అన్వేషించండి

Morning Top News: ట్రంప్‌ గెలుపుతో మనకు వచ్చేదేంటి ? ఏపీలో సోషల్ మీడియా అరెస్టులు వంటి మార్నింగ్ టాప్ న్యూస్

Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.

తెలంగాణ డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్

డీఎస్సీ-2008లో పరీక్ష రాసి కామన్‌మెరిట్‌లో క్వాలిఫై అయి ఉద్యోగాలు రానివారి అభ్యర్థుల పోరాటం ఫలించింది. వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఉద్యోగాలు చేతికి అందే టైంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వేల మంది నష్టపోయారు. అయితే వారిలో కొందరు తర్వాత పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించారు. ఏపీలో కూడా ఇలాంటి బాధితులకు ప్రభుత్వం కాంట్రాక్ట్ పోస్టులు కట్టబెట్టింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి ప్రక్రియ చేపట్టింది ప్రభుత్వం.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
వైసీపీ చేసిన తప్పే టీడీపీ చేస్తోందా..?
ఏపీలో కూటమి సర్కార్ ఇప్పటివరకూ కక్ష రాజకీయాలకు పాల్పడలేదు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో  టీడీపీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిని అరెస్ట్ చేసింది. దీనిపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు కూటమి కూడా వైసీపీ చేసిన తప్పే చేస్తోందన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఇంట్లో ఆడవాళ్లను బూతులు తిడుతూ పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అని మరికొందరు గట్టిగా వాదిస్తున్నారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
బోరుగడ్డ అనిల్‍‌కు రాచమర్యాదలు.. పోలీసులపై వేటు!
వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు రాచమర్యాదలు చేసిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఓ రెస్టారెంట్‌లో విందు భోజనం చేశారు. ఈ ఘటనను టీడీపీ కార్యకర్తలు సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరిస్తుండగా.. పోలీసులు ఫోన్ లాక్కుని వీడియో డిలీట్ చేశారట. దీనిపై సీరియస్ అయిన సర్కార్.. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
మద్యం ప్రియులకు షాక్
రాష్ట్రవ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. డిపోల నుంచి డీలర్లు మద్యం తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో మద్యం సరఫరా ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సర్వర్‌‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మద్యం సరఫరా నిలిచిపోయిందని, రాత్రి వరకు సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
జగన్‌కు ప్రోటోకాల్ తెలియదా.. ? మాధవి రెడ్డి ఆగ్రహం
వైసీపీ ప్రజాప్రతినిధులు భయపడి జిల్లా డీఆర్సీ సమావేశానికి రాలేదని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. 'డీఆర్సీ మీటింగ్‌కు రావాలని కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలియదా? ప్రోటోకాల్ ప్రకారం ఈ సమావేశానికి రావాలని జగన్‌కు తెలియదా? అసలు జగన్ ఎక్కడ? అవినాష్ రెడ్డి ఎక్కడ ఎందుకు ఈ సమావేశానికి జగన్ రాలేదు' అని మాధవి రెడ్డి ప్రశ్నించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రెండోసారి విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. మరోసారి ఇద్దరం కలిసి పనిచేద్దామని, ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునే దిశగా చర్యలు తీసుకుందామని అన్నారు. సమష్టిగా ప్రజల అభివృద్ధికి, ప్రపంచ శాంతి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కాగా, ఇప్పటికే ట్రంప్‌కు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే. ఇంతకీ ట్రంప్‌ గెలుపు భారత్ కు లాభామా, నష్టమా పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
ఆరుగురు భారతీయ అమెరికన్లకు US హౌస్‌లో సీట్లు
US హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఆరుగురు భారతీయ అమెరికన్లు సీట్లు పొందారు. వర్జీనియా, ఈస్ట్ కోస్ట్ నుంచి ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌గా సుహాస్ సుబ్రమణ్యం చరిత్ర సృష్టించారు. మిచిగాన్ 13వ స్థానం నుంచి తానేదార్, ఇల్లినాయిస్ 8వ స్థానం నుంచి రాజా కృష్ణమూర్తి, కాలిఫోర్నియా 17వ స్థానం నుంచి రో ఖన్నా, వాషింగ్టన్ 7వ స్థానం నుంచి ప్రమీలా జయపాల్, కాలిఫోర్నియా నుంచి డాక్టర్ అమీ బెరా మరోసారి ఎన్నికయ్యారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
వైట్ హౌస్ చరిత్ర తెలుసా..?
అమెరికా అధ్యక్షుడి పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది వైట్ హౌస్. ప్రపంచంలోనే అత్యంత  శక్తివంతమైన దేశమైన అమెరికా ప్రెసిడెంట్ నివాస, కార్యాలయం వైట్ హౌస్. ఇక్కడి నుంచే అమెరికన్ ప్రెసిడెంట్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వైట్ హౌస్ నిర్మాణం 1792లో ప్రారంభమై 1800 నాటికి పూర్తయింది. జేమ్స్ హోబన్ అనే ఐరిష్ ఆర్కిటెక్ దీన్ని రూపొందించారు. నియో క్లాసికల్  పద్ధతిలో ఈ శ్వేత భవనాన్ని నిర్మించారు. 18 ఎకరాల్లో నిర్మించిన ఈ పురాతన భవనం కొలువు దీరింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
 
85 లక్షల అకౌంట్లు బ్లాక్ చేసిన వాట్సాప్
సెప్టెంబర్‌లో పాలసీని ఉల్లంఘించిన 85 లక్షలకు పైగా భారతీయ వాట్సాప్ ఖాతాలను మెటా నిషేధించింది. ఈ విషయాన్ని కంపెనీ తన నెలవారీ నివేదికలో వెల్లడించింది. వినియోగదారుల భద్రతను పెంచడానికి, ప్లాట్‌ఫారమ్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. అంతకుముందు ఆగస్టులో భారతదేశంలో 84 లక్షల ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

భారత్ టెస్ట్ సిరీస్ ఓటమిపై  రికీ పాంటింగ్ ఏమన్నాడంటే

ఇటీవల రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో వైట్ అయిపోయింది. సొంతగడ్డపై కివీస్‌తో వరుసగా మూడు టెస్టుల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ నేపధ్యంలో నవంబర్ 22న ప్రారంభం కానున్న ఈ కీలక సిరీస్ భారీ తేడాతో నెగ్గి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలని భారత్ భావిస్తోంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భారత్ ను ఆసీస్ జట్టు చిత్తు చేస్తుందని మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Viveka Murder: ఒక హత్య.. ఆరు మరణాలు.. అంతుచిక్కని ఈ మిస్టరీకి అంతం ఎప్పుడు.. ?
ఒక హత్య.. ఆరు మరణాలు.. అంతుచిక్కని ఈ మిస్టరీకి అంతం ఎప్పుడు.. ?
Heart Attack : గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఈ 7 పనులు చేయండి.. హార్ట్​కి చాలా మంచిది
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఈ 7 పనులు చేయండి.. హార్ట్​కి చాలా మంచిది
SSMB 29: ట్రెండింగ్‌లో #SSMB29 - లీకులపై స్పందించిన జక్కన్న టీం.. నెక్స్ట్ ఆ లొకేషన్లలో భారీ భద్రత మధ్య షూటింగ్
ట్రెండింగ్‌లో #SSMB29 - లీకులపై స్పందించిన జక్కన్న టీం.. నెక్స్ట్ ఆ లొకేషన్లలో భారీ భద్రత మధ్య షూటింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడాRohit Sharma Champions Trophy 2025 | 9నెలల్లో రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మInd vs Nz Champions Trophy 2025 Final | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Viveka Murder: ఒక హత్య.. ఆరు మరణాలు.. అంతుచిక్కని ఈ మిస్టరీకి అంతం ఎప్పుడు.. ?
ఒక హత్య.. ఆరు మరణాలు.. అంతుచిక్కని ఈ మిస్టరీకి అంతం ఎప్పుడు.. ?
Heart Attack : గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఈ 7 పనులు చేయండి.. హార్ట్​కి చాలా మంచిది
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఈ 7 పనులు చేయండి.. హార్ట్​కి చాలా మంచిది
SSMB 29: ట్రెండింగ్‌లో #SSMB29 - లీకులపై స్పందించిన జక్కన్న టీం.. నెక్స్ట్ ఆ లొకేషన్లలో భారీ భద్రత మధ్య షూటింగ్
ట్రెండింగ్‌లో #SSMB29 - లీకులపై స్పందించిన జక్కన్న టీం.. నెక్స్ట్ ఆ లొకేషన్లలో భారీ భద్రత మధ్య షూటింగ్
Rohit Sharma Records: 37 ఏళ్ల కరువు తీర్చేసిన రోహిత్ శర్మ, అరుదైన భారత కెప్టెన్‌గా నిలిచిన హిట్ మ్యాన్
37 ఏళ్ల కరువు తీర్చేసిన రోహిత్ శర్మ, అరుదైన భారత కెప్టెన్‌గా నిలిచిన హిట్ మ్యాన్
TDP MLC Candidates: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
Telangana Latest News: ఎమ్మెల్సీగా విజయశాంతి-  అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
ఎమ్మెల్సీగా విజయశాంతి- అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
Garimella Balakrishna Prasad Passes Away: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
Embed widget