న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్, న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్
కార్తీక మాసానికి సమానమైన మాసం, కృత యుగానికి సమానమైన యుగం, వేదానికి సమానమైన శాస్త్రం, గంగకు సమానమైన తీర్థం లేదు..
కార్తీకమాసం నెలరోజులూ ప్రత్యేకమే అయినా సోమవారాలు మరింత విశేషమైనవి.
నెలరోజులు నియమాలు పాటించినా లేకున్నా కార్తీక సోమవారాల్లో కొన్ని ప్రత్యేక విధులు ఆచరిస్తారు
కార్తీక మాసం శివుడికి, మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది.
కార్తీక సోమవారం, జ్వాలాతోరణం మహాశివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే బలి పాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి.
కార్తీక పురాణం లో కూడా మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తాయి.
ఈ ఏడాది నవంబరు 14మంగళవారం నుంచి కార్తీకమాసం ప్రారంభమైంది. Image Credit: Pinterest