అన్వేషించండి
In Pics: స్కై వాక్‌తో మైండ్ స్పేస్‌కు కొత్త అందాలు, చూపు తిప్పుకోనివ్వదు - ఫోటోలు

కొత్తగా నిర్మించిన స్కై వాక్ నిర్మాణం
1/12

ఐటీ నగరానికి అనుసంధానం అయి ఉన్న చివరి మెట్రో స్టేషన్ రాయదుర్గం నుంచి వివిధ ఐటీ కంపెనీలకు కలుపుతూ నిర్మించిన స్కై వాక్ ఆకట్టుకుంటోంది.
2/12

రాయదుర్గం మెట్రోస్టేషన్, రహేజా మైండ్‌స్పేస్ ఐటీ కారిడార్‌ను కలుపుతూ కిలో మీటరు పొడవున ఈ స్కైవాక్ నిర్మించారు.
3/12

మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్‌ఈఐటీ ఈ స్కై వాక్‌ను రూపకల్పన చేసింది.
4/12

సోమవారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ స్కైవాక్‌ను ప్రారంభించారు.
5/12

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కిలో మీటరు పొడవు, 3.5 మీటర్ల వెడల్పుతో దీన్ని నిర్మించారని అన్నారు.
6/12

రోజుకు 30 వేల మంది దీనిపై ప్రయాణించగలరని అన్నారు.
7/12

మైండ్ స్పేస్ ఐటీ కారిడార్‌ను కలుపుతూ స్కైవాక్ వృత్తాకారంలో ఆకర్షణీయంగా ఉందని తెలిపారు.
8/12

స్కై వాక్‌కు 6 స్టెయిర్ కేస్‌లు, 5 ఎస్కలేటర్లు, 4 లిఫ్టులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
9/12

దివ్యాంగులు కూడా అత్యంత సులభంగా దీనిపై ప్రయాణించేందుకు వీలుగా నిర్మించారని అన్నారు.
10/12

మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్‌ఈఐటీ సీఈవో వినోద్ రోహిరా కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
11/12

స్కై వాక్‌ల మధ్యలో ఇంటర్ సెక్షన్‌లో వింటేజ్ కేఫ్ అందుబాటులో ఉందన్నారు.
12/12

ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, తదితరులు పాల్గొన్నారు.
Published at : 19 Apr 2022 10:30 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion