Karthika Masam 2023 : మీ రాశిప్రకారం కార్తీకమాసంలో మీరు దర్శించుకోవాల్సిన క్షేత్రం ఇదే!
Jyotirlinga: మీకున్న గ్రహదోషం ఆధారంగా మీరు జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకుంటే గ్రహబాధల నుంచి విముక్తి లభిస్తుందో చెబుతారు పండితులు. అది మీ రాశిపై ఆధారపడి ఉంటుంది.
Karthika Masam 2023 Jyotirlinga Special : ఎవరి జాతకంలో అయినా గ్రహాలు అనుకూలంగా ఉంటే పర్వాలేదు కానీ ప్రతికూలంగా ఉన్నప్పుడే రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రతికూల గ్రహాలు అనుకూలంగా మారాలంటే పరమేశ్వర అనుగ్రహం ఉండాలంటారు పండితులు. గ్రహాలకు మూలం సూర్యుడు అయితే సూర్యుడికి అధిదేవత ఆ పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుడే ఒక్కో గ్రహానికి ఉండే అధిష్టాన దేతలను నియమిస్తాడు. ఈ నవగ్రహాలన్నీ పరమేశ్వరుడి ఆదేశానుసారమే సంచరిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే నవగ్రహాలు ఎక్కువగా శివాలయాల్లోనే ఉంటాయి. అయితే మీ రాశి, మీకున్న గ్రహదోషం ఆధారంగా మీరు జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకుంటే గ్రహబాధల నుంచి విముక్తి లభిస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
Also Read: ఈ రాశులవారికి డబ్బు సమస్య తీరిపోతుంది, నవంబరు 21 రాశిఫలాలు
మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఈ రాశి వారు పూజించాల్సిన జ్యోతిర్లింగం రామేశ్వరం. మేషరాశి కుజుడికి స్వగృహం. వీరికి పదకొండో రాశ్యాధిపతి శని. అందుకే గ్రహపీడా నివారణార్థం శ్రీ రామచంద్రుడు పూజించిన రామేశ్వరంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే మంచిది.
శ్లోకం
సుత్రామ పర్ణీ జరరాషి యోగే నిబధ్య సెతుం విశిఖైర సంఖ్యె
శ్రీరామ చంద్రేన సమర్పితం త రామేశ్వరాఖ్యం నియతం నమామి!!
వృషభ రాశి (Taurus Horoscope in Telugu) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఈ రాశివారు పూజించాల్సిన లింగం సోమనాథ జ్యోతిర్లింగం. ఈ రాశి శుక్రుడికి స్వగృహం. చంద్రుడు ఉచ్ఛరాశి. అందుకే శ్రీకృష్ణుడు పూజించిన సోమనాథ జ్యోతిర్లింగం దర్శించుకోవాలి. ఈ రాశివారు జన్మ నక్షత్రంలో సోమనాథుడి సన్నిధిలో రుద్రాభిషేకం చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు పొందుతారు.
శ్లోకం
సౌరాష్ట్ర దేశే విదేశేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావసంతం
భక్తి ప్రాదానాయ క్రుపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే !!
Also Read: లింగరూపంలో కొలువైన పరమేశ్వరుడి ఆరాధన వెనుకున్న ఆంతర్యం ఇదే!
మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఈ రాశివారు దర్శించుకోవాల్సిన జ్యోతిర్లింగం నాగేశ్వర లింగం’. ఈ రాశి బుధుడికి స్వగృహం. గ్రహదోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శనం శుభప్రదం. శని సంచార కాలంలో నాగేశ్వర లింగాన్ని దర్శించుకుంటే గ్రహ బాధల నుంచి విముక్తి లభిస్తుంది.
శ్లోకం
సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భోగై
సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే !!
కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఈ రాశివారికి పూజించాల్సిన శివలింగం ఓంకారేశ్వరం.ఈ రాశి చంద్రుడికి స్వగృహం. జన్మనక్షత్రం ఉన్న రోజు ఓంకార బీజాక్షరం జపించడం శుభకరం.
శ్లోకం
కావేరికా నర్మదాయో పవిత్రే, సమాగమే సజ్జన తారణాయ
సడైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే !!
Also Read: కార్తీకమాసంలో ఇందులో ఒక్క క్షేత్రం దర్శించుకున్నా చాలు!
సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఈ రాశి సూర్యుడికి స్వగృహం. వీరు పూజించాల్సిన జ్యోతిర్లింగం శ్రీ ఘృష్ణేశ్వరం. కింద పేర్కొన్న శ్లోకాన్ని నిత్యం పఠించడం వల్ల సకల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
శ్లోకం
ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసాంతం చ జగద్వ రేణ్యం
వందే మహాదారాతర స్వభావం, ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే !!
Also Read: కలిపురుషుడికి - కార్తీక వనభోజనాలకి - ఉసిరిచెట్టుకి లింకేంటి!
కన్యా రాశి (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
ఈ రాశివారికి అధిపతి బుధుడు. వీరు దర్శించుకోవాల్సిన జ్యోతిర్లింగం శ్రీశైలం. అన్ని బాధల నుంచి విముక్తి పొందేందుకు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలి.
శ్లోకం
శ్రీశైల శృంగే విభుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం
తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుం!!