By: ABP Desam | Updated at : 28 Jan 2022 04:37 PM (IST)
Edited By: Murali Krishna
అఖిలేశ్ యాదవ్
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా భాజపాను గద్దె దిచ్చేందుకు సమాజ్వాదీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రచార సభల్లో తనదైన శైలిలో పంచులు, విమర్శలతో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చెలరేగిపోతున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
భాజపాకు చెందిన నాన్పారా ఎమ్మెల్యే మాధురి వర్మ ఎస్పీ పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్లో అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్.. మథుర నుంచి పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తోన్న వేళ అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీతో భాజపా మైండ్ బ్లాక్ అయిందని అఖిలేశ్ అన్నారు.
గట్టిపోటీ..
ఉత్తర్ప్రదేశ్లో ఐదేళ్లుగా అధికారంలో ఉన్న భాజపా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ అది అధికారం చేజారిపోయేంత స్థితిలో లేదని ఏబీపీ- సీఓటర్ సర్వేలో తేలింది. సమాజ్ వాదీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నప్పటికీ భాజపాకు క్లియర్ అడ్వాంటేజ్ కనిపిస్తోంది. యూపీ అతి పెద్ద రాష్ట్రం. అయినప్పటికీ అన్ని రీజియన్లలోనూ భాజపా ముందడుగు వేస్తోంది. కొన్ని చోట్ల సమాజ్ వాదీ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. అయినా భాజపా పైచేయి సాధించబోతోందని తేలింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భాజపాకు 212 - 224 సీట్ల మధ్య లభించే అవకాశం ఉంది. యూపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 403. 40 శాతం ఓట్లు భాజపా ఖాతాలో పడే అవకాశం ఉంది. ఈ కారణంగా భాజపాకు సాధారణ మెజార్టీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. గట్టి పోటీ ఇస్తున్న సమాజ్ వాదీ పార్టీ 151 నుంచి 163 స్థానాలు లభించే అవకాశం ఉంది. ఆ పార్టీ మిత్రపక్షాలతో కలిసి 34 శాతం ఓట్లను కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: India's Omicron Cases: ఈ దేశానికి ఏమైంది? ఓవైపు ఒమిక్రాన్.. మరోవైపు కరోనా.. కొత్తగా 37 వేల కేసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Politics With Mogulaiah : మొగులయ్య పావుగా బీజేపీ , టీఆర్ఎస్ రాజకీయాలు ! ఆ వీడియోలతో హల్ చల్
TRS ZP Chairman In Congress : కాంగ్రెస్లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !
Anantapur TDP : అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే ! చంద్రబాబు చక్కదిద్దగలరా ?
YSRCP Politics : సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ - వైఎస్ఆర్సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !
AP PCC Chief Kiran : ఏపీ పీసీసీ చీఫ్గా కిరణ్కుమార్ రెడ్డి ! కాంగ్రెస్కు జరిగే మేలెంత ?
CM KCR Tour : జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ గురి, నేటి నుంచి వరుస పర్యటనలు
Nikhat Zareen Profile: ఓవర్నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్ది 12 ఏళ్ల శ్రమ!
CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!
Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!