Today Horoscope: ఈ రాశివారు రిస్క్ తీసుకోవడానికి వెనకడుగు వేయొద్దు, నవంబరు 19 రాశిఫలాలు
Astrology :మేష రాశి నుంచి మీన రాశివరకూ నవంబరు 19 దిన ఫలాలు
Horoscope Today 19 november 2023
మేష రాశి (Aries Horoscope in Telugu)
కొన్ని సమస్యలపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. మీ ఆలోచనా విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కొన్ని ఆసక్తికర వార్తలు వింటారు. ఆస్తి కొనుగోలు ఆలోచన ఉంటే కొన్నిరోజులు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.
వృషభ రాశి (Taurus Horoscope in Telugu)
శారీరక , మానసిక బలంకోసం ధ్యానం చేయాలి. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు..ఆదాచేయాలి అనుకున్నా కష్టమే. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేసేందుకు ఇదే మంచి సమయం. ఉద్యోగం, వ్యాపారంలో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు ఇదే మంచి టైమ్ అని గుర్తుంచుకోండి.
మిథున రాశి (Gemini Horoscope in Telugu)
మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది...దీర్ఘకాలంలో ఇది మీ బంధానికి అంత మంచిది కాదు. ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా బంధం పటిష్టం అవుతుందని గుర్తించండి. ఉద్యోగం, వ్యాపారంలో కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.
Also Read: భారత్ - ఆస్ట్రేలియా ఈ సారి వరల్డ్ కప్ ఎవరిది, ప్రముఖ జ్యోతిష్యులంతా ఏం చెబుతున్నారు!
కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu)
ఈ రోజు మీరు కెరీర్ సంబంధిత విషయాలలో గుడ్ న్యూస్ వింటారు. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. కొన్ని విషయాలపై సానుకూలంగా వ్యవహరించండి. మిమ్మల్ని మీరు నమ్మితే విజయం సాధిస్తారు. సహనంగా వ్యవహరిస్తే ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేస్తారు.
సింహ రాశి ( Leo Horoscope in Telugu)
ఈ రోజు కుటుంబంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా మీరు చేసిన తప్పులు అంగీకరించడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు చెప్పాలి అనుకున్న విషయం స్పష్టంగా చెప్పడం మంచిది. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది.
కన్యా రాశి (Virgo Horoscope in Telugu)
ఈ రాశివారు పనిని మెరుగుపర్చుకోవడంలో సహోద్యోగుల నుంచి మద్దతు తీసుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యలను వృత్తికి లింక్ చేయడం అంత మంచిది కాదు. మీ చుట్టూ ఉండేవారిలో మిమ్మల్ని మోసం చేసేవారున్నారు జాగ్రత్త. డబ్బుకు సంబంధించిన విషయాలపై శ్రద్ధ అవసరం. ముఖ్యమైన నిర్ణయం తీసుకునేందుకు ఆలోచించాలి. అవసరమైన విశ్రాంతి తీసుకోవడం మీకు చాలా అవసరం.
Also Read: ప్రేమను వ్యక్తం చేయడంలో మీ రాశి ర్యాంక్ ఎంతో తెలుసా!
తులా రాశి (Libra Horoscope in Telugu)
ఈ రోగ్య కరమైన అలవాట్లు అలవర్చుకోవాలి. పనిలో ఒత్తిడి తగ్గించుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. అదృష్టం కలిసొస్తుందకి. ఆత్మవిశ్వాసం తగ్గనీయవద్దు. మీ లక్ష్యం విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తే విజయం తథ్యం. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలి. మీ కలను నిజం చేసుకునే ప్రయత్నం చేయండి.
వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu)
ఓ ప్రత్యేక వ్యక్తి ఈ రోజు మీ జీవితంలో ఉత్సాహాన్ని నింపుతారు. మీ భాగస్వామితో మంచి సమయం స్పెండ్ చేస్తారు. మీ వృత్తిపరమైన జీవితానికి సంబంధించి పెద్ద మార్పులు జరగబోతున్నాయి. మీరు చేసిన కృషి మరియు అంకితభావం ఫలిస్తుంది. ఆర్థిక నష్టాలకు దూరంగా ఉండాలి.
ధనుస్సు రాశి (Sagittarius Horoscope in Telugu)
ఈ రాశివారు కష్టపడి పనిచేస్తేనే ఫలితం ఉంటుంది. కొత్త అవార్డులు, రివార్డులు అందుకుంటారు.డబ్బు పొదుపు చేయడం ప్రారంభించాలి. ఊహించని ఖర్చులుంటాయి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఉద్యోగులు సహోద్యోగుల నుంచి సహకారం తీసుకోవాలి. ప్రతికూల ఆలోచనలు రానివ్వవద్దు. కోపం తగ్గించుకుని ఆలోచిస్తే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
మకర రాశి (Capricorn Horoscope in Telugu)
ఈ రోజు ఆర్థిక విషయాల్లో తొందరపాటు వద్దు. ఎవ్వరి దగ్గరా డబ్బులు తీసుకోవద్దు..ఇవ్వొద్దు. మీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. ఓ గుడ్ న్యూస్ వింటారు. అతి ఉత్సాహం దేనికీ పనికిరాదు. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి మీ మాట వినడానికి బదులు తన మనసులోని మాటను చెప్పడానికి ఇష్టపడతారు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఉద్యోగస్తులు ఈరోజు కార్యాలయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
Also Read: ఈ 5 రాశులవారికి పెళ్లి కన్నా డేటింగే ఇష్టం!
కుంభ రాశి (Aquarius Horoscope in Telugu)
సానుకూల ఆలోచనలతో ఉంటారు. అర్థవంతమైన సంభాషణలో పాల్గొంటారు. మీ మనసు తెలియజేసేందుకు కొత్త బంధాలు ఏర్పరుచుకునేందుకు ఇదే మంచి సమయం. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోడానికి సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఈ రోజు వచ్చే అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ భవిష్యత్ కి కొత్త మార్గాలు ఏర్పడతాయి.
మీన రాశి (Pisces Horoscope in Telugu)
ప్రొఫెషనల్‌గా ఉండండి. మిమ్మల్ని మీరు విశ్వసించండి, రిస్క్ తీసుకోవడానికి భయపడొద్దు..ఎందుకంటే..ఈ సమయం మీకు మంచి సక్సెస్ ను ఇస్తుంది. ఆర్థిక ప్రణాళికలు సరిగ్గా వేసుకోకుంటే రానున్న రోజుల్లో నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ ఆలోచనల్లో ఏకాగ్రత అవసరం.