చాణక్య నీతి: ఈ 3 కోల్పోతే తిరిగి తెచ్చుకోలేం



డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతోంది అనుకుంటారు. డబ్బుంటే ఏదైనా సాధ్యమే అనుకుంటారు



కానీ మూడు విషయాలు డబ్బు కన్నా చాలా విలువైనవని చెప్పాడు చాణక్యుడు. ఇవి కోల్పేతే మళ్లీ తిరిగి తెచ్చుకోలేం అన్నాడు.



1.మతం
డబ్బు కన్నా మతం పెద్దది. ఏదైనా పొందాలనే ముసుగులో, ఆర్థిక లాభాలను ఆశించో మతాన్ని వదులుకోకూడదు.



తప్పొప్పులు గుర్తించి మనిషిని సరైన మార్గంలో నడిపించేదే మతం. మతం ముసుగులో వచ్చే డబ్బుని ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోరాదు.



2. సంబంధాలు
నిజమైన సంబంధాలు కలిగి ఉండడం, వాటిని గుర్తించడం చాలా గొప్ప విషయం, అత్యంత కష్టం కూడా. ఇలాంటి వారి ముందు డబ్బుకి విలువ తక్కువే



ప్రపంచంలో అన్ని ఆనందాలను డబ్బుతో కొనుగోలు చేయొచ్చుకానీ ఒకరి ప్రేమను మాత్రం కొనలేరు.



కష్టం, సుఖంలో అండగా నిలిచే స్నేహితుడు, శ్రేయోభిలాషి లేదా బంధువు కోసం ఎంత డబ్బు వదిలేసుకున్నా తక్కువే అంటాడు చాణక్యుడు



3. ఆత్మ గౌరవం
ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఆత్మగౌరవం కన్నా గొప్పది ఏమీ ఉండదు..ఉండకూడదు. ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు డబ్బు త్యాగం చేయాల్సి వస్తే అస్సలు ఆలోచించకూడదు



మతం, మానవ సంబంధాలు, ఆత్మగౌరవం.. ఈ మూడు మనీ కన్నా పవర్ ఫుల్ అని చెప్పాడు ఆచార్య చాణక్యుడు



Images Credit: Pinterest