Horoscope Today 21st November 2023: ఈ రాశులవారికి డబ్బు సమస్య తీరిపోతుంది, నవంబరు 21 రాశిఫలాలు
Today Rasi Phalalu: మేష రాశి నుంచి మీన రాశివరకూ నవంబరు 21 రాశిఫలాలు
![Horoscope Today 21st November 2023: ఈ రాశులవారికి డబ్బు సమస్య తీరిపోతుంది, నవంబరు 21 రాశిఫలాలు horoscope today 21 November 2023daily astrological prediction Aries gemini and other zodiac signs in telugu Horoscope Today 21st November 2023: ఈ రాశులవారికి డబ్బు సమస్య తీరిపోతుంది, నవంబరు 21 రాశిఫలాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/20/11733e4dcf8a291051ca07222c7861c51700498530206217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Horoscope Today 21st November 2023
మేష రాశి (Aries Horoscope in Telugu)
మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆదాయం పెరుగుతుంది, సహనం తగ్గుతుంది. విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు తప్పవు. మేధోపరమైన పనిలో బిజీగా ఉంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. స్నేహితుల నుంచి సహకారం పొందుతారు.
వృషభ రాశి (Taurus Horoscope in Telugu)
సృజనాత్మక సామర్థ్యం , నాయకత్వ లక్షణాల కారణంగా మీరు చేపట్టిన పనిలో సక్సెస్ అవుతారు. ఆర్థికంగా బలపడతారు. ఆస్తిపై పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచిసమయం. కార్యాలయంలో సహోద్యోగులు , సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. సంతాన లేని దంపతులు ఈ వారం గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. శుభ కార్యాలలో బిజీగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది.
Also Read: లింగరూపంలో కొలువైన పరమేశ్వరుడి ఆరాధన వెనుకున్న ఆంతర్యం ఇదే!
మిథున రాశి (Gemini Horoscope in Telugu)
ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టొద్దు. కుటుంబంలో శాంతిని కొనసాగించేందుకు ప్రయత్నించండి. సహనం తగ్గుతుంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శ్రమ పెరుగుతుంది. స్నేహితులతో వాదనలకు దూరంగా ఉండండి. నూతన ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు. పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాహన సౌఖ్యం పెరుగుతుంది. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. మేధోపరమైన పనిలో బిజీగా ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu)
ఉద్యోగులు పనిలో ఏకాగ్రత లోపించకుండా చూసుకోవాలి. ఎన్నో ప్రయత్నాల తర్వాత విజయ సాధిస్తారు. మీ ఉన్నతాధికారులు స్పెసిఫికేషన్‌లపై చాలా శ్రద్ధ చూపుతారు. కఠినమైన గడువులతో పని చేయాల్సి రావొచ్చు. పనిలో సహకారం కోసం స్నేహితుల సహకారం కోరుతారు...వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని నిరాశపరచరు. మీకు చాలా అవసరమైనప్పుడు వారు మీ కోసం ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండండి.
Also Read: కార్తీకమాసంలో ఇందులో ఒక్క క్షేత్రం దర్శించుకున్నా చాలు!
సింహ రాశి ( Leo Horoscope in Telugu)
ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. కార్యాలయంలో, వ్యాపారంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. కొత్త ప్రణాళికలతో పనులు ప్రారంభించగలరు. ప్రేమ సంబంధాల తీవ్రత పెరుగుతుంది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. సృజనాత్మక పని పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
కన్యా రాశి (Virgo Horoscope in Telugu)
ఈ రోజు మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా పోరాడే ధైర్యం మీకు లభిస్తుంది. ఈరోజు మీరు మీ దీర్ఘకాల సమస్యకు సమాధానం పొందుతారు. మీ సానుకూల ఆలోచన, నిజాయితీ మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తాయి. మీరు చాలా కాలంగా పని ప్రదేశానికి సంబంధించిన విషయాలతో బాధపడుతూ ఉంటే ఈ రోజు మీరు వాటి నుంచి ఉపశమనం పొందుతారు. అన్నీ పరిష్కారమవుతాయి.
తులా రాశి (Libra Horoscope in Telugu)
ఈ రోజు మీ వైవాహిక జీవితం బావుంటుంది. జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యల నుంచి జీవిత భాగస్వామి సహకారంతో బయటపడతారు. మీ ప్రియమైన వారితో మంచి సమయం స్పెండ్ చేస్తారు. ఉద్యోగులకు పనిపట్ల అంకితభావం పెరుగుతుంది. ఈ రోజు మీరు చేసే పనులు రానున్న రోజుల్లో మీకు శుభఫలితాలనిస్తాయి. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu)
ఈరోజు మీరు మీ కెరీర్ మంచి మలుపు తిరుగుతుంది. మీ నైపుణ్యాన్ని, సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశాలు రావచ్చు. మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి ఇది మంచి సమయం. మీ కృషి, అంకితభావం ఫలించవచ్చు. వ్యాయామంపై దృష్టి సారించాలి. పోషకమైన ఆహారం తీసుకోవాలి. చురుకుగా ఉండేందుకు ప్రయత్నించండి
Also Read: కలిపురుషుడికి - కార్తీక వనభోజనాలకి - ఉసిరిచెట్టుకి లింకేంటి!
ధనుస్సు రాశి (Sagittarius Horoscope in Telugu)
ఆర్థికంగా ఇది మీకు చాలా మంచి రోజు. ఎదురైన చిన్న చిన్న ఆర్థిక సమస్యలను సులభంగా ఎదుర్కొంటారు. రుణం చెల్లించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ కుటుంబ జీవితం ఆనందంతో నిండి ఉండనివ్వండి. మీరు మీ ప్రియమైనవారితో మనసులో మాట చెప్పేయడమే మంచిది. మీరు చేపట్టే పనులకు కుటుంబం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది.
మకర రాశి (Capricorn Horoscope in Telugu)
ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేసేందుకు మంచి రోజు. మీ జీవత ప్రయాణం ప్రకాశవంతంగా ఉంటుంది. కొత్త భూమి కొనుగోలు లేదా పెట్టుబడి పెట్టే అవకాశంతో ఆస్తి లావాదేవీలు వృద్ధి చెందుతాయి. విద్యార్థులు చదువుపై శ్రద్ద పెట్టాలి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
Also Read: కార్తీక పూర్ణిమ ఎందుకు ప్రత్యేకం - ఈ రోజు దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే
కుంభ రాశి (Aquarius Horoscope in Telugu)
ఇది మీకు కలిసొచ్చే సమయం. కెరీర్లో వృద్ధి ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్ గురించి సమచారం పొందుతారు. కుటుంబ జీవితం బావుంటుంది. ఆహారంపై నిర్లక్ష్యం వద్దు. ఆర్థికంగా స్థిరంగా ఉన్న సమయంలోనే అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.
మీన రాశి (Pisces Horoscope in Telugu)
ఈ రోజు మీరు సుఖ దుఃఖాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. మీ ప్రియమైనవారితో మీ భావాలు పంచుకునేందుకు ప్రయత్నించండి. ఆఫీసులో పనితీరు బాగానే ఉంటుంది కానీ అహంకారం ప్రదర్శించవద్దు. డబ్బు సంబంధిత సమస్యలను జాగ్రత్తగా ఎదుర్కోండి. అదనపు వనరుల నుంచి ఆదాయాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను తిరిగి పొందుతారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)