By: ABP Desam | Updated at : 09 Dec 2021 02:04 PM (IST)
మహిళా కార్యదర్శులను పోలీసులుగా గుర్తించే జీవో వెనక్కి..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. గ్రామ , వార్డు సచివాలయాల్లో నియమించిన గ్రామ మహిళా కార్యదర్శలకు మహిళా పోలీసులుగా గుర్తింపు ఇవ్వాలన్న నిర్ణయంపై పునరాలోచించకుంటామని హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు జారీ చేసిన జీవో నెం.59ని ఉపసంహరించుకుంటామని తెలిపింది. జీఓను ఉపసంహరించి వారి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచిస్తుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also Read : ఓటీఎస్ స్వచ్చందం..ప్రయోజనాల గురించి లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్న సీఎం జగన్ !
ఏపీలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. అందులో గ్రామ మహిళా సంరక్షణ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను నియమించారు. ఇటీవల వారందర్నీ "మహిళా పోలీసులు"గా వ్యవహరించాలని జీవో నెం.59ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. వారు పోలీస్ శాఖలో అంతర్భాగమని ప్రకటిస్తూ వారికి "కానిస్టేబుల్" హోదా కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 14,910 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉన్నారు. ప్రభుత్వ జీవోతో వీరంతా పోలీసు శాఖలో భాగమయ్యారు.
Also Read: Nellore RedCross : రూ. 500కే ఐసీయూ ఆన్ వీల్స్.. నెల్లూరు వాసులకు రెడ్‌క్రాస్ సేవ !
మహిళా పోలీసులకు అవసరమైన శిక్షణతో పాటు యూనిఫాం ఇవ్వాలని.. నిర్ణయించారు. మహిళా పోలీసులు తమ గ్రామ, వార్డు సచివాలయానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు ప్రతినిధులుగా వ్యవహరిస్తారని తెలిపారు. వీరికి పదోన్నతి కోసం అదనపు హెడ్ కానిస్టేబుల్ పోస్టులను సృష్టిస్తారని.. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇలా మహిళా కార్యదర్శులుగా నియమించి పోలీసు విధులు అప్పగించడం చట్టవిరుద్ధమని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హోమ్ సెక్రటరీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఏపీపీఎస్సీ చైర్మన్లకు నోటీసులు జారీ చేసింది.
Also Read : 2024 తరవాత పొలిటికల్ రిటైర్మెంట్ .. సోము వీర్రాజు నిర్ణయం !
గ్రామ మహిళా కార్యదర్శులకు పోలీసు హోదా ఇవ్వడం 1859 ఏపీ డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్ట్‌కు విరుద్ధమని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వారు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జీవోలో సివిల్ వివాదాలను పరిష్కరించవచ్చనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఇది విరుద్ధమని వాదించారు. పోలీస్ శాఖలో నియామకాలు పోలీసు నియామక బోర్డు ద్వారా జరగాలన్నారు. అందుకు భిన్నంగా ప్రభుత్వ నిర్ణ యం ఉందన్నారు. పోలీసుల విధులు నిర్వర్తించే హోం గార్డులను సైతం పోలీసులుగా పరిగణించరన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించడం.. కానిస్టేబుల్‌కు ఉండే అధికారాలు కట్టబెట్టడం చట్ట విరుద్ధమని వాదించారు. చివరికి ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.
Also Read : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఇప్పుడు డబ్బులు ఎందుకు కట్టాలి?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
AP RCET: ఫిబ్రవరి 9 నుంచి 'ఏపీఆర్‌సెట్' రెండో విడత కౌన్సెలింగ్! సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
Minister Meruga Nagarjuna: మంత్రి మేరుగ నాగార్జున వల్ల తనకు ప్రాణహాని ఉందని మాజీ సర్పంచ్ భర్త ఆరోపణలు!
Kakinada Crime: జల్సాలకు అలవాటుపడి వరుస చోరీలు, నిద్రపోతున్న ప్రయాణికులే వీరి టార్గెట్!
YSRCP Politics: వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో 99.5 శాతం హామీలు నెరవేర్చింది: మాజీ మంత్రి పార్థసారథి
Gunadala Mary Mata Festival: ఈ 9 నుంచి గుణదల మేరీ మాత ఉత్సవాలు - అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
‘వసుమతి’కి పెళ్లైపోయింది - బాలీవుడ్ హీరో సిద్ధార్థ్‌తో ఘనంగా కియారా వెడ్డింగ్, ఒక్కరోజుకు అంత ఖర్చా?
MLC Kavitha: ఈ నెల 10న చెన్నైకి ఎమ్మెల్సీ కవిత - 2024 ఎన్నికల చర్చకు హాజరు!
Kadiyam Srihari On Sharmila: జగన్ జైలుకు వెళ్తే సీఎం చాన్స్ - ఏపీకి వెళ్లాలని షర్మిలకు కడియం శ్రీహరి సలహా !
Kiranmayee Alivelu: మిసెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలంగాణ అందం!
YS Jagan: 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు - ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం జగన్ ప్రకటన