అన్వేషించండి

WhatsApp: 85 లక్షల అకౌంట్లు బ్యాన్ చేసిన వాట్సాప్ - ఎందుకు చేసిందంటే?

WhatsApp Accounts Banned: సెప్టెంబర్‌లో పాలసీని బ్రేక్ చేసినందుకు మనదేశంలో 85 లక్షలకు పైగా వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. దీనికి సంబంధించిన నివేదికను వాట్సాప్ విడుదల చేసింది.

September WhatsApp Accounts Banned: సెప్టెంబర్‌లో పాలసీని ఉల్లంఘించిన 85 లక్షలకు పైగా భారతీయ వాట్సాప్ ఖాతాలను మెటా బ్యాన్ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ తన నెలవారీ నివేదికలో వెల్లడించింది. వినియోగదారుల భద్రతను పెంచడానికి, ప్లాట్‌ఫారమ్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి కంపెనీ ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. అంతకుముందు ఆగస్టులో భారతదేశంలో 84 లక్షల ఖాతాలను వాట్సాప్ నిషేధించింది.

వాట్సాప్ నివేదిక ప్రకారం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ మధ్య 85,84,000 ఖాతాలను నిషేధించింది. వాటిలో 16,58,000 ఖాతాలను వినియోగదారుల నుంచి ఎటువంటి నివేదికను అందుకోకముందే బ్లాక్ చేశారు. 60 కోట్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న వాట్సాప్‌కు సెప్టెంబర్ నెలలో 8,161 ఫిర్యాదులు అందాయి. వాటిలో 97 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారు.

Also Read: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?

అకౌంట్లు బ్యాన్ చేయడంపై కంపెనీ ఏం అంటోంది?
వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేసే విషయంలో కంపెనీ ఇలా చెప్పింది. "మా పనిలో పారదర్శకత ఉండేలా చూసుకుంటాం. భవిష్యత్ నివేదికలలో మా ప్రయత్నాల గురించి సమాచారాన్ని చేర్చుతాం." అని చెప్పింది. "యాప్‌లోనే ఏదైనా కాంటాక్ట్స్‌ను బ్లాక్ చేయడానికి, రిపోర్ట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తాం. అలాగే యూజర్ ఫీడ్‌బ్యాక్‌పై చాలా శ్రద్ధ వహిస్తాం. తప్పుడు సమాచారాన్ని నిరోధించడానికి, సైబర్‌ సెక్యూరిటీని ప్రోత్సహించడానికి నిపుణులతో పని చేస్తూనే ఉంటాం." అని కూడా తెలిపింది

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2021లో ఐటీ నిబంధనలను అమలు చేసింది. దీని ప్రకారం 50 లక్షల కంటే ఎక్కువ మంది వినియోగదారులతో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు నెలవారీ నివేదికలను జారీ చేయడం తప్పనిసరి. ఈ నివేదిక వినియోగదారుల ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలను పేర్కొంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021లోని రూల్ 4(1)(D), రూల్ 3A(7) ప్రకారం ఈ చర్య తీసుకున్నారు. వినియోగదారుల సెక్యూరిటీని నిర్ధారించడానికి దీన్ని అమలు చేశారు.

Also Read: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Embed widget