నాడు ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్.. నేడు పెన్సిల్వేనియా వర్సిటీ తొలి మహిళా ప్రెసిడెంట్
విద్యారంగంలో దాదాపు 30 ఏళ్లుగా సేవలు అందించారు నీలి బెండపూడి. మార్కెటింగ్ సబ్జెక్ట్‌ను బోధిస్తూ రకరకాల విభాగంలో కూడా సేవలు అందించారు.
విశాఖలోనే ఇంగ్లీష్‌లో డిగ్రీ చేసిన నీలి... ఆంధ్రా యూనివర్శీటిలో పీజీ పట్టా అందుకున్నారు. తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయారు.
విశాఖలో జన్మించిన ప్రొఫెసర్ నీలి కొత్త చరిత్ర సృష్టించారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అమెరికాలోని టాప్ యూనివర్శిటీల్లో ఒకటిగా ఉన్న పెన్సిల్వేనియా యూనివర్శిటీకి ఒక మహిళ అందులోనూ భారతీయ మహిళ ప్రెసిండెంట్ కావడం నిజంగా చాలా గొప్ప విషయంగా ఆ యూనివర్శిటీ ప్రకటించింది.
నీలి విశాఖలో జన్మించారు. ఉన్నత చదువుల కోసం 1986లో అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆమె కెంటుకీలో ఉండే లూయిస్విల్లే యూనివర్శిటీలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
పెన్ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరనే డిస్కషన్ జరిగినప్పుడు పెన్ స్టేట్ బోర్డు సభ్యులంతా నీలి పేరును సూచించారు. డిసెంబర్ 9న ఈ సమావేశం జరిగిందని... ఏకాభిప్రాయంతో ఆమెనే ఎంపిక చేశారని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది.
పెన్‌స్టేట్‌కు 19వ ప్రెసిడెంట్‌గా ఆమె వచ్చే ఏడాది మొదట్లో బాధ్యతలు తీసుకుంటారు. పెన్ స్టేట్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన నీలి చరిత్రనే తిరగరాశారు. ఓ నల్లజాతీయ మహిళ యూనివర్శిటీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టి రూల్ చేయనున్నారు.
ప్రస్తుతం నీలి బెండపూడి లూయీస్‌విల్లే యూనివర్శిటీకి 18వ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. మార్కెటింగ్ ట్రెండ్స్, వినియోగదారుల ప్రవర్తనపై అవగాహన ఉన్న నిపుణుల్లో ఈమె ఒకరు.
విద్యారంగంలో దాదాపు 30 ఏళ్లుగా ఆమె మార్కెటింగ్‌ను బోధిస్తున్నారు. కాన్సాస్ యూనివర్శిటీలో ఎగ్జిక్యూటివ్ వీసీగా, అదే యూనివర్శిటీలో బిజినెస్ స్కూల్ డీన్‌గా ఉన్నారు. ఒహియో స్టేట్ యూనివర్శిటీలో మేనేజింగ్ సర్వీస్‌కు ఫౌండింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది, ఫ్యాకల్టీ విజయానికి, నేర్చుకొని ఉన్నత స్థానాలు చేరేందుకు నీలి ఎంతగానో శ్రమించారు. విద్యవ్యవస్థలో మార్పులకు తన యావత్ జీవితాన్నే అంకితం చేశారు.
ప్రపంచంలోనే ఉన్నతమైన పెన్ స్టేట్ యూనివర్శిటీలో కొత్త ప్రయాణం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్టు నీలి చెప్పారు. అక్కడ విద్యార్థులు, స్టాఫ్, పూర్వ విద్యార్థులతో కలిసి ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవడానికి గర్వంగా ఉందన్నారామె.
తనపై నమ్మకం ఉంచి పెన్ స్టేట్ ప్రెసిడెంట్‌గా నియమించినందుకు బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు నీలి. ఈ గొప్ప అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్న నీలి... తన మిషన్‌కు, కొత్త శిఖరాలు అందుకోవడానికి ఇది హెల్ప్ అవుతుందన్నారు.
ఇప్పటికే పెన్ స్టేట్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఎరిక్ డే బారన్ స్థానంలో నీలి నియమితులయ్యారు. ఆయన ముఫ్పై ఏళ్లుగా పెన్ స్టేట్ అధ్యక్షుడిగా పని చేసి రిటైర్ అవుతున్నారు.
ప్రొఫెసర్ నీలి బెండపూడికి సాదరంగా స్వాగతం పలికారు పెన్ బోర్డు ఛైర్మన్ మ్యాట్ షుయ్లర్. నీలి చాలా డైనమిక్ లీడరని... కొత్తగా ఆలోచించి తన కేరీర్‌లో ఎన్నో అద్భుతాలు సాధించారని గుర్తు చేశారు. ఉన్నత విద్యను మరింత ఉన్నతంగా తీసుకెళ్లేందుకు ఆమెకు తాము, విద్యార్థులు, స్టాఫ్ అంతా సహకరిస్తామన్నారు.
నీలి బెండపూడి ఇంగ్లీష్‌లో డిగ్రీ పూర్తి చేశారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ఆంధ్రా యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. కన్సాస్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ చేశారు.
Also Read : ఓటీఎస్ స్వచ్చందం..ప్రయోజనాల గురించి లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్న సీఎం జగన్ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి