌లో మరో యువ సంచలనం అరంగేట్రం
Odela 3: 'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
PBKS vs RCB: విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
Embed widget