అన్వేషించండి
Advertisement

Pawan Kalyan: జగన్ గాయం ఏపీకి గాయమా? 30 వేల ఆడబిడ్డలు అదృశ్యమైతే గాయం కాలేదా?
Andhra Pradesh News: కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేపట్టడంతో పాటు, ప్రతి నెల 5వ తేదీ లోపు జీతాలు, TA, DA లు కూటమి ప్రభుత్వంలో ఇస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

జగన్ గాయం ఏపీకి గాయమా? 30 వేల ఆడబిడ్డలు అదృశ్యమైతే గాయం కాలేదా?: పవన్ కళ్యాణ్
1/10

ఆంధ్రా ప్యారిస్ తెనాలి పట్టణాన్ని- వారాహి విజయ భేరీ సభకు వచ్చిన జన ప్రవాహం ముంచెత్తింది. జన సేనానికి మద్దతుగా దారి పొడుగునా జన సైనికులు, వీర మహిళలు గర్జించారు. ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంతగా జనంతో తెనాలి వీధులు కిక్కిరిసిపోయాయి.
2/10

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహిని అధిరోహించి విజయ భేరీ మోగించారు. పార్టీ పీఏసీ ఛైర్మన్, తెనాలి శాసనసభ జనసేన అభ్యర్ధి నాదెండ్ల మనోహర్, కూటమి గుంటూరు పార్లమెంటు అభ్యర్ధి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ లతో పాటు జిల్లా నాయకత్వంతో కలసి ఆంధ్రా ప్యారిస్ అదిరేలా రెండున్నర గంటల పాటు వారాహి వాహనంపై నుంచి రోడ్ షో నిర్వహించారు.
3/10

తెనాలి పట్టణాన్ని ముంచెత్తిన జనప్రవాహంలో వారాహి అడుగు అడుగు ముందుకు కదలగా ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు. రహదారికి చుట్టుపక్కల ఉన్న భవనాలు, చెట్లు, స్థంభాలు మొత్తం జనంతో నిండిపోయాయి. పట్టణం మొత్తం జనసేన జెండాలు, మద్దతుగా తరలివచ్చిన టీడీపీ, బీజేపీ శ్రేణులు ప్రదర్శించిన జెండాలు రెపరెపలాడాయి.
4/10

సుల్తానాబాద్, చెంచుపేటల్లో జనసేన శ్రేణులు గజమాలలతో పవన్ కళ్యాణ్ ని సత్కరించారు. యువత మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అంటూ తమ మొదటి ఓటు జనసేన పార్టీకి వేస్తామంటూ ప్లకార్డులు రాసి ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ కి పూల మాలలు వేసేందుకు అభిమానులు పోటీ పడగా చాలా మంది నుంచి మాలలు స్వీకరించి మెడన ధరించి ఉత్తేజపరిచారు. పొత్తు గెలవాలి.. జగన్ పోవాలి అంటూ రాసిన ప్లకార్డులు అడుగడుగునా దర్శనమిచ్చాయి.
5/10

హల్లో ఏపీ.. బైబై వైసీపీ.. హల్లో తెనాలి.. బైబై వైసీపీ.. అంటూ దారిపొడుగునా మూడు పార్టీల శ్రేణులు నినదించారు. అనంతరం సుల్తానాబాద్, చెంచుపేట, ఫ్లై ఓవర్ మీదుగా పవన్ కళ్యా్ణ్ వారాహి విజయ భేరీ యాత్ర మార్కెట్ సెంటర్ కి చేరుకుంది.
6/10

జనసేన శ్రేణులతో పాటు టీడీపీ, బీజేపీ శ్రేణులు కూడా వారాహి యాత్రకు మద్దతుగా పెద్ద ఎత్తున తెనాలి తరలివచ్చాయి. జనసేన, టీడీపీ రంగులతో కూడిన బెలూన్లు ప్రదర్శిస్తూ గట్టిగా నినాదాలు చేశారు. మార్కెట్ సెంటర్ లో పవన్ కళ్యాణ్ ప్రసంగం విని జనసైనికులు మద్దతుగా నినాదాలు చేశారు.
7/10

కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేపట్టడంతో పాటు, ప్రతి నెల 5వ తేదీ లోపు జీతాలు, TA, DA లు కూటమి ప్రభుత్వంలో ఇస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
8/10

చదువు చెప్పే టీచర్లు, గురువులను లిక్కర్ షాపుల వద్ద డ్యూటీ వేసిన ఘనుడు సీఎం జగన్ అని ఎద్దేవా చేశారు. జగన్ టీచర్లను ఎందుకు గౌరవించడు అని ప్రశ్నించారు. టెన్త్ క్లాస్ పేపర్లు లీక్ చేసిన చరిత్ర ఉందని జగన్ పై విమర్శలు గుప్పించారు.
9/10

జగన్‌కు గాయం అయితే ఏపీకి గాయం అయిందని వైసీపీ నేతలు గోల చేస్తున్నారు. మరి 15 ఏళ్ల అమర్నాథ్ ని కాల్చేస్తే, 30 వేల ఆడబిడ్డలు కనిపించకపోతే రాష్ట్రానికి గాయం అవ్వలేదా ? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
10/10

కూటమి ప్రభుత్వం రాగానే అసెంబ్లీలో ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కోసం చర్చించి ఏడాది లోపు పరిష్కారం కనుక్కోవాలని భావిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. జగన్ లాగ వారం రోజుల్లో అద్భుతం చేస్తామని చెప్పలేదని, ఏడాదిలోగా ఉద్యోగుల పెన్షన్ కు భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
Published at : 14 Apr 2024 11:22 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion