By: ABP Desam | Updated at : 20 Jul 2022 01:50 PM (IST)
ధాన్యం విషయంలో కేసీఆర్ ప్రభుత్వానిదే తప్పన్న కేంద్రం
TS Vs Center On paddy : కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రబుత్వాల మధ్య ధాన్యం వివాదం మరింత ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పులను ఏకరవు పెడుతూ... కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ లేఖ విడుదల చేసింది. గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం బియ్యం పంపిణీలో తెలంగాణ పూర్తిగా విఫలమయిందని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా కారణంగా పేదలకు ఉచితంగా ఇచ్చేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించింది. ఉచితంగా ఇవ్వాల్సిన బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఏప్రిల్, మే రెండు నెలల కోటా లక్షా 90 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుంచి తీసుకుందని కానీ పేదలకు పంపిమీ చేయలేదని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ స్పష్టం చేసింది.
అదే విధంగా అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలోనూ తెలంగాణ సర్కార్ విఫలమయిందని కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభతు్వం స్డాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను అమలు చేయలేదని తెలిపింది. అందుకే సెంట్రల్ పూల్‌లోకి తెలంగాణ నుంచి బియ్యం సేకరణ నిలిపివేశామన్నారు. ఈ పరిస్థితికి తెలంగాణ ప్రభుత్వమే కారణం అని స్పష్టం చేసింది. కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీల్లో ఎన్నో కీలక అంశాలు వెల్లడయ్యాయని కేంద్రం చెబుతోంది. రైస్ మిల్లుల్లో తనిఖీలు చేసినప్పుడు లక్షల సంఖ్యలో బియ్యం బస్తాలు కనిపించలేదని కేంద్రం ఆరోపించింది. కేవలం 40 మిల్లుల్లోనే కనిపించని బియ్యం బస్తాల సంఖ్య 4, 53, 896 ఉన్నాయని తెలిపింది. 593 రైస్ మిల్లుల్లో లెక్కించడానికి వీలు లేకుండా ధాన్యం నిల్వచేశారన్నారు.
ధాన్యం విషయంలో తాము ఎప్పటికప్పుడు లోపాలు ఎత్తి చూపుతున్నా.. తనిఖీల తర్వాత సూచనలు చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్రం తెలిపిది. లోపాలు సరిదిద్దుతామని హామీ ఇచ్చినా.. పట్టించుకోలేదని గుర్తు చేసింది. అక్రమాలకు పాల్పడినట్లుగా తేలినా మిల్లర్లపై చర్యలు తీసుకోలేదని కేంద్రం తెలిపింది. వీటన్నింటిపై తెలంగాణ సర్కార్‌కు ఎఫ్‌సీఐ రిపోర్ట్ అందచేయాల్సి ఉందని .. ఆ రిపోర్ట్ ఇస్తే.. సెంట్రల్ పూర్‌లోకి తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ఆహార శాఖ తెలిపింది.
ప్రతీ ఏడాది ధాన్యం సేకరణ అంశం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వివాదానికి కారణం అవుతోంది. ఈ సారి కూడా అలాంటి పరిస్థితే ఏర్పడుతోంది. తెలంగాణ సర్కార్ తీరు వల్లే తాము ధాన్యం సేకరించడం లేదని నేరుగా చెప్పడంతో గాటుగా కౌంటర్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ నేతలు కూడా రెడీ అవుతున్నారు.
Rajinikanth as Governor: రజనీకాంత్‌కు గవర్నర్ పోస్ట్ ! బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ? తలైవా అంగీకరించారా ?
Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?
Desh Ki Neta : దేశ్ కీ నేత రేసులో కేజ్రీవాల్ - దేశవ్యాప్తంగా పర్యటనలకు రెడీ !
Freebies Politics : చట్టాలు చేస్తే , తీర్పులు ఇస్తే ఉచిత పథకాలు ఆగుతాయా ? మార్పు ఎక్కడ రావాలి ?
Vijayashanti: పార్టీలో ప్రాధాన్యం లేదు - బీజేపీ నేతల తీరుపై విజయశాంతి అసంతృప్తి !
iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !
WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు