రాత్రి నిద్రలో వచ్చిన కలను తెల్లారగానే షేర్ చేసేసుకుంటారు
ఏమని కలవచ్చిందో తెలుసా అంటూ వివరంగా చెబుతుంటారు కొందరు. అయితే కొన్ని కలలు మాత్రం ఎవ్వరికీ చెప్పకూడదట
మనం చనిపోయినట్టు మనకే కలరావడం, చనిపోయిన తర్వాత కూడా మనచుట్టూ ఏం జరుగుతుందో తెలిసిపోతుంటుంది. ఈ కల రాగానే చాలామంది భయపడుతుంటారు కానీ అది శుభసూచకమే
ఇలాంటి కల మీ ఇంటికి వచ్చే సంతోషాన్ని సూచిస్తుందని...ఇది ఎవరితోనైనా షేర్ చేసుకుంటే ఆ ఆనందం అందుకోలేరని చెబుతారు.
తల్లిదండ్రులకు సేవలు చేసినట్టు వచ్చే కల మీ జీవితంలో పురోగతిని సూచిస్తుందని చెబుతారు. ఈ కలను కూడా ఎవరితోనూ పంచుకోవద్దని..అలా పంచుకుంటే ప్రయోజం పొందలేరని అంటారు
వెండితో నిండిన కలశం కలలో కనిపిస్తే శుభప్రదంగా భావిస్తారు. ఈ కల లక్ష్మీఅనుగ్రహాన్ని సూచిస్తుంది.స్వప్న శాస్త్రం ప్రకారం, ఈ కలను ఎవరికైనా చెబితే లక్ష్మీ కటాక్షం కలగదు అంటారు
ఎప్పుడోఓసారి దేవుడు తప్పకుండా కలలో కనిపిస్తాడు. ఇలాంటి కలవస్తే కెరీర్ పరంగా మీకు మంచి జరగబోతోందని అర్థం. ఈ కల కూడా ఎవ్వరికీ చెప్పకూడదంటారు
కలలో పండ్ల తోట కనిపించడం కూడా చాలా శుభసూచకం. సాధారణంగా గర్భిణిలకు కలలో పండ్ల తోట కనిపిస్తే అబ్బాయి, పూలతోట కనిపిస్తే అమ్మాయి పుడతారని చెప్పేందుకు సంకేతం అని అంటారు.