Karthika Vanabhojanam 2023: కలిపురుషుడికి - కార్తీక వనభోజనాలకి - ఉసిరిచెట్టుకి లింకేంటి!
Karthika Masam 2023 : కార్తీకమాసం అనగానే ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలు నెలరోజులూ పండుగ వాతావరణమే. వీకెండ్ వస్తే ఆ సందడే వేరు. ఇంతకీ వనభోజనాలు కార్తీకమాసంలోనే ఎందుకు చేస్తారు. ఉసిరి

Vanabhojanam: కార్తీకమాసం రాగానే పిక్నిక్ ల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా వీకెండ్ వస్తే చాలు ఎక్కడ చూసినా సమారాధనల హడావుడే. ఇప్పుడంటే పార్కుల్లో సమారాధానలు ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ అప్పట్లో పెద్ద పెద్ద వనాల్లో సమారాధనలు జరిగేవి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా వనభోజనాలు ఉసిరి చెట్టు కింద చేయాలి చెబుతారు..దానివెనుక ఆంతర్యం ఏంటంటే..
అసాక్షి భోజన దోషాన్ని తొలగించుకునేందుకే
క్షమాగుణానికి ప్రతీకగా ధాత్రిచెట్టు ( ఉసిరిచెట్టు) ను చెబుతారు. ఉసిరిచెట్టు లక్ష్మీ స్వరూపం. శ్రీ మహాలక్ష్మి ఎక్కడుందో శ్రీ మహావిష్ణువు కూడా అక్కడే ఉంటాడు. అందుకే ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేస్తారు. ఎందుకంటే సాధారణ రోజుల్లో అసాక్షి భోజనాలు చేస్తుంటాం. అంటే ... సమయం దాటాక తింటా, అతిథికి -బ్రహ్మచారికి పెట్టాకుండా తింటాం, ఒక్కోసారి బయటనుంచి తీసుకొచ్చి తింటాం, ఇంకోసారి నైవేద్యం లేకుండా తింటాం. ఇలా మొత్తం 9 రకాల భోజనాలు ఉన్నాయి. వాటిలో కేవలం రెండే రెండు ఆమోదయోగ్యం. ఒకటి ఇంట్లో వండుకుని తినేది, మరొకటి ఆలయాల్లో సంతర్పణ సమయంలో తినేది. ఇవి కాకుండా మనం నిత్యం తింటున్న ఆహారం మొత్తం అసాక్షి భోజనమే. పైగా నడుస్తూ తినడం, మాట్లాడుతూ తినడం, మంచంపై కూర్చుని తినడంతో ఆ ఆహారంతో పాటూ శరీరంలోకి కలిపురుషుడు ప్రవేశిస్తాడు. శ్రీమహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే ఉసిరిచెట్టుకింద భోజనం చేయడం వల్ల అదంతా స్వామివారి అమ్మవార్ల ప్రసాదం మాత్రమే కాదు..అసాక్షి భోజనం ద్వారా మన శరీరంలో ప్రవేశించిన కలిపురుషుడిని తరిమేస్తుందని చెబుతారు. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చెబుతారు. అందుకే ఇలాంటప్పుడు సహపంక్తి భోజనాలు చేస్తారు. పరబ్రహ్మ స్వరూపం అయిన అన్నం ముందు అందరూ సమానమే అని చెప్పడమే వనభోజనాల ముఖ్య ఉద్దేశం.
Also Read: ఈ రాశివారు రిస్క్ తీసుకోవడానికి వెనకడుగు వేయొద్దు, నవంబరు 19 రాశిఫలాలు
ఆధ్యాత్మికత
కార్తీక మాసంలో వన భోజనాల వల్ల ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం , ఆరోగ్యం అనే సందేశం కూడా ఉంది. కార్తీక పౌర్ణమి రోజు నైమిశారణ్యంలో మునులంతా సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు కార్తీకపురాణంలో ఉంది. అప్పట్లో మహర్షులు ఆచరించిన వనభోజనాల సంప్రదాయం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. పైగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కుతుందని చెబుతారు.
Also Read: కార్తీక మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు!
ఆరోగ్యం
భారతీయ ఆయుర్వేదంలో వృక్షాలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. అందుకే మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహా విష్ణువును పూజించి , ఆ చెట్టుకింద వండిన ఆహారాన్ని ఆ చెట్టు కిందే ఆరగిస్తే కార్తీక మాసంలో గొప్ప పుణ్యఫలం దక్కుతుందని, అనారోగ్య తొలగిపోతుందని కార్తీక పురాణం చెబుతోంది.ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలులు , ముఖ్యంగా ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద వైద్యలు చెబుతారు. ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షం , ఆమలక వృక్షం అంటారు. అందుకే ఈ వనభోజనానికి ధాత్రి భోజనం అని పేరు కూడా ఉంది.
Also Read: కార్తీకమాసంలో దీపాలు నీటిలో ఎందుకు వదులుతారు!
ఆనందం
పచ్చని చెట్లు , ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు , బంధు మిత్రుల సపరివారంగా విందు భోజనాలు చేయడం మానసిక ఉల్లాసాన్నిస్తుంది. కేవలం భోజనాలకే పరిమితం కాకుండా ఆట , పాట కబుర్లకు చక్కటి వేదిక వనసమారాధన. పిల్లలు , పెద్దలలో ఉన్న సృజనాత్మకతను తట్టిలేపే క్రీడలు , నృత్యాలు , సంగీత కచేరీలు నిర్వహించడానికి మంచి అవకాశం.
Also Read: కార్తీక పూర్ణిమ ఎందుకు ప్రత్యేకం - ఈ రోజు దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే
నిత్య వనభోజనాలు చేసిన శ్రీ కృష్ణుడు
ఎవరూ మరచిపోలేనంత గొప్ప వన భోజనం చేసిన దేవుడెవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు- బలరాముడు. నిత్యం స్నేహితులతో వనభోజనానికి వెళ్లేవారు. వాళ్ళు రోజూ వెళ్ళేది ఆ వనానికే...ప్రతి రోజూ మధ్యాహ్నం ఆహారం తినేది కూడా అక్కడే. అయినా కానీ కృష్ణుడు ప్రత్యేకంగా స్నేహితులతో చెప్పేవాడట ...రేపు వనభోజనానికి వెళదాం అని. అంటే ఆ ప్రత్యేకత, విశిష్టత ఏంటో వాళ్లకి తెలియచేయడం కోసమే ఇదంతా.
వనభోజనాల మధుర స్మృతులు జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలి...వృక్షాల వల్ల ఎన్ని ఉపయోగాలో భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ఉండాలి..కార్తీక వనసమారాధనల ముఖ్య ఉద్దేశం ఇదే..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

