CM Jagan Review : ఓటీఎస్ స్వచ్చందం..ప్రయోజనాల గురించి లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్న సీఎం జగన్ !
ఓటీఎస్ పథకం అమలులో ఎలాంటి బలవంతం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. పథకం లాభాలను లబ్దిదారులకు వివరించాలని అధికారులను ఆదేశించారు.
వన్ టైం సెటిల్మెంట్, సంపూర్ణ గృహ హక్కు పథకం పూర్తిగా స్వచ్చందమని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. గృహ నిర్మాణం, ఓటీఎస్ పథకంపై సీఎం జగన్ బుధవారం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఓటీఎస్ విషయంలో లబ్దిదారులను బెదిరిస్తున్నారని.. పథకాలు ఆపేస్తామని భయపెడుతున్నారంటూ తీవ్రమైన విమర్శలు వస్తున్న కారణంగా జగన్ ఈ అంశంపై అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఓటీఎస్‌పై అవగాహాన కల్పించాలి.. కానీ బలవంతం చేయవద్దన్నారు. ఓటీఎస్ అనేది పూర్తి స్వచ్ఛందమని స్పష్టంచేశారు.
Also Read: Nellore RedCross : రూ. 500కే ఐసీయూ ఆన్ వీల్స్.. నెల్లూరు వాసులకు రెడ్‌క్రాస్ సేవ !
పేదల ఇళ్ల లబ్దిదారులపై ఉన్న రూ.10వేల కోట్ల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని .. ఆ విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలన్నారు. రుణాలు మాఫీ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేస్తున్నామని ... క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ జరుగుతోందని సీఎం స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత వారికి సంపూర్ణ హక్కులు వస్తాయనన్నారు. ఆ ఇళ్లను వారు అవసరాలకు అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చు.. అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని పేర్కొన్నారు. పేదలకు మంచి అవకాశం కల్పిస్తున్నామని గుర్తు చేశారు.
Also Read : 2024 తరవాత పొలిటికల్ రిటైర్మెంట్ .. సోము వీర్రాజు నిర్ణయం !
పేదలకు గొప్ప అవకాశం కల్పిస్తున్నామని ఆ అవకాళాలు వాడుకోవాలా? లేదా? అన్నది వారిష్టమని సీఎం జగన్ తెలిపారు. 21వ తేదీ నుంచి అందరికీ డాక్యుమెంట్లు ఇస్తామన్నారు. భవిష్యత్తులో గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతాయని సీఎం తెలిపారు. ఓటీఎస్ స్కీమ్‌ను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అనేక చోట్ల పేదలు డబ్బులు కట్టేందుకు సిద్ధపడటం లేదు. ఈ కారణంగా వాలంటీర్లు, ఇతర అధికారులు ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తామని బెదిరించి ఓటీఎస్ డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
Also Read : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఇప్పుడు డబ్బులు ఎందుకు కట్టాలి?
విపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఈ తరహా విమర్శలు చేస్తూండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈ పథకం విషయంలో బలవంతం ఏమీ లేదని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. అయినా కొంత మంది అధికారుల అత్యుత్సాహంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటికీ సమీక్షలో సీఎం జగన్ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి