Image Credit: Pinterest
Karthika Masam 2023 Lingashtakam: కార్తీకమాసంలో నిత్య దీపారాధన, ప్రత్యేక పూజ చేసేవారు లింగాష్టకం తప్పనిసరిగా చదువుతారు. ముఖ్యంగా కార్తీకసోమవారం ఉపవాసం ఉన్నవారు లింగాష్టక చదివితే ఉత్తమ ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు. నిరాకారుడిగా లింగరూపంలో కొలువైన భోళాశంకరుడికి ప్రియమైన లింగాష్టకం అర్థం ఇక్కడ తెలుసుకోండి.
బ్రహ్మ మురారి సురార్చిత లింగం -బ్రహ్మ , విష్ణు , దేవతలతో పూజలందుకున్న లింగం
నిర్మల భాషిత శోభిత లింగం - నిర్మలమైన మాటలతో అలంకరించిన లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం - జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం - సదా శివ లింగమా నీకు నమస్కారం !
దేవముని ప్రవరార్చిత లింగం -దేవమునులు , మహా ఋషులు పూజించిన లింగం
కామదహన కరుణాకర లింగం - మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే శివలింగం
రావణ దర్ప వినాశక లింగం - రావణుడి గర్వాన్ని నాశనం చేసిన శివ లింగం
తత్ ప్రణమామి సద శివ లింగం - సదా శివ లింగమా నీకు నమస్కారం !
Also Read: కార్తీకమాసంలో ఇందులో ఒక్క క్షేత్రం దర్శించుకున్నా చాలు!
సర్వ సుగంధ సులేపిత లింగం - మంచి గంధాలు లేపనాలుగా పూసిన లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం - మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం - సిద్ధులు , దేవతలు , రాక్షసులు కీర్తించిన లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం -సదా శివ లింగమా నీకు నమస్కారం !
కనక మహామణి భూషిత లింగం - బంగారం , మహా మణులతో అలంకరించిన శివ లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగం - నాగుపాముని అలంకారంగా చేసుకున్న శివలింగం
దక్ష సుయజ్ఞ వినాశక లింగం - దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం - సదా శివ లింగమా నీకు నమస్కారం !
Also Read: కలిపురుషుడికి - కార్తీక వనభోజనాలకి - ఉసిరిచెట్టుకి లింకేంటి!
కుంకుమ చందన లేపిత లింగం - కుంకుమ , గంధం పూసిన శివ లింగం
పంకజ హార సుశోభిత లింగం - కలువ దండలతో అలంకరించిన లింగం
సంచిత పాప వినాశక లింగం - సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం -సదా శివ లింగమా నీకు నమస్కారం !
దేవగణార్చిత సేవిత లింగం - దేవ గణాలతో పూజలందుకున్న శివలింగం
భావైర్ భక్తీ భిరేవచ లింగం - చక్కటి భావంతో కూడిన భక్తితో పూజలందుకున్నశివ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం - కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం - సదా శివ లింగమా నీకు నమస్కారం !
అష్ట దలోపరి వేష్టిత లింగం -ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం
సర్వ సముద్భవ కారణ లింగం -అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం
అష్ట దరిద్ర వినాశక లింగం - ఎనిమిది రకాల దరిద్రాలను నాశనం చేసే శివ లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం - సదా శివ లింగమా నీకు నమస్కారం !
Also Read: కార్తీక మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు!
సురగురు సురవర పూజిత లింగం - దేవ గురువు (బృహస్పతి), దేవతలతో పూజలందుకున్న శివ లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం - నిత్యం పారిజాతాలతో పూజలందుకున్న శివలింగం
పరమపదం పరమాత్మక లింగం - ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒక స్వర్గము
తత్ ప్రణమామి సదా శివ లింగం -సదా శివ లింగమా నీకు నమస్కారం !
లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్ శివ సన్నిధౌ
శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే
(ఎప్పుడైతే శివుడి సన్నిధిలో లింగాష్టకం చదువుతారో వారికి శివుడిలో ఐక్యం అయ్యేందుకు మార్గం దొరుకుతుంది)
Also Read: కార్తీక పూర్ణిమ ఎందుకు ప్రత్యేకం - ఈ రోజు దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే
Election Result 2023 Astrology: ఎన్నికల ఫలితాల్లో ఈ రాశులవారికి విజయం - వారికి అపజయం, గ్రహాలు చెప్పే ఎగ్జిట్ పోల్ ఇదే!
Horoscope Today December 23rd, 2023: ఈ రాశులవారికి ఆనందం - ఆ రాశులవారికి ఆందోళన, డిసెంబరు 03 రాశిఫలాలు
Astrology: ఈ 5 రాశులవారు అపర చాణక్యులు, వ్యూహం రచిస్తే తిరుగుండదు!
Margashira Masam 2023 Starting Ending Dates: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!
Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
/body>