Karthika Masam 2023: కార్తీకస్నానం ఆంతర్యం భక్తి మాత్రమే అనుకుంటున్నారా!
Karthika Snanam 2023: కార్తీకమాసంలో నెలరోజులూ సూర్యోదయానికి ముందే స్నానమాచరిస్తారు. అయితే రెగ్యులర్ గా చేసే స్నానానికి, కార్తీకమాసంలో ఆచరించే స్నానానికి ప్రత్యేకత వేరు...
Health Benefits Karthika Snanam 2023: ఏడాది మొత్తంలో పండుగలు, పూజలు ఎన్నో చేస్తుంటారు. వినాయక చవితి, శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు, సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటాం. కానీ కార్తీకమాసం నెలరోజులూ ప్రత్యేకమే. మరీ ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఈ నెల రోజులూ ఆచరించే ప్రతి నియమం వెనుకా ఉన్నది భక్తి మాత్రమే అనుకుంటే పొరపాటే...అద్భుతమైన ఆరోగ్య రహస్యాలున్నాయి. ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుడు ఉదయించకముందే, నక్షత్రాలు ఇంకా అక్కడక్కడా మిణుకు మిణుకు మంటుండగానే కార్తీకమాసంలో నదీస్నానం ఆచరించాలని చెబుతారు. ఏడాదంతా ఇలా ఆచరించేవారూ ఉన్నారు..అయితే కార్తీకమాసంలో ఈ సమయానికి చేసే స్నానానికి ఉన్న ప్రత్యేకత వేరని చెబుతారు..
Also Read: పాములు, నాగులు, సర్పాలు - మీరు వేటిని పూజిస్తున్నారు!
ఆరోగ్య రక్షణ కోసం నెలరోజుల నియమం
సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యునికి ఇది నీచ స్థానం. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది. చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది. శరీరంలో నొప్పులు ఎక్కువవుతాయి. నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి ముడుచుకుని పడుకోవటం వల్ల ఇంకా పెరుగుతాయి. వీటన్నింటి నుంచి ఉపశమనమే కార్తీకస్నానం. ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెలరోజులూ ఈ నియమం పెట్టారు.
మానసిక ఉల్లాసం
సూర్యోదయానికి ముందే నిద్రలేవడం స్నానమాచరించడం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు. సూర్యోదయానికి ముందే స్నానం, దైవపూజ చేయడంతో బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉంటారు
చక్కని వ్యాయాయమే
ఇప్పుడంటే ఇళల్లో షవర్ల కింద స్నానాలు చేస్తున్నారు లేదంటే వాహనాల్లో నదీతీరాలకు చేరుకుంటున్నారు కానీ అప్పట్లో నదీ స్నానం చేయాలనే ఆలోచనతో నదివరకూ నడిచి వెళ్లేవారు. అంటే తెల్లవారుజామున ఇది కూడా వ్యాయామమే. పైగా నదుల్లో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా నదీ పరీవాహక ప్రదేశాల్లో ఉండే ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి. ఇలాంటి నీటిలో స్నానం చేయడం ఆరోగ్యప్రదం.
Also Read: మనిషిలో విషసర్పం శేతత్వం పొందేందుకే నాగుల ఆరాధన, పుట్టలో పాలు పోసే టైమ్ ఇదే!
నిర్మలమైన నీరు
నవంబరు నాటికి వర్షాలు తగ్గిపోతాయి. నదుల ఉధృతి తగ్గి వాటిలోని మలినాలన్నీ అడుగుకి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది. స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీకమాసమే అనువైనసమయం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం
జ్యోతిషశాస్త్రం ప్రకారం నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తిమంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీకమాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు. చంద్ర కిరణాలతో ఔషధలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు.
Also Read: కార్తీక సోమవారం వ్రతవిధి 6 రకాలు, మీరు అనుసరించేది ఏది!
భక్తి కాదు ఆరోగ్యం
శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటకు పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం. మన శరీరం ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాం. ఈ ప్రక్రియను "Electro Magnetic Activity” అంటారు.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే అప్పట్లో ఆధ్యాత్మికం, దేవుడు పేరు చెప్పి నెలరోజులూ బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేయమనేవారు. ఈ నెలరోజులు చల్లటి నీటిలో స్నానమాచరించినా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదంటే మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టే..