కొందరు కొంపలంటుకుపోతున్నా కూల్ గా కనిపిస్తారు..హడావుడి పడాల్సిన టైమ్ లో కూడా రిలాక్స్ గా కనిపిస్తారు.
ఇంకొందరు మాత్రం కూల్ గా ఉండాల్సిన టైమ్ లోనూ తెగ హడావుడి పడిపోతారు. అనవసరంగా అరుస్తుంటారు..కోపం ప్రదర్శిస్తుంటారు.
ఎవరు ఎలా ఉంటారో వారి రాశి ఆధారంగా చెప్పొచ్చంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.
మేష రాశిని పాలించే గ్రహం కుజుడు. ఈ రాశి వారికి కోపం, మొండి స్వభావం ఎక్కువ. చిన్న చిన్న విషయాలకే తొందరగా కోపం వచ్చేస్తుంది
వృషభ రాశిని పాలించే గ్రహం శుక్రుడు. ఈ రాశివారు సాధారణంగా ప్రశాంతంగా మర్యాదగా ఉంటారు కానీ ఎవరైనా వారిని మోసం చేయడానికి ప్రయత్నించారని తెలిస్తే మాత్రం విశ్వరూపం చూపిస్తారు
సింహరాశిని పాలించే గ్రహం సూర్యుడు. ఆత్మగౌరవానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. వీరి ఈగోని హక్ట్ చేస్తే మాత్రం అస్సలు తగ్గరు.ఆగ్రహంతో ఊగిపోతారు.
వృశ్చిక రాశిని పాలించే గ్రహం ప్లూటో. వీరిలో భావోద్వేగాలు అధికం. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు కానీ ఎవరైనా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతారు.
మకర రాశి వారిని శాసించే గ్రహం శని. ఇది క్రమశిక్షణ, బాధ్యతకు కేరాఫ్. అపజయం ఎదురైతే మాత్రం భరించలేరు. అనుకోకుండా కోపం వచ్చేస్తుంది.